KidsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/children00f634d0-89a1-4bd5-b2a7-ef7a5cefdab2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/children00f634d0-89a1-4bd5-b2a7-ef7a5cefdab2-415x250-IndiaHerald.jpgశీతాకాలంలో చాల మంది పిల్లలు జలుబు, పుండ్లు బారిన పడుతుంటారు. అయితే పిల్లలను వీటినుండి రక్షించడానికి తరచుగా చేతులు కడుక్కోవడం అనేది జర్మస్ ద్వారా వచ్చే ఈ వ్యాధిని అరికట్టేందుకు ఉత్తమమైన మార్గము. గోరువెచ్చని నీటితో తేలికపాటి సబ్బుతో కనీసం 20 సెకండ్ల పాటు చేతులను శుభ్రపరచుకోవాలి. జర్మ్స్ కొరకు ఒక నియమం పాటించవలసిన అవసరం ఉంటుంది.children;thulasi;school;tulasi;doctor;ginger;garlic;aqua;nijam;joshబుడుగు: పిల్లలలో జలుబు, పుండ్లు నివారణకు ఈ చిట్కాలు పాటించండి..!?బుడుగు: పిల్లలలో జలుబు, పుండ్లు నివారణకు ఈ చిట్కాలు పాటించండి..!?children;thulasi;school;tulasi;doctor;ginger;garlic;aqua;nijam;joshFri, 08 Jan 2021 17:00:00 GMTపాఠశాల నుండి లేదా ఆటస్థలం నుండి తిరిగి వచ్చిన తర్వాత భోజనానికి ముందుఈ వ్యాధి సోకిన పిల్లల్లో దగ్గు, తుమ్ములు వచ్చే సమయంలో నోరు మరియు ముక్కును కప్పి ఉంచుకునేలా చూసుకోండి.

ఇక చల్లటి వాతావరణంలో చిన్నపిల్లలను ఆరు బయటకు తీసుకు వెళ్లడం మానుకోండి. వెచ్చని బట్టలు, టోపీలు, స్వెట్టర్లు, మిట్టెన్లు పిల్లలకు చలినుండి రక్షణను అందిస్తాయి. ఇన్ఫ్లూయెంజా వ్యాక్సిన్ అన్నది ఎంతో అవసరం. ఎందుకంటే ఇది పిల్లలలో ప్రతిరోధకాలు ఏర్పడటానికి సహాయపడుతుంది. ఫ్లూ సంభవించకుండా అరికడుతుంది.

డాక్టర్ సూచించిన ఔషధాలతోపాటు జలుబు, ఫ్లూ లక్షణాలు తగ్గించడానికి వ్యాధి నుంచి త్వరగా బయట పడటానికి కొన్ని గృహ నివారణలు ఇక్కడ ఉన్నాయి. గోరువెచ్చని నీటితో గార్గిలింగ్ చేయడం వలన మంచి ఉపశమనం లభిస్తుంది. దీని వలన గొంతు నొప్పి కూడా ఎంత ఉపశమనం దొరుకుతుంది. దగ్గుకి మంచి ఉపశమనాన్ని కలిగించే అల్లంతో టీ తయారు చేసి ఇవ్వడం కూడా దగ్గుకు మరొక నివారణ.

4 ఏలకలు, 4 లవంగాలు, చిన్న అల్లం ముక్క చిన్న దాల్చిన చెక్కను ఒక గ్లాసు నీటిలో సుమారు పది నిమిషాల పాటు ఉడికించి అందులో కొంచెం తేనెను కలిపి నిలువ చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు స్పూన్లు పిల్లలకు ఇచ్చినట్లయితే ఎంతో ఉపశమనం లభిస్తుంది. తులసి ఆకులను వేసి టీ తయారు చేసుకోవచ్చు. ఇది నిజంగా ముక్కుదిబ్బడను తొలగించడానికి సహాయపడుతుంది. గొంతు నొప్పికి తేనె ఒక అద్భుతమైన ఔషధం. మీరు ఒక చెంచా తేనెలో కొంచెం అల్లంరసం వేసి ఇచ్చినట్లయితే నెమ్ము తో పాటు గొంతునొప్పిని  కూడా నయం చేయడానికి పిల్లలకు సహాయపడుతుంది.

 జోష్ అండా చావన్ ప్రాష్  వంటి మౌలిక సమ్మేళనాలు పిల్లల రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి మరియు గొంతు నొప్పి జలుబును తగ్గించడానికి సమర్థవంతంగా పని చేస్తాయి. నవజాత శిశువులలో సంభవించే జలుబును తగ్గించడానికి వెల్లుల్లి రెబ్బలు, లవంగాలను ఒక బట్టలో కట్టి మెడ దగ్గర ఉంచినట్లయితే వెల్లుల్లి యొక్క  వాసన శిశువు పీల్చుకున్నప్పుడు నాసికా మార్గాన్ని సులభతరం చేయడానికి సహాయపడుతుంది.


100% ఆక్యుపెన్సీకి సాధ్యమయ్యేనా..?

ఒకేరోజు 9 ఆలయాలకు సీఎం జగన్ భూమి పూజ

ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎం లకు క్లిష్ట పరిస్థితులు...?

జీవ‌తా రాజ‌శేఖ‌ర్ ఎమ్మెల్యేగా పోటీ... ఆ సీటుపైనే గురి పెట్టారా..!

విచార‌ణ‌లో షాకింగ్ విష‌యాలు చెప్పిన అఖిల‌ప్రియ‌

తెలంగాణ‌ను క‌బ‌ళిస్తోన్న బ‌ర్డ్ ఫ్లూ... కోళ్ల బిజినెస్ కుదేలు.. ఏపీలోనూ ఇంత డేంజ‌రా..?

కేజీఎఫ్ 2 టీజ‌ర్ తుస్సుమందే... యూ ట్యూబ్‌లో పేల‌లేదు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>