PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-ysrcp-strength-for-telugudesam-e3eceb02-ebb7-477a-b5bd-eb48c054282c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-ysrcp-strength-for-telugudesam-e3eceb02-ebb7-477a-b5bd-eb48c054282c-415x250-IndiaHerald.jpg2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు సాధిస్తుందని ఎవరు ఊహించలేదు. ఆఖరికి ఆ పార్టీనే ఊహించి ఉండదు. గెలిచి అధికారంలోకి వస్తామని అనుకుని ఉంటారు గానీ, ఇంత బంపర్ మెజారిటీతో గెలిచేస్తామని ఊహించి ఉండరు. కానీ వైసీపీ 151 మంది గెలిచేశారు. అటు అప్పటివరకు అధికారంలో ఉన్న టీడీపీ ఘోరంగా 23 సీట్లకే పరిమితమైంది. ఇక ఎన్నో అంచనాలతో బరిలో దిగిన జనసేన ఒక సీటు గెలుచుకుంది. jagan;amala akkineni;bhavana;jagan;janasena;ram madhav;2019;district;tdp;ycp;janasena party;research and analysis wing;partyజగన్ రాంగ్ స్టెప్: వైసీపీనే టీడీపీ బలమా...?జగన్ రాంగ్ స్టెప్: వైసీపీనే టీడీపీ బలమా...?jagan;amala akkineni;bhavana;jagan;janasena;ram madhav;2019;district;tdp;ycp;janasena party;research and analysis wing;partyFri, 08 Jan 2021 03:00:00 GMT2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు సాధిస్తుందని ఎవరు ఊహించలేదు. ఆఖరికి ఆ పార్టీనే ఊహించి ఉండదు. గెలిచి అధికారంలోకి వస్తామని అనుకుని ఉంటారు గానీ, ఇంత బంపర్ మెజారిటీతో గెలిచేస్తామని ఊహించి ఉండరు. కానీ వైసీపీ 151 మంది గెలిచేశారు. అటు అప్పటివరకు అధికారంలో ఉన్న టీడీపీ ఘోరంగా 23 సీట్లకే పరిమితమైంది. ఇక ఎన్నో అంచనాలతో బరిలో దిగిన జనసేన ఒక సీటు గెలుచుకుంది.

అయితే వైసీపీ ఇన్ని సీట్లు గెలవడానికి అనేక కారణాలు ఉన్నాయి. మొదట టీడీపీ మీద వచ్చిన వ్యతిరేకిత ప్రధాన కారణమని చెప్పొచ్చు. టీడీపీ మీద అంత వ్యతిరేకిత రావడానికి కారణం, ఆ పార్టీ విధానాలే, నేతలు తీవ్ర అవినీతికి పాల్పడటం, కార్యకర్తలని గాలికి వదిలేయడం, అలాగే చంద్రబాబు ఇచ్చిన హామీలని అమలు చేయకపోవడం. అయితే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన జగన్ ఇచ్చిన హామీలని అమలు చేయడంలో ముందున్నారు. కానీ నేతల అవినీతి, అసలైన కార్యకర్తలని పట్టించుకోకపోవడం లాంటివి జరుగుతున్నట్లే కనిపిస్తున్నాయి.

అందుకు ఉదాహరణలు చాలానే ఉన్నాయి. పలు సందర్భాల్లో కార్యకర్తలు బహిరంగంగానే తమ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే నేతల అవినీతిపై సొంత పార్టీ వాళ్లే విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఇలాంటి విషయాలపై డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్న భావన ఉందని, వాలంటీర్ వ్యవస్థలో లోటుపాట్లు ఉంటే సర్దుకుపోవాలని, వాలంటీర్లను నియమించింది వైసీపీ నేతలు, కార్యకర్తలేనని.. ఇబ్బందికరంగా ఉన్నవారిని మార్చుకుందామని సూచించారు. స్వతహగా టీడీపీకి బలం లేని కారణంగా మనలో మనకు గొడవలు సృష్టించి లబ్ది పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. వాస్తవానికి గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే జరిగింది. అందుకే అది వైసీపీకి అడ్వాంటేజ్ అయింది. ఇప్పుడు అదే సీన్ రివర్స్‌లో వస్తున్నట్లు కనిపిస్తోంది. కాబట్టి జగన్ పార్టీని కూడా లైన్‌లో పెట్టాల్సిన అవసరముందని వాదనలు వస్తున్నాయి.




సిగిరెట్ తాగే వారికి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం

వీరిద్దరూ భార్యాభర్తలు.. విడాకులు కూడా తీసుకున్నారని ఎంతమందికి తెలుసు?

అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?

తెరాస పార్టీ బీజేపీ ని కాకుండా బండి ని టార్గెట్ చేయడంలో మర్మం ఏంటి..?

ఐటీఐఆర్ ప్రాజెక్టును పునరుద్దరించండి

తిరుపతిలో వైసీపీ ఓడిపోతుందా...?

ఎమ్మెల్యేలను పిలుస్తున్న జగన్... షాక్ ఇస్తారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>