PoliticsP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/korea45950441-dceb-4100-a1e6-fc5fe9b1bda8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/korea45950441-dceb-4100-a1e6-fc5fe9b1bda8-415x250-IndiaHerald.jpgఅమెరికాలో విధ్వంసకర పరిస్థితుల గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఈ విషయం పక్కన పెడితే అమెరికా కాంగ్రెస్ జో బైడెన్ గెలుపును అధికారికంగా ధ్రువీకరించింది. ఇదిలా ఉంటే.. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఎంపికైన గంటల వ్యవధిలోనే ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జాంగ్ ఉన్ ఎవరూ ఊహించని విధంగా సంచలన నిర్ణయంkorea;korea, south;american samoa;congress;donald trump;leader;dookuduజో బైడెన్ గెలిచిన వెంటనే.. ఉత్తర కొరియా అధ్యక్షుడు ఏం చేశాడో చూడండిజో బైడెన్ గెలిచిన వెంటనే.. ఉత్తర కొరియా అధ్యక్షుడు ఏం చేశాడో చూడండిkorea;korea, south;american samoa;congress;donald trump;leader;dookuduFri, 08 Jan 2021 11:35:08 GMTఅమెరికా కాంగ్రెస్ జో బైడెన్ గెలుపును అధికారికంగా ధ్రువీకరించింది. ఇదిలా ఉంటే.. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఎంపికైన గంటల వ్యవధిలోనే ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జాంగ్ ఉన్ ఎవరూ ఊహించని విధంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం అటు అమెరికా, ఇటు ఉత్తర కొరియా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం అందరికి విధితమే. అయితే ఇక ఇప్పుడు జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఎంపికైనప్పటికీ కిమ్ తన దూకుడును మాత్రం తగ్గించేందుకు ఇష్టపడటం లేదు. తన దేశ సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు ఆయన తాజాగా ప్రకటన చేశాడు.

బైడెన్‌ను దేశ అధ్యక్షుడిగా ప్రకటిస్తూ అమెరికా కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్న వెంటనే కిమ్ తన దేశ ప్రధాన నేతలతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా సైనిక వ్యవస్థ బలోపేతంపై ఈ సమావేశంలో ఆయన చర్చించినట్టు తెలుస్తోంది. మరోపక్క అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా కిమ్‌పై జో బైడెన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కిమ్ ఓ దుర్మార్గుడు అంటూ ఎన్నికల ప్రచారంలో జో బైడెన్ ఎవరూ ఊహించని విధంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలతో కిమ్, జో బైడెన్ కలిసి ముందుకు పోతారనే వాతావరణం ఎక్కడా కనిపించడం లేదు.

ఇప్పుడు ఆయన అమెరికాకు అధ్యక్షుడు అయిపోవడంతో ఉత్తర కొరియా ముందుగానే అన్ని రకాల పరిస్థితులకు సన్నద్దం అవుతున్నట్టు కనపడుతోంది. అందుకే కిమ్ తన సైనిక సామర్థ్యంపై దృష్టి పెడుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. బైడెన్ వస్తే ఇంతకు ముందు పరిస్థితి ఉండకపోవచ్చని, బైడెన్ చాలా కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని కిమ్ అంచనా వేస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు.









నేను "రెండో పెళ్లి "చేసుకోవడానికి కారణం వారే: సునీత

కొత్త తరహా మోసాల నేపధ్యంలో బ్యాంకు కష్టమర్లకు RBI హెచ్చరికలు...

రెండు రాష్ట్రాల్లో దిగిన ఆ నలుగురు ఎవరు...?

బాహుబలి మేనియా గుర్తు చేస్తున్న K.G.F చాప్టర్ 2..!

తెలంగాణకు ఎక్కువ డోసులు !

సిగిరెట్ తాగే వారికి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం

వీరిద్దరూ భార్యాభర్తలు.. విడాకులు కూడా తీసుకున్నారని ఎంతమందికి తెలుసు?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>