PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/house59285990-71a7-4e3e-b54d-2cca5eacb095-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/house59285990-71a7-4e3e-b54d-2cca5eacb095-415x250-IndiaHerald.jpgపండగ వచ్చిందంటే చాలు సిటీలో ఉండే ప్రజలు ఊర్లకి ప్రయాణం కడతారు. ఇక దొంగలకు ఇదే మంచి సమయం తాళం వేసిన ఇళ్లను దోచుకొని వెళ్తుంటారు. అయితే లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్ సాయంతో ఇళ్లను దొంగల బారి నుంచి కాపాడుకోవటంతో పాటు, నేరగాళ్లను ఈజీగా పట్టుకోవచ్చని పోలీసు అధికారులు చెబుతున్నారు. దీనికి కావాల్సిందల్లా మీకు స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. house;amala akkineni;kranthi;kranti;makar sakranti;andhra pradesh;bari;sankranthi;smart phone;police;google;festival;thief;dongaపండగకి ఊరెళ్తున్నారా.. ఈ యాప్ ఇన్ స్టాల్ చేసుకుంటే మీ ఇల్లు సేఫ్..!పండగకి ఊరెళ్తున్నారా.. ఈ యాప్ ఇన్ స్టాల్ చేసుకుంటే మీ ఇల్లు సేఫ్..!house;amala akkineni;kranthi;kranti;makar sakranti;andhra pradesh;bari;sankranthi;smart phone;police;google;festival;thief;dongaFri, 08 Jan 2021 07:00:00 GMTబారి నుంచి కాపాడుకోవటంతో పాటు, నేరగాళ్లను ఈజీగా పట్టుకోవచ్చని పోలీసు అధికారులు చెబుతున్నారు. దీనికి కావాల్సిందల్లా మీకు స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ కలిగిన వారు గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి LHMS ఏపీ పోలీస్‌ అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. తర్వాత ఈ యాప్‌ ఓపెన్ చేసి అనంతరం మీ అడ్రస్, ఇతర వివరాలన్నీ ఎంటర్ చేసి రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇక మీరు ఊరెళ్లే ముందు పోలీసులకు సమాచారమిస్తే ఇంటి ముందు సీసీ కెమెరాను ఏర్పాటు చేస్తారు. కెమెరాను యాప్ సాయంతో మీ మొబైల్ కు అనుసంధానం చేస్తారు. దీనిని పోలీస్‌ కంట్రోల్‌ రూంలో ఎస్సై స్థాయి అధికారి మానిటర్ చేస్తారు. ఎవరైనా దొంగ ఇంటిలోకి ప్రవేశించి కెమెరాకు కనిపించగానే వెంటనే పోలీసులను అలర్ట్‌ చేస్తుంది. యాప్‌ కలిగిన ఇంటి ఓనర్లు కూడా తమ మొబైల్‌లో ఇంటి వద్ద పరిస్థితులను ఎప్పటికప్పుడు చూసుకునే అవకాశముంటుంది.

అయితే సంక్రాంతి లాంటి పెద్ద పండుగ వచ్చినప్పుడు దొంగలు ప్రధానంగా తాళాలు వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేసుకుంటున్నారు. సెలవులు ఎక్కువగా వచ్చినప్పుడు, సమ్మర్ హాలిడేస్ లో దొంగతనాలు ఎక్కువగా జరుగుతుంటాయి.ఇలాంటి సమయంలో LHMS యాప్ ను ఇన్ స్టాల్ చేసుకొని పోలీసులకు సమాచారిమిస్తే మీరు ఎక్కడున్నా సరే మీ ఇల్లు మీ అరచేతిలో ఉంటుంది. ప్రజలు తమ విలువైన సొత్తును కాపాడుకునేందుకు పోలీసు శాఖ అమలు చేస్తోన్న ఎల్‌హెచ్‌ఎంఎస్‌ యాప్‌ను వినియోగించుకుంటే మంచిదని అధికారులు చెప్తున్నారు. ఈ యాప్ ద్వారా ప్రజల ఆస్తులు, సొత్తుకు రక్షణ కల్పించడంతో పాటు దొంగల ఆగడాలను అరికట్టే అవకాశం ఉందంటున్నారు.


సిగిరెట్ తాగే వారికి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం

వీరిద్దరూ భార్యాభర్తలు.. విడాకులు కూడా తీసుకున్నారని ఎంతమందికి తెలుసు?

అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?

తెరాస పార్టీ బీజేపీ ని కాకుండా బండి ని టార్గెట్ చేయడంలో మర్మం ఏంటి..?

ఐటీఐఆర్ ప్రాజెక్టును పునరుద్దరించండి

తిరుపతిలో వైసీపీ ఓడిపోతుందా...?

ఎమ్మెల్యేలను పిలుస్తున్న జగన్... షాక్ ఇస్తారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>