PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-politics-in-ap0dc62391-7a04-42b0-9b31-681ff46524e5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-politics-in-ap0dc62391-7a04-42b0-9b31-681ff46524e5-415x250-IndiaHerald.jpgఏపీ బీజేపీ రాజకీయాలలో గ్రూపులు ఎక్కువున్నట్లు తెలిసింది. ఒకప్పుడు కేంద్రంలో మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడుకు ఇక్కడ ఒక ప్రత్యేక గ్రూపు ఉండేది. ఈ గ్రూపు ఎవరితోనూ కలవడం లేదు. పోనీ.. తమంతటతామైనా.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తోందా? అంటే.. అది కూడా లేదు. bjp politics in ap;venkatesh;ramu;srinivas;bharatiya janata party;andhra pradesh;media;daggubati venkateswara rao;daggubati purandeswari;central government;venkaiah naidu;rama tirtha;party;haribabu kambhampatiసోము వీర్రాజు బీజేపీ అధ్యక్షునిగా కొనసాగగలరా ...?సోము వీర్రాజు బీజేపీ అధ్యక్షునిగా కొనసాగగలరా ...?bjp politics in ap;venkatesh;ramu;srinivas;bharatiya janata party;andhra pradesh;media;daggubati venkateswara rao;daggubati purandeswari;central government;venkaiah naidu;rama tirtha;party;haribabu kambhampatiFri, 08 Jan 2021 12:00:00 GMTఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రామతీర్థం లో రాముని విగ్రహం ద్వంసం చేసిన తరువాత మరింత వేడెక్కాయి. ఇక్కడ అన్ని పార్టీలు కలిసి మూకుమ్మడిగా అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారు. అయితే తరువాత ఈ కేసును సీఐడీ దర్యాప్తు చేస్తుండడం తెలిసిందే. కొద్ది రోజుల తరువాత పూర్తి వివరాలు  తెలియనున్నాయి. ఇదంతా ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు కు కాలం కలిసి రావడం లేదనే చెప్పాలి.. ఎందుకంటే ఆయన ప్రణాళిక ప్రకారం ఏ విషయం జరగడం లేదు. మంచి ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నాడు కానీ సహకారం కరువయినట్లుగా అనిపిస్తూ ఉంది. పార్టీ లోని నాయకులు అంతా తనకు అనుకూలమగా లేరనే వాదనలు వినిపిస్తున్నాయి. సోము వీర్రాజు అధ్యక్షుడిగా వచ్చినప్పటి నుండి తాను వేసే ప్రతి అడుగు పార్టీని ముందుకు తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యంగా వేస్తున్నారు.

 తద్వారా 2024 లో బీజేపీ ని ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలోకి తీసుకురావాలన్నదే తన అంతిమ లక్ష్యం. దీనికి నిదర్శనమే ఆయన పని తీరులో కనిపించే దూకుడు తనం. ప్రారంభంలో కాస్త తడబడినా..తిరిగి పుంజుకోవడానికి ఎన్నో రోజులు పట్టలేదు. పార్టీ అభివృద్ధికి ఉపయోగపడే ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా సోము వీర్రాజు దూసుకు పోతున్నాడు. ఇప్పుడు ఏపీలో ప్రధానంగా కనిపిస్తున్న సమస్యలలో హిందూ దేవాలయాలపై దాడులు జరగడం, విగ్రహాలను ద్వంసం చేయడం. ఈ విషయంలో సోము వీర్రాజు పట్టు వదలకుండా మీడియా ముందు ప్రభుత్వం వారి చేతకాని తనాన్ని ఎండగడుతున్నారు. ఎప్పటికప్పుడు ఆ విషయాలపై స్పందిస్తూ అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఇదే క్రమంలో వీటిపై నిరసన తెలియచేయడానికి యాత్రలు చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఇందులో భాగంగా తమ పొత్తు పార్టీ జనసేనతోనూ కలిసి ముందుకు సాగుతున్నారు.

ఇక్కడ వరకు బాగానే ఉన్నప్పటికీ..పార్టీకి అనుకున్నంత స్థాయిలో హైప్ రావడం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒక వైపు తెలంగాణలో బండి సంజయ్ సారధ్యంలో బీజేపీ దూసుకుపోతుంటే, ఇక్కడ మాత్రం నత్త నడకన సాగుతోంది వ్యవహారం అంటూ విమర్శలు రానే వచ్చాయి. నిజానికి ఏపీ బీజేపీ రాజకీయాలలో గ్రూపులు ఎక్కువున్నట్లు తెలిసింది. ఒకప్పుడు కేంద్రంలో మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడుకు ఇక్కడ ఒక ప్రత్యేక గ్రూపు ఉండేది. ఈ గ్రూపు ఎవరితోనూ కలవడం లేదు. పోనీ.. తమంతటతామైనా.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తోందా? అంటే.. అది కూడా లేదు. ఈ గ్రూప్ రాజకీయాల వలన కొందరు ముఖ్యమైన నాయకులు సోము వీర్రాజు కార్యక్రమాలకు దూరంగా అంటున్నారని అపవాదు ఉంది. అయితే వీరందరినీ కలుపుకుని పోవడంలో సోము విఫలమయ్యాడా...ఇంతకీ దగ్గుబాటి పురంధేశ్వరి, కంభంపాటి హరిబాబు, కామినేని శ్రీనివాస్ లు పార్టీ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉన్నారు. భవిష్యత్తులో వీరిని కలుపుకుని పోతారా...లేదా ఏకాకిగానే సోము తన రాజకీయ సమరాన్ని కొనసాగిస్తారా చూడాలి...!


గుణశేఖర్ కు కలసి వచ్చిన పూజ సమంత ల ఇగో ప్రాబ్లమ్స్ ?

నేను వైసీపీ కార్యకర్తనే... మీకు అభ్యంతరం ఏంటి ? - రాపాక సంచలన వ్యాఖ్యలు

జో బైడెన్ గెలిచిన వెంటనే.. ఉత్తర కొరియా అధ్యక్షుడు ఏం చేశాడో చూడండి

కొత్త తరహా మోసాల నేపధ్యంలో బ్యాంకు కష్టమర్లకు RBI హెచ్చరికలు...

రెండు రాష్ట్రాల్లో దిగిన ఆ నలుగురు ఎవరు...?

బాహుబలి మేనియా గుర్తు చేస్తున్న K.G.F చాప్టర్ 2..!

తెలంగాణకు ఎక్కువ డోసులు !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>