PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bhuma-heirs733926a7-9a41-401a-8f20-d325de14a6c1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bhuma-heirs733926a7-9a41-401a-8f20-d325de14a6c1-415x250-IndiaHerald.jpgఆల్పా ఇంజ‌నీరింగ్ కాలేజ్ భమి అమ్మ‌కం విష‌యంలోనే ఇద్ద‌రు అక్కా చెల్లెల్ల మ‌ధ్య గొడ‌వ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఇందులో మౌనిక వాటాగా ఆమెకు ద‌క్కాల్సిన సొమ్మును అఖిల ఇవ్వ‌లేద‌ని స్థానికంగా ప్ర‌చారంలో వినిపించే మాట‌. దీంతో సోద‌రి మౌనిక ఆళ్ల‌గ‌డ్డ వెళ్లి త‌న బంధువ‌ర్గంలో కొంద‌రికి ఈ విష‌యం చెప్పి పంచాయితీ పెట్టినా ఉప‌యోగం లేద‌ని స్థానికులు చెవులు కొరుక్కుంటున్నారు. ఈ వివాదంలో సోద‌రుడు జ‌గ‌త్ విఖ్యాత్‌రెడ్డి కూడా మౌనంగా ఉన్నాడ‌ని మౌనిక ఆవేద‌న‌తో ఉన్నార‌ట‌. కొద్ది రోజులుగా జ‌గ‌త్‌కు మౌనికతో స‌రిగా మాట‌bhuma heirs;mounika;ram pothineni;tiru;bhuma akhila priya;media;minister;letter;local languageభూమా వార‌సురాళ్ల ఆస్తుల గొడ‌వ‌... అఖిల వ‌ర్సెస్ మౌనిక‌..?భూమా వార‌సురాళ్ల ఆస్తుల గొడ‌వ‌... అఖిల వ‌ర్సెస్ మౌనిక‌..?bhuma heirs;mounika;ram pothineni;tiru;bhuma akhila priya;media;minister;letter;local languageFri, 08 Jan 2021 10:24:00 GMTమంత్రి భూమా అఖిల‌ప్రియ ఆమె చెల్లెలు మౌనిక మ‌ధ్య ఆస్తుల పంచాయితీ న‌డుస్తోందా ? అంటే తాజా ప‌రిణామాలు అవున‌నే అంటున్నాయి. హైద‌రాబాద్‌లోని హ‌పీజ్‌పేట‌లో 25 ఎక‌రాల భూ వివాదంలో అఖిల‌ప్రియ జైలు పాల‌వ్వ‌డం.. ఆమె భ‌ర్త భార్గ‌వ్ రామ్ సైతం ఈ వివాదంలో అంతా తానై న‌డిపించ‌డంతో అస‌లు భూమా కుటుంబంలో ఏం జ‌రుగుతోంద‌న్న సందేహాలు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇక అఖిల జైలు పాల‌వ్వ‌డంతో ఆమెకు మ‌ద్ద‌తుగా సోద‌రి మౌనిక మీడియా ముందుకు వ‌చ్చారు. అక్కకు మ‌ద్ద‌తుగా మౌనిక మీడియా ముందుకు వ‌చ్చినా.. కొద్ది రోజులుగా అక్కా చెల్లి మ‌ధ్య ఆస్తుల గొడ‌వ‌లు ఉన్న‌ట్టు నంద్యాల‌, ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

కొద్ది రోజుల క్రిత‌మే ఆళ్ల‌గ‌డ్డ - క‌డ‌ప హైవే స‌మీపంలో దివంగ‌త భూమా నాగిరెడ్డికి చెందిన ఆల్పా ఇంజ‌నీరింగ్ కాలేజ్ భమి అమ్మ‌కం విష‌యంలోనే ఇద్ద‌రు అక్కా చెల్లెల్ల మ‌ధ్య గొడ‌వ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఇందులో మౌనిక వాటాగా ఆమెకు ద‌క్కాల్సిన సొమ్మును అఖిల ఇవ్వ‌లేద‌ని స్థానికంగా ప్ర‌చారంలో వినిపించే మాట‌. దీంతో సోద‌రి మౌనిక ఆళ్ల‌గ‌డ్డ వెళ్లి త‌న బంధువ‌ర్గంలో కొంద‌రికి ఈ విష‌యం చెప్పి పంచాయితీ పెట్టినా ఉప‌యోగం లేద‌ని స్థానికులు చెవులు కొరుక్కుంటున్నారు.

ఈ వివాదంలో సోద‌రుడు జ‌గ‌త్ విఖ్యాత్‌రెడ్డి కూడా మౌనంగా ఉన్నాడ‌ని మౌనిక ఆవేద‌న‌తో ఉన్నార‌ట‌. కొద్ది రోజులుగా జ‌గ‌త్‌కు మౌనికతో స‌రిగా మాట‌లు కూడా లేవంటున్నారు. త‌న‌కు రావాల్సిన ఆస్తులు రాక‌పోతే మౌనిక కోర్టు మెట్లు ఎక్కేందుకు కూడా వెనుకాడ‌న‌ని త‌న బంధు వ‌ర్గాల‌తో అన్న‌ట్టు స్థానికంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక వీరికి తిరుప‌తిలో జ‌గ‌త్ - విఖ్యాత్ థియేట‌ర్ల విష‌యంలోనూ వీరి మ‌ధ్య గొడ‌వ‌లు ఉన్నాయంటున్నారు.

వీరి గొడ‌వ‌ల నేప‌థ్యంలోనే యేడాదికిగా ఈ జంట థియేట‌ర్ల‌ను మూసి వేశార‌ని అంటున్నారు. ఇక వీరి మ‌ధ్య గొడ‌వ‌ను ప‌రిష్క‌రించేందుకు బంధువులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నా.. వీరిలో ఎవ్వ‌రూ వినే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతోనే చివ‌ర‌కు వారు కూడా వీరి మ‌ధ్య త‌ల‌దూర్చ‌డం లేద‌ని తెలుస్తోంది. ఏదేమైనా అఖిల‌ప్రియ త‌న దురుసుత‌నంతోనే అంద‌రిని దూరం చేసుకుంటుంద‌నే అభిప్రాయం స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.




విశాఖ రాజధానికి శుభ వార్తేనా ?

రెండు రాష్ట్రాల్లో దిగిన ఆ నలుగురు ఎవరు...?

బాహుబలి మేనియా గుర్తు చేస్తున్న K.G.F చాప్టర్ 2..!

తెలంగాణకు ఎక్కువ డోసులు !

సిగిరెట్ తాగే వారికి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం

వీరిద్దరూ భార్యాభర్తలు.. విడాకులు కూడా తీసుకున్నారని ఎంతమందికి తెలుసు?

అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>