PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan-pawane70d0a33-8903-4d8d-898c-915576823f75-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan-pawane70d0a33-8903-4d8d-898c-915576823f75-415x250-IndiaHerald.jpgఏపీలో విగ్రహాల ధ్వంసం ఘటనలు కొన్ని రోజులుగా రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు.. పదుల సంఖ్యలో ఘటనలు జరగడం అది కాస్తా రాజకీయ రంగు పులుముకున్న సంగతి తెలిసిందే. దీన్ని టీడీపీ, బీజేపీ, జనసేన అడ్వాంటేజ్ గా తీసుకునేందుకు ప్రయత్నించాయి. అయితే ఏపీ సీఎం జగన్ కూడా చాకచక్యంగానే స్పందించారు. దేవుళ్లపై రాజకీయం చేస్తున్నారని టీడీపీ నేతలు, బీజేపీ నేతలపై మండిపడ్డారు. అంతేకాదు.. టీడీపీ కూల్చిన గుళ్లు కూడా తమ ప్రభుత్వం కడుతుందని ప్రకటించేశారు. ఇక జగన్ ఆ రేంజ్‌లో కౌంటర్ ఇచ్చాక.. బీజేపీ అనుబంధ సంys-jagan-pawan;pawan;amala akkineni;deva;dharma;bharatiya janata party;jagan;andhra pradesh;janasena;tdp;ycp;janasena party;rama tirthaపాపం.. పవన్.. జగన్ షాక్‌తో ఏం మాట్లాడాలో తెలియట్లేదా..?పాపం.. పవన్.. జగన్ షాక్‌తో ఏం మాట్లాడాలో తెలియట్లేదా..?ys-jagan-pawan;pawan;amala akkineni;deva;dharma;bharatiya janata party;jagan;andhra pradesh;janasena;tdp;ycp;janasena party;rama tirthaFri, 08 Jan 2021 08:11:10 GMTటీడీపీ, బీజేపీ, జనసేన అడ్వాంటేజ్ గా తీసుకునేందుకు ప్రయత్నించాయి. అయితే ఏపీ సీఎం జగన్ కూడా చాకచక్యంగానే స్పందించారు. దేవుళ్లపై రాజకీయం చేస్తున్నారని టీడీపీ నేతలు, బీజేపీ నేతలపై మండిపడ్డారు. అంతేకాదు.. టీడీపీ కూల్చిన గుళ్లు కూడా తమ ప్రభుత్వం కడుతుందని ప్రకటించేశారు.

ఇక జగన్ ఆ రేంజ్‌లో కౌంటర్ ఇచ్చాక.. బీజేపీ అనుబంధ సంస్థగా మారిపోయిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఏం మాట్లాడాలో అర్థంకానట్టు కనిపిస్తోంది. గత ప్రభుత్వ కాలంలో కూల్చిన ఆలయాల్ని కడుతున్నామని చెబుతున్న ప్రభుత్వం... గత 18 నెలలుగా ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదని ఇప్పుడు పవన్ ప్రశ్నిస్తున్నారు. ఆలయాల పునర్నిర్మాణం, అభివృద్ధి పనులు ప్రభుత్వ విధి నిర్వహణలో భాగమేనని... హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేకంగా చేస్తున్న పనులేం కావని అంటున్నారు.

అంతే కాదు.. ఆలయాల ఆస్తులు, విగ్రహాల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం తీసుకొనే చర్యల గురించి ఇప్పటికీ స్పష్టత లేదని అంటున్నారు. అంతర్వేదిలో రథం దగ్ధం ఘటన సమయంలోనే అన్ని ఆలయాలలో సి.సి.కెమెరాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించినా అమలు చేయలేదన్నారు. ఇటీవల రామతీర్థంలో శ్రీ కోదండరామ స్వామి విగ్రహం ధ్వంసం తర్వాత అదే మాట చెప్పటాన్ని తప్పుబట్టారు. దేవాదాయ శాఖ పరిధిలో 26వేల ఆలయాలు ఉంటే... అందులో ఎన్నింటికి  సి.సి.కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారని ప్రశ్నించారు.

కాంట్రాక్టుల్లో వచ్చే కమీషన్ల మీద పెట్టే శ్రద్ధ... ఆలయాలకు సి.సి.కెమెరాలు ఏర్పాటు మీదా పెట్టాలని పవన్ సూచించారు. ఆధునిక సాంకేతికత ఉన్న కెమెరాలను అమర్చటతో పాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే కేవలం ప్రకటనలకు, ప్రచారం కోసం మాత్రమే సి.సి. కెమెరాల గురించి ప్రభుత్వం మాట్లాడుతోందని భావించాల్సి వస్తుందన్నారు. ఇది బాగానే ఉంది.. మరి టీడీపీ హయాంలో గుళ్లు కూల్చినప్పుడు ఇదే పవన్ ఎందుకు ప్రశ్నించలేదో అర్థం కాలేదంటున్నారు వైసీపీ నేతలు.


వంటలక్క సహనం హద్దులు దాటిందండోయ్.. మోనిత పని ఇక ఔటే

సిగిరెట్ తాగే వారికి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం

వీరిద్దరూ భార్యాభర్తలు.. విడాకులు కూడా తీసుకున్నారని ఎంతమందికి తెలుసు?

అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?

తెరాస పార్టీ బీజేపీ ని కాకుండా బండి ని టార్గెట్ చేయడంలో మర్మం ఏంటి..?

ఐటీఐఆర్ ప్రాజెక్టును పునరుద్దరించండి

తిరుపతిలో వైసీపీ ఓడిపోతుందా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>