PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/aadhaar73b9030f-5967-40d7-9621-7135dbe1cc05-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/aadhaar73b9030f-5967-40d7-9621-7135dbe1cc05-415x250-IndiaHerald.jpgఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ లింక్ చేయడం అనేది తప్పనిసరి అయిపోయింది. అంతేకాదు అథెంటికేషన్ కూడా సులువు అవుతోంది. అంటే ఎక్కడైనా మీ ఆధార్ నెంబర్‌ను ఉపయోగించినప్పుడు, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుందన్నమాట. అయితే ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసిన సమయంలో ఏ మొబైల్ నెంబర్ ఇచ్చాం అన్న సంగతి చాలామందికి గుర్తుండదు.aadhaar;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;india;smart phone;cheque;service;idea;uidai;march;vమీ ఆధార్ కి ఏ ఫోన్ నెంబర్ లింక్ చేశారో తెలుసుకోండిలా..!?మీ ఆధార్ కి ఏ ఫోన్ నెంబర్ లింక్ చేశారో తెలుసుకోండిలా..!?aadhaar;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;india;smart phone;cheque;service;idea;uidai;march;vFri, 08 Jan 2021 20:30:00 GMTఫోన్ నెంబర్లు ఉండటం లేదా ఫోన్ నెంబర్లు మార్చి కొత్తవి తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది.

దీంతో ఓటీపీ విషయంలో తిప్పలు తప్పవు. అసలు ఏ నెంబర్‌కు ఓటీపీ వెళ్తుందో కూడా కొన్ని సందర్భాల్లో తెలియని పరిస్థితి. మరి ఆధార్ కార్డుకు ఏ ఫోన్ నెంబర్ లింక్ అయిందన్న విషయం తెలుసుకోవడం ఎలా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే అలాంటి వారికి చాలా సులువుగా తెలుసుకునే ఫెసిలిటీ వచ్చేసింది. ఇందుకోసం మీరు చెయ్యాల్సింది ఏంటంటే మెుట్టమెుదట వెబ్ సైట్ కి వెళ్లాలి. తొలుత యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ ఓపెన్ చేయాలి.

వెబ్ సైట్ ఓపెన్ అయిన తర్వాత My Aadhaar సెక్షన్‌లో Aadhaar services లో Verify Email / mobile Number ఆప్షన్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు కొత్త విండో ఓపెన్ అవుతుంది. అందులో ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత Send OTPపై క్లిక్ చేయాలి. మీరు సరైన మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే The mobile Number xxxxxxxxxx matches with our records అని వస్తుంది.

మీరు ఆధార్ నెంబర్‌కు లింక్ లేని మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే The mobile number you had entered does not match with our recordsఅని వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మీరు మరో నెంబర్‌తో ప్రయత్నించాలి. అలాగే ఇమెయిల్ ఐడీని కూడా చెక్ చేసుకోవచ్చు. అసలు మొబైల్ నెంబర్ ఏదో ఏమాత్రం ఐడియా లేకపోతే ఎలా తెలుసుకోవాలన్న సందేహం ఉంటుంది. ఇది కూడా సాధ్యమే. యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో మీరు మీ ఆధార్ నెంబర్‌కు ఏ మొబైల్ నెంబర్ లింక్ చేశారో సులువుగా తెలుసుకోవచ్చు. ఫస్ట్ uidai అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ ఓపెన్ చేయండి. My Aadhaar సెక్షన్‌లో Aadhaar services లో Verify an Aadhaar Number పైన క్లిక్ చేయండి.

ఆ తర్వాత ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. Proceed to Verify పైన క్లిక్ చేయండి. Aadhaar Number xxxxxxxxxxxx Exists అని వస్తుంది. దాంతో పాటు మొబైల్ నెంబర్ దగ్గర ఫోన్ నెంబర్ చివరి 3 అంకెలు కనిపిస్తాయి. దీని ద్వారా మీరు ఏ మొబైల్ నెంబర్ లింక్ చేశారో క్లూ దొరుకుతుంది. మొబైల్ నెంబర్ దగ్గర ఖాళీగా ఉంటే ఆ ఆధార్ నెంబర్‌కు ఏ ఫోన్ నెంబర్ లింక్ కాలేదని అర్థం. అప్పుడు మీరు మెుబైల్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.


రాష్ట్రానికి మరోసారి విచ్చేసిన జగన్ ఆప్తమిత్రుడు 'పీకే'

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా

దేవాలయాల మీద దాడులు వెనక కుట్ర కోణం...?

నాగార్జున సాగర్ ఫలితం తర్వాతే కాంగ్రెస్ భవిష్యత్ మారబోతుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>