PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/life-insurance-corporation-new-offer-to-lapsed-policyholders2063ff93-0c79-4ac5-827c-7b5fef8a1fda-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/life-insurance-corporation-new-offer-to-lapsed-policyholders2063ff93-0c79-4ac5-827c-7b5fef8a1fda-415x250-IndiaHerald.jpgకరోనా వేళ.. పాలసీదారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు.. రిస్క్ కవర్ ని కొనసాగించిన మరోసారి పాలసీదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది ఎల్ఐసీ. ల్యాప్స్‌ అయిపోయిన పాలసీల పునరుద్ధరణకు మరో అవకాశాన్నిచ్చింది. ఈమేరకు ప్రచారం కూడా మొదలు పెట్టింది. మార్చి 6 వరకు ఇలా ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్ధరించుకునే అవకాశం ఉందని ప్రకటించారు అధికారులు. ఇప్పటి వరకు ల్యాప్స్ అయిన పాలసీలను నామమాత్రపు అపరాధ రుసుముతో పునరుద్ధరించుకోవచ్చని, ఇకపై ఇలాంటి అవకాశాలు రాకపోవచ్చని చెబుతున్నారు. lic;suma;suma kanakala;marchకరోనా వేళ.. ఎల్ఐసీ బంపర్ ఆఫర్..కరోనా వేళ.. ఎల్ఐసీ బంపర్ ఆఫర్..lic;suma;suma kanakala;marchFri, 08 Jan 2021 11:00:00 GMTమార్చి 6 వరకు ఇలా ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్ధరించుకునే అవకాశం ఉందని ప్రకటించారు అధికారులు. ఇప్పటి వరకు ల్యాప్స్ అయిన పాలసీలను నామమాత్రపు అపరాధ రుసుముతో పునరుద్ధరించుకోవచ్చని, ఇకపై ఇలాంటి అవకాశాలు రాకపోవచ్చని చెబుతున్నారు.

ఎల్ఐసీ అయినా, ఇతర ఏ పాలసీ అయినా.. కస్టమర్లు నిర్దేశిత గడువులోపు పాలసీ ప్రీమియం చెల్లించకపోతే అవి రద్దు (ల్యాప్స్‌) అవుతాయి. ఇలా ల్యాప్స్‌ అయిన పాలసీలను పునరుద్ధరించుకునే అవకాశం కూడా ఎల్ఐసీ సహా ఇతర సంస్థలు కల్పిస్తాయి. అయితే పునరుద్ధరణ అవకాశం కూడా కోల్పోతే మాత్రం ఇకపై దాన్ని కొనసాగించడం కష్టంగా మారుతుంది. కానీ ఎల్ఐసీ మాత్రం మరోసారి తన కస్టమర్లకు ఇలాంటి అవకాశం ఇస్తోంది.

ఇప్పటి వరకూ ల్యాప్స్ అయిన పాలసీలను ఇప్పుడు పునరుద్ధరించుకునే అవకాశం ఇచ్చింది ఎల్ఐసీ. దేశవ్యాప్తంగా ఎల్‌ఐసీకి చెందిన 1,526 శాటిలైట్‌ కార్యాలయాల నుంచి సైతం పాలసీదారులు తమ రద్దైన పాలసీలను పునరుద్ధరించుకోవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. ప్రీమియం చెల్లించని ఏడాది నుంచి గరిష్టంగా ఐదేళ్లలోపు ల్యాప్స్‌ అయిన వాటికి ఈ అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.

అయితే ల్యాప్స్ డ్ పాలసీల పునరుద్ధరణ విషయంలో పాలసీదారులు కొన్ని పత్రాలు సమర్పించాల్సి ఉంటుందనే నిబంధన విధించారు. కొవిడ్‌–19 ప్రశ్నావళిని పూర్తి చేసి వారికి అందించాల్సి ఉంటుంది. తమ ఆరోగ్య స్థితి మంచిగానే ఉందన్న స్వీయ ధ్రువీకరణ కూడా తీసుకుంటారు. ఈ రెండు తీసుకున్న తర్వాత పాలసీని పునరుద్ధరిస్తారు. అయితే ఇలా పునరుద్ధరణకోసం తీసుకునే లేట్ ఫీజ్ లో 20 శాతం రాయితీ ఇస్తోంది ఎల్ఐసీ. లేదా పునరుద్ధరణకోసం 2వేల రూపాయల ఫిక్స్డ్ చార్జీ అయినా చెల్లించొచ్చని తెలిపింది. మార్చి 6 వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపారు అధికారులు.


ఇదీ హిందూమతం పట్ల మా అభిమతం

రెండు రాష్ట్రాల్లో దిగిన ఆ నలుగురు ఎవరు...?

బాహుబలి మేనియా గుర్తు చేస్తున్న K.G.F చాప్టర్ 2..!

తెలంగాణకు ఎక్కువ డోసులు !

సిగిరెట్ తాగే వారికి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం

వీరిద్దరూ భార్యాభర్తలు.. విడాకులు కూడా తీసుకున్నారని ఎంతమందికి తెలుసు?

అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>