PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/can-bird-flu-infect-humans8be54a87-4848-4113-9b06-78468c418051-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/can-bird-flu-infect-humans8be54a87-4848-4113-9b06-78468c418051-415x250-IndiaHerald.jpgపౌల్ట్రీ రైతుల్లో మాత్రం ఆందోళ‌న ఆగ‌లేదు. ఇక పెద్ద‌ప‌ల్లి జిల్లాలోనూ గ‌త వారం రోజుల్లోనే ప‌లువురు రైతుల‌కు చెందిన వంద‌లాది కోళ్లు మృతి చెందాయి. వీటిని స్థానికంగా ఉండే పంట కాల్వ‌లో వేయ‌డంతో ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు. ఇక కేర‌ళ‌లో అయితే ఈ వైర‌స్ ఎంత‌లా విజృంభిస్తుందో ఊహ‌కే అంద‌డం లేదు. అక్క‌డ ప్ర‌భుత్వ సిబ్బందే రంగంలోకి దిగి 60 వేల కోళ్లు, బాతుల‌ను చంపేశారు. ఆ పౌల్ట్రీ ఫార‌మ్‌ల యాజ‌మాన్యాల‌కు డ‌బ్బులు చెల్లించి మ‌రీ వీటిని చంపేశారు. ఇక కేర‌ళ స‌రిహ‌ద్దుపై పొరుగు రాష్ట్రాలు భారీగbird flu;business;chicken;letter;local languageతెలంగాణ‌ను క‌బ‌ళిస్తోన్న బ‌ర్డ్ ఫ్లూ... కోళ్ల బిజినెస్ కుదేలు.. ఏపీలోనూ ఇంత డేంజ‌రా..?తెలంగాణ‌ను క‌బ‌ళిస్తోన్న బ‌ర్డ్ ఫ్లూ... కోళ్ల బిజినెస్ కుదేలు.. ఏపీలోనూ ఇంత డేంజ‌రా..?bird flu;business;chicken;letter;local languageFri, 08 Jan 2021 13:06:00 GMTప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీల‌ను బ‌ర్డ్ ఫ్లూ బిజినెస్ కుదేలు చేస్తోంది. ముందుగా నార్త్‌లో స్టార్ట్ అయిన ఈ వ్యాధి క్ర‌మ‌క్ర‌మంగా కేర‌ళ‌కు పాకేసి.. ఇప్పుడు తెలంగాణ‌ను కూడా భ‌య పెడుతోంది. బ‌ర్డ్ ఫ్లూ వ్యాధి అయితే కేర‌ళ‌లో విజృంభిస్తోంది. ఇక తెలంగాణ‌లోనూ మొద‌లైంది. తెలంగాణ‌లో రెండు జిల్లాల్లో ఏకంగా వంద‌ల సంఖ్య‌లో కోళ్లు మృత్యువాత ప‌డ‌డం కూడా ప‌లువురిని భ‌య‌పెడుతోంది. వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లాలో ఒకే రైతుకు చెందిన వంద‌లాది కోళ్లు మృతి చెందాయి.

అయితే స్థానికంగా ఉన్న వైద్యాధికారులు వీటిని ప‌రీక్షించి బ‌ర్డ్ ప్ల్యూ ల‌క్ష‌ణాలు లేవ‌ని చెప్పినా స్థానికులు, పౌల్ట్రీ రైతుల్లో మాత్రం ఆందోళ‌న ఆగ‌లేదు. ఇక పెద్ద‌ప‌ల్లి జిల్లాలోనూ గ‌త వారం రోజుల్లోనే ప‌లువురు రైతుల‌కు చెందిన వంద‌లాది కోళ్లు మృతి చెందాయి. వీటిని స్థానికంగా ఉండే పంట కాల్వ‌లో వేయ‌డంతో ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు. ఇక కేర‌ళ‌లో అయితే ఈ వైర‌స్ ఎంత‌లా విజృంభిస్తుందో ఊహ‌కే అంద‌డం లేదు.

అక్క‌డ ప్ర‌భుత్వ సిబ్బందే రంగంలోకి దిగి 60 వేల కోళ్లు, బాతుల‌ను చంపేశారు. ఆ పౌల్ట్రీ ఫార‌మ్‌ల యాజ‌మాన్యాల‌కు డ‌బ్బులు చెల్లించి మ‌రీ వీటిని చంపేశారు. ఇక కేర‌ళ స‌రిహ‌ద్దుపై పొరుగు రాష్ట్రాలు భారీగా నిఘా కూడా పెట్టాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ప్ర‌భుత్వం అక్క‌డ మ‌రింత‌గా వేలాది కోళ్ల‌ను చంపేందుకు సిద్ధ‌మ‌వుతోంది. అయితే ప్ర‌భుత్వం ఇచ్చే ప‌రిహారం త‌మ‌కు ఏ మాత్రం స‌రిపోద‌ని పౌల్ట్రీ రైతులు గ‌గ్గోలు పెడుతున్నారు.

ఇక ఈ బ‌ర్డ్ ఫ్లూ టెన్ష‌న్ ఏపీని కూడా వ‌దిలే ప‌రిస్థితి లేదు. నార్త్‌లో సైబీరియా వ‌ల‌స ప‌క్షులు కూడా బ‌ర్డ్ ఫ్లూతో మృతి చెందాయి. ఇప్పుడు ఏపీలో కొల్లేరు స‌ర‌స్సుకు యేటా వేలాదిగా వ‌ల‌స ప‌క్షులు వ‌స్తాయి. వీటి వ‌ల్ల స్థానికంగా ఈ వ్యాధి తీవ్రంగా వ్యాపిస్తుంద‌న్న ఆందోళ‌న‌లు కూడా ఉన్నాయి. ఇక ఈ బ‌ర్డ్ ఫ్లూ ప్ర‌భావం చికెన్ రేట్ల‌పై ప‌డ‌డంతో భారీగా రేటు త‌గ్గిపోయి డిమాండ్ లేకుండా పోయింది. దీంతో పౌల్ట్రీ వ్యాపారులు తీవ్రంగా న‌ష్ట‌పోనున్నారు.  


కేజీఎఫ్ 2 టీజ‌ర్ తుస్సుమందే... యూ ట్యూబ్‌లో పేల‌లేదు...!

బాల‌య్య ఇదేం గోల‌య్యా... వైసీపీకి ఎంత లాభం చేశావో చూడు...!

కేంద్రంతో కేటీఆర్ యుద్ధం.. దేనికి సంకేతం..?

నేను వైసీపీ కార్యకర్తనే... మీకు అభ్యంతరం ఏంటి ? - రాపాక సంచలన వ్యాఖ్యలు

జో బైడెన్ గెలిచిన వెంటనే.. ఉత్తర కొరియా అధ్యక్షుడు ఏం చేశాడో చూడండి

కొత్త తరహా మోసాల నేపధ్యంలో బ్యాంకు కష్టమర్లకు RBI హెచ్చరికలు...

రెండు రాష్ట్రాల్లో దిగిన ఆ నలుగురు ఎవరు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>