HealthNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/gym-hygiene63d9d152-22c7-4855-ae19-0dad6dff2562-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/gym-hygiene63d9d152-22c7-4855-ae19-0dad6dff2562-415x250-IndiaHerald.jpgశారీరకంగా యాక్టివ్ గా ఉండడం మంచిదన్న విషయం ఈ మధ్యకాలంలో చాలా మందికి అర్థమవుతోంది. అందుకోసం జిమ్ కు వెళ్ళడానికి చాలామంది ప్రయారిటీ ఇస్తున్నారు. కానీ వర్కవుట్ సమయంలో పాటించాల్సిన బేసిక్ హైజీన్ రూల్స్ గురించి కొందరు మాత్రం అశ్రద్ధ వహిస్తున్నారు. వీటి వల్ల జిమ్ కు వెళ్లడం వలన పెద్దగా ప్రయోజనం కలగదు. gym hygiene;tara;bacteriaజిమ్ విషయంలో ఈ రూల్స్ పాటించకపోతే అంతే సంగతులు..!జిమ్ విషయంలో ఈ రూల్స్ పాటించకపోతే అంతే సంగతులు..!gym hygiene;tara;bacteriaFri, 08 Jan 2021 16:00:00 GMT
సరైన హైజీన్ రూల్స్ ను పాటించడం వలన వ్యాధులను కలిగించే క్రిముల నుంచి రక్షణను పొందవచ్చు. ప్రస్తుత కాలంలో ఇది అత్యంత ముఖ్యమైన అంశమని చెప్పుకోవచ్చు. మరి జిమ్ విషయంలో పాటించాల్సిన రూల్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలామంది తమ జిమ్ దుస్తులతోనే అంటే టీషర్ట్ తోనే తమ ముఖంపై పట్టిన చెమటను తుడుచుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఇది మంచి పద్దతి కాదు. టీషర్ట్ మీద ఉన్న జెర్మ్స్ అనేవి ముఖంపై చేరి నోరు, ముక్కు అలాగే కళ్ళల్లోకి చేరతాయి. కాబట్టి, వర్కవుట్ కు వెళ్ళేటప్పుడు టవల్ ను తీసుకువెళ్లడం మరచిపోకండి.

వర్కవుట్ తరువాత ఎక్విప్మెంట్ ను వైప్ చేయాలి. ఇంట్లోని వర్కవుట్ చేసినా లేదా జిమ్ లోని వర్కవుట్ చేసినా వర్కవుట్ ఎక్విప్మెంట్ ను శుభ్రపరచుకోవడం మాత్రం తప్పనిసరి. క్రిములకు చెమటతో నిండిన వర్కవుట్ ఎక్విప్మెంట్ పై నివాసం ఉండటం ఇష్టం. కాబట్టి, శానిటైజర్ స్ప్రే తో లేదా తడి యాంటీ బాక్టీరియల్ వైప్స్ తో ప్రతి యూసేజ్ తరువాత ఎక్విప్మెంట్ ను శుభ్రపరచాలి.

ప్రస్తుత పరిస్థితుల్లో షేరింగ్ అనేది కేరింగ్ కాదని గుర్తుంచుకోండి. టవల్స్, ఇయర్ ఫోన్స్, బాటిల్స్ వంటివాటిని షేర్ చేసుకుంటే బాక్టీరియా కూడా షేర్ అవుతుంది. కాబట్టి, ఎవరి వస్తువులను వారే వాడుకోవాలి.

చేతులను ఎప్పటికప్పుడు వాష్ చేసుకోకపోతే బాక్టీరియా దాడి చేసే అవకాశం ఎక్కువవుతుంది. కాబట్టి, చేతులను కనీసం 20 సెకండ్ల పాటు వాష్ చేసుకోవాలి. ఒక వేళ చేతులు కడుక్కోవడానికి అవకాశం లేకపోతే 60 శాతం ఆల్కహాల్ కలిగిన శ్యానిటైజర్ ను వాడాలి. ఈ విధంగా బాక్టీరియా నుంచి ఎప్పటికప్పుడు దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి.

జిమ్ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగినవారవుతారు.




విజ‌య‌సాయి ముందు మంత్రి ఆవేద‌న‌.. జ‌గ‌న్‌కు చెపుతాన‌ని ఓదార్పు..!

ఒకేరోజు 9 ఆలయాలకు సీఎం జగన్ భూమి పూజ

ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎం లకు క్లిష్ట పరిస్థితులు...?

జీవ‌తా రాజ‌శేఖ‌ర్ ఎమ్మెల్యేగా పోటీ... ఆ సీటుపైనే గురి పెట్టారా..!

విచార‌ణ‌లో షాకింగ్ విష‌యాలు చెప్పిన అఖిల‌ప్రియ‌

తెలంగాణ‌ను క‌బ‌ళిస్తోన్న బ‌ర్డ్ ఫ్లూ... కోళ్ల బిజినెస్ కుదేలు.. ఏపీలోనూ ఇంత డేంజ‌రా..?

కేజీఎఫ్ 2 టీజ‌ర్ తుస్సుమందే... యూ ట్యూబ్‌లో పేల‌లేదు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>