PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ కోర్టు పరిధిలోకి వెళ్లింది అని, జీవో నెంబరు 23, వచ్చేవిద్యా సంవత్సరం నుంచి అమలు అవుతుంది అని స్పష్టం చేసారు. కోవిడ్ సంక్షోభం కారణంగా అడ్మిషన్లు ఆలస్యం అయ్యాయి అని వెల్లడించారు. ఫస్ట్ ఇంటర్ అడ్మిషన్లు పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వం ఆన్ లైన్ అడ్మిషన్ నిర్ణయం తీసుకున్నాం అని అన్నారు. 50 శాతం మేర అడ్మిషన్లయ్యాక కొన్ని కార్పోరేట్ కళాశాలలు స్టేలు తెచ్చుకున్నాయి అని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి ఆన్ లైys jagan;amala akkineni;suresh;jr ntr;jagan;audimulapu suresh;andhra pradesh;nellore;minister;good news;good newwzవిద్యార్ధులకు జగన్ గుడ్ న్యూస్విద్యార్ధులకు జగన్ గుడ్ న్యూస్ys jagan;amala akkineni;suresh;jr ntr;jagan;audimulapu suresh;andhra pradesh;nellore;minister;good news;good newwzFri, 08 Jan 2021 21:30:00 GMTఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ కోర్టు పరిధిలోకి వెళ్లింది అని, జీవో నెంబరు 23, వచ్చేవిద్యా సంవత్సరం నుంచి అమలు అవుతుంది అని స్పష్టం చేసారు. కోవిడ్ సంక్షోభం కారణంగా అడ్మిషన్లు ఆలస్యం అయ్యాయి అని వెల్లడించారు. ఫస్ట్ ఇంటర్ అడ్మిషన్లు పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వం ఆన్ లైన్ అడ్మిషన్ నిర్ణయం తీసుకున్నాం అని అన్నారు. 50 శాతం మేర అడ్మిషన్లయ్యాక కొన్ని కార్పోరేట్ కళాశాలలు స్టేలు తెచ్చుకున్నాయి అని ఆయన పేర్కొన్నారు.

వచ్చే ఏడాది నుంచి ఆన్ లైన్ అడ్మిషన్లకు హై కోర్టు అనుమతి ఇచ్చింది అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆఫ్ లైన్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి అని వెల్లడించారు. అడ్మిషన్ల ప్రక్రియ 17 తేదీ వరకూ కొనసాగుతుంది అని పేర్కొన్నారు. 18 తేది నుంచి జూనియర్ కాలేజీల తరగతులు ప్రారంభవుతాయి అని, ప్రాక్టికల్స్ కూడా ఈ విద్యా సంవత్సరంలోనే నిర్వహిస్తాం అని అన్నారు. 30 శాతం మేర సిలబస్ ను తగ్గించాం అని పేర్కొన్నారు. ప్రైవేటు కళాశాలలు గత విద్యా సంవత్సరం ఫీజులో 30 శాతం తగ్గించి 70 శాతం ఫీజులు  మాత్రమే తీసుకోవాలి అని ఆయన తెలిపారు.

ఫిర్యాదులు వచ్చిన ప్రైవేటు జూనియర్ కళాశాలల అక్రమాలపై చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. అక్రమాలకు పాల్పడే కాలేజీల అఫిలియేషన్లను రద్దు చేస్తాం అన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం మే వరకు వుండే అవకాశం వుంది అని వ్యాఖ్యానించారు. పరీక్ష ల టైం టేబుల్  త్వరలో ప్రకటిస్తాం అన్నారు. పోటీ పరీక్షలకు ఇబ్బందులు లేకుండా విద్యా సంవత్సరం వుంటుంది అని చెప్పారు. కోవిడ్ సంక్షోభం నేపధ్యంలో ఇంటర్మీడియట్ కు సంబంధించి గత ఏడాది ఫీజులే తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది అన్నారు. కాలేజ్ ప్రాంగణాల్లో కమర్షియల్ వ్యవహారాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం అని స్పష్టం చేసారు. ఈ నెల 11 తేదీన నెల్లూరులో సీఎం జగన్ అమ్మ ఒడి రెండో విడత పథకాన్ని ప్రారంభిస్తారు అని అన్నారు.


టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా

దేవాలయాల మీద దాడులు వెనక కుట్ర కోణం...?

నాగార్జున సాగర్ ఫలితం తర్వాతే కాంగ్రెస్ భవిష్యత్ మారబోతుందా..?

ఇకపై ప్రతీ పరీక్ష ఆన్ లైన్ లోనే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>