PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cm-kcrba77c4a5-309c-4748-a2be-37dd43ab7b57-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cm-kcrba77c4a5-309c-4748-a2be-37dd43ab7b57-415x250-IndiaHerald.jpgతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ పర్యటన వాయిదా పడింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరధిలోని ప్రాజెక్ట్ పరిసరాలను ఆయన పరిశీలించాల్సి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో రిజర్వాయర్లు, పంప్ హౌజులు, కాల్వల పరిధిలో టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దాదాపు 6 వందల కోట్ల రూపాయలతో గార్డెన్లు, పార్కులు, నర్సరీలు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారు, ఆ పనుల పరిశీలన కోసమే కేసీఆర్ కాళేశ్వరం పర్యటించాలని భావించారు.cm kcr;kcr;kavitha;telangana rashtra samithi trs;telangana;mp;district;chief minister;minister;doctor;kaleshwaram project;kaleswaram project;v;bhupalpallyకేసీఆర్ కాళేశ్వరం పర్యటన వాయిదాకేసీఆర్ కాళేశ్వరం పర్యటన వాయిదాcm kcr;kcr;kavitha;telangana rashtra samithi trs;telangana;mp;district;chief minister;minister;doctor;kaleshwaram project;kaleswaram project;v;bhupalpallyFri, 08 Jan 2021 08:26:25 GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ పర్యటన వాయిదా పడింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరధిలోని ప్రాజెక్ట్ పరిసరాలను ఆయన పరిశీలించాల్సి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో రిజర్వాయర్లు, పంప్ హౌజులు, కాల్వల పరిధిలో టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దాదాపు 6 వందల కోట్ల రూపాయలతో గార్డెన్లు, పార్కులు, నర్సరీలు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారు, ఆ పనుల పరిశీలన కోసమే కేసీఆర్ కాళేశ్వరం పర్యటించాలని భావించారు. సీఎం పర్యటన కోసం భూపాలపల్లి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. పోలీసు ఉన్నతాధికారులు ప్రాజెక్టు పరిసరాల్లో పర్యటించి భద్రతా చర్యలు చేపట్టారు. అయితే  అనారోగ్య కారణాలతో  కేసీఆర్ తన  పర్యటనను వాయిదా వేసుకున్నారు.


           రెండు రోజులుగా ఊపిరితిత్తుల్లో మంటతో ఇబ్బంది పడుతున్న సీఎం కేసీఆర్‌.. గురువారం సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. సీఎం కేసీఆర్‌కు ఊపిరితిత్తుల్లో స్వల్ప ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. సీఎం  వ్యక్తిగత వైద్యులు ఎం.వి.రావు, శ్వాసకోశ నిపుణుడు నవనీత సాగర్, హృద్రోగ నిపుణుడు డాక్టర్ ప్రమోద్ పర్యవేక్షణలో అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహించారు. వ్యాధి నిర్ధారణ కోసం అక్కడ పలు పరీక్షలు చేశారు. సీఎం బ్లడ్ శాంపిల్స్‌  వైద్యులు తీసుకున్నారు. కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్‌ యశోద ఆస్పత్రికి వచ్చారు.

            కేసీఆర్ కు వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత  సీఎం వ్యక్తిగత వైద్యుడు ఎంవీ.రావు మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ ఆరోగ్యం చాలా బాగుందని చెప్పారు. ప్రతి ఏడాది చేసే వైద్య పరీక్షలే ఆయన చేయించుకున్నారని తెలిపారు. ఊపిరితిత్తుల్లో మంట ఉండటంతో సిటీ స్కాన్ చేశాం.. రిపోర్ట్ శుక్రవారం వస్తుందని ప్రకటించారు. ఎంఐఆర్ స్కానింగ్ అవసరం లేదని, కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని ఎంవీ.రావు వెల్లడించారు. కేసీఆర్ కు పెద్ద సమస్య ఏమి లేదని టీఆర్ఎస్ నేతలు కూడా చెబుతున్నారు.




ముచ్చటగా మూడోసారి.. బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ కొట్టేసిన రకుల్..?

సిగిరెట్ తాగే వారికి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం

వీరిద్దరూ భార్యాభర్తలు.. విడాకులు కూడా తీసుకున్నారని ఎంతమందికి తెలుసు?

అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?

తెరాస పార్టీ బీజేపీ ని కాకుండా బండి ని టార్గెట్ చేయడంలో మర్మం ఏంటి..?

ఐటీఐఆర్ ప్రాజెక్టును పునరుద్దరించండి

తిరుపతిలో వైసీపీ ఓడిపోతుందా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>