PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-vijaya-sai92caa8eb-c37b-41ee-b8de-156bb23077b0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-vijaya-sai92caa8eb-c37b-41ee-b8de-156bb23077b0-415x250-IndiaHerald.jpgఅయితే ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చాక వీరిలో చాలా మంది తెర‌వెన‌క్కు వెళ్లిపోయారు. ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు ఇత‌ర పార్టీల్లో ఉన్నోల్లు.. ఎన్నిక‌ల త‌ర్వాత పార్టీలోకి వ‌చ్చినోళ్ల‌కే ప్ర‌యార్టీ ఎక్కువ అవుతోంది. దీంతో పార్టీ కోసం ముందు నుంచి క‌ష్ట‌ప‌డిన త‌మ గతేం కాను అన్న ఆవేద‌న చాలా మందికి ఉంది. జ‌గ‌న్ అధికారంలోకి రావ‌డంతో త‌మ కెరీర్ మారిపోతుంద‌ని.. తాము ఆర్థికంగా సెటిల్ అయిన‌ట్టేనని భావించిన చాలా మంది ఆశ‌లు ఇప్పుడు అడియాస‌లు అవుతున్నాయి. త‌మ బాధ‌ల‌ను లోక‌ల్ లీడ‌ర్ల‌తో చెప్పుకుందామంటే వినేవాళ్లు లేరిక్కjagan vijaya sai;minister;letter;ycp;reddy;partyవిజ‌య‌సాయి ముందు మంత్రి ఆవేద‌న‌.. జ‌గ‌న్‌కు చెపుతాన‌ని ఓదార్పు..!విజ‌య‌సాయి ముందు మంత్రి ఆవేద‌న‌.. జ‌గ‌న్‌కు చెపుతాన‌ని ఓదార్పు..!jagan vijaya sai;minister;letter;ycp;reddy;partyFri, 08 Jan 2021 16:28:13 GMTఏపీలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చి ఇర‌వై నెల‌లు అవుతోంది. పైకి చూడ‌డానికి అంతా పాల‌కుండ‌లా క‌నిపిస్తున్నా సంస్థాగ‌తంగా వైసీపీ చాలా లోపాల‌తో కొట్టుమిట్టాడుతోన్న మాట వాస్త‌వం. దాదాపు అన్ని జిల్లాల్లోనూ నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త లేదు. ఇక ఈ గొడ‌వ‌లు ఇలా ఉంచితే ప‌దేళ్ల పాటు గ్రౌండ్ లెవ‌ల్లో ఎంతో క‌ష్ట‌ప‌డి పార్టీని అధికారంలోకి తీసుకు వ‌చ్చేందుకు కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. అయితే ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చాక వీరిలో చాలా మంది తెర‌వెన‌క్కు వెళ్లిపోయారు. ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు ఇత‌ర పార్టీల్లో ఉన్నోల్లు.. ఎన్నిక‌ల త‌ర్వాత పార్టీలోకి వ‌చ్చినోళ్ల‌కే ప్ర‌యార్టీ ఎక్కువ అవుతోంది. దీంతో పార్టీ కోసం ముందు నుంచి క‌ష్ట‌ప‌డిన త‌మ గతేం కాను అన్న ఆవేద‌న చాలా మందికి ఉంది.

జ‌గ‌న్ అధికారంలోకి రావ‌డంతో త‌మ కెరీర్ మారిపోతుంద‌ని.. తాము ఆర్థికంగా సెటిల్ అయిన‌ట్టేనని భావించిన చాలా మంది ఆశ‌లు ఇప్పుడు అడియాస‌లు అవుతున్నాయి. త‌మ బాధ‌ల‌ను లోక‌ల్ లీడ‌ర్ల‌తో చెప్పుకుందామంటే వినేవాళ్లు లేరిక్క‌డ‌. దీంతో పార్టీకి మెయిన్ పిల్ల‌ర్ అయిన కార్య‌క‌ర్త‌ల్లో తీవ్ర నిరుత్సాహం అలుముకుంది. ఇటీవ‌ల కొంద‌రు కార్య‌క‌ర్త‌లు ఎమ్మెల్యేలు ఇబ్బందులు పెడుతున్నార‌ని.. మ‌రి కొంద‌రు త‌మ‌కు అన్యాయం జ‌రిగింద‌ని ఆత్మ‌హ‌త్య‌లు కూడా చేసుకోబోయారు. ఇవ‌న్నీ పార్టీ కేడ‌ర్లో ఎక్క‌డా లేని నిరుత్సాహం నింపుతున్నాయి.

అయితే ఈ విష‌యాన్ని నేరుగా జ‌గ‌న్ దృష్టికి తీసుకు వెళ్లే వారు ఎవ్వ‌రూ లేరు. అయితే డిప్యూటీ సీఎం, మంత్రి ధ‌ర్మాన కృష్ణ‌దాస్ మాత్రం ఈ విష‌యాన్ని చాలా సీరియ‌స్‌గా తీసుకోవ‌డంతో పాటు విజ‌య‌సాయి రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లారు. కార్య‌క‌ర్త‌లు ఎంతో ఆవేద‌న‌తో ర‌గిలి పోతున్నార‌ని ఆయ‌న‌కు చెప్పారు. విజ‌య‌సాయికి ధ‌ర్మాన ఏ మాత్రం మొహ‌మాటం లేకుండా కార్య‌క‌ర్త‌లు ప‌డుతోన్న బాధ‌ను త‌న ఆవేద‌న రూపంలో వెళ్ల‌గ‌క్కారు. అయితే ఈ విష‌యం వాస్త‌వం అని ఒప్పుకున్న విజ‌య‌సాయి తాను నేరుగా జ‌గ‌న్ దృష్టికి  తీసుకు వెళ్ల‌డంతో పాటు కార్య‌క‌ర్త‌ల‌కు ఎలా ?  న్యాయం చేయాలో ఆలోచ‌న చేస్తామ‌ని హామీ ఇచ్చారు.  


ఒకేరోజు 9 ఆలయాలకు సీఎం జగన్ భూమి పూజ

ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎం లకు క్లిష్ట పరిస్థితులు...?

జీవ‌తా రాజ‌శేఖ‌ర్ ఎమ్మెల్యేగా పోటీ... ఆ సీటుపైనే గురి పెట్టారా..!

విచార‌ణ‌లో షాకింగ్ విష‌యాలు చెప్పిన అఖిల‌ప్రియ‌

తెలంగాణ‌ను క‌బ‌ళిస్తోన్న బ‌ర్డ్ ఫ్లూ... కోళ్ల బిజినెస్ కుదేలు.. ఏపీలోనూ ఇంత డేంజ‌రా..?

కేజీఎఫ్ 2 టీజ‌ర్ తుస్సుమందే... యూ ట్యూబ్‌లో పేల‌లేదు...!

బాల‌య్య ఇదేం గోల‌య్యా... వైసీపీకి ఎంత లాభం చేశావో చూడు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>