PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ramatheertham352780fb-704c-4e0a-970f-2f7e5c3db69f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ramatheertham352780fb-704c-4e0a-970f-2f7e5c3db69f-415x250-IndiaHerald.jpgరామతీర్ధం దేవాలయ ఘటన కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. దేవాలయంలో విగ్రహాల ధ్వంసం చేసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విజయనగరం పోలీసులు, ఇద్దరి దగ్గర నుంచి ఎలక్ట్రికల్ రంపం స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. ఈ ఇద్దరూ రెండు దేవాలయాల్లో విగ్రహాలను ఎలక్ట్రికల్ రంపంతో కోసినట్టు గుర్తించారు. వైజాగ్ కు చెందిన ఈ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వీరు మరో రెండు దేవాలయాలతో పాటు మరో రెండు చోట్ల దుండగులు రెక్కీ నిర్వహించినట్టు చెబుతున్నారు. ఆలయాల్లోనే కాక కృష్ణా జిల్లాలో, పశ్చిandhrapradesh;krishna;visakhapatnam;krishna river;andhra pradesh;district;vishakapatnam;police;media;collectorరామతీర్ధం ఘటనకు పాల్పడింది వారే.. తేల్చేసిన పోలీసులు !రామతీర్ధం ఘటనకు పాల్పడింది వారే.. తేల్చేసిన పోలీసులు !andhrapradesh;krishna;visakhapatnam;krishna river;andhra pradesh;district;vishakapatnam;police;media;collectorFri, 08 Jan 2021 11:00:00 GMTరామతీర్ధం దేవాలయ ఘటన కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు.  దేవాలయంలో విగ్రహాల ధ్వంసం చేసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విజయనగరం పోలీసులు, ఇద్దరి దగ్గర నుంచి ఎలక్ట్రికల్ రంపం స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. ఈ ఇద్దరూ రెండు దేవాలయాల్లో విగ్రహాలను ఎలక్ట్రికల్ రంపంతో కోసినట్టు గుర్తించారు.  వైజాగ్ కు చెందిన ఈ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వీరు మరో రెండు దేవాలయాలతో పాటు మరో రెండు చోట్ల దుండగులు రెక్కీ నిర్వహించినట్టు చెబుతున్నారు. ఆలయాల్లోనే కాక కృష్ణా జిల్లాలో, పశ్చిమగోదావరి జిల్లాలోని రెండు వైన్ షాపుల వద్ద కూడా రెక్కీ నిర్వహించినట్టు చెబుతున్నారు. 


అయితే వీరిని ఈరోజు పోలీసులు మీడియా ముందు ప్రవేశ పెట్టే అవకాశం కనిపిస్తోంది. అయితే వీరికి ఎలాంటి రాజకీయ పార్టీతో సంబంధం ఉన్న అంశం అయితే బయటకు రాలేదు. వీరు దోపిడీ దొంగలని పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో తేలింది. అయితే ఇప్పటి దాకా ఈ అంశం మీద రాజకీయ రగడ రేగిన నేపధ్యంలో ఈ దోపిడీ దొంగలు దొరకడం సంచలనంగా మారింది. ఏపీ సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మత సామరస్యాన్ని కాపాడేలా రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కమిటీలు వేస్తున్నామని అన్నారు. 

రాష్ట్ర స్థాయిలో సీఎస్ చైర్మన్ గా డీజీపీ వైస్ చైర్మన్ గా మత సామరస్య  కమిటీ ఏర్పాటు చేశారు. జిల్లాల్లో కలెక్టర్ చైర్మన్ గా, ఎస్పీ వైస్ చైర్మన్ గా  కమిటీలు ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఏడీజీ అయ్యన్నార్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై విచారణ జరుగుతోందని, కృష్ణా, రాజమండ్రిల్లో జరిగిన ఘటనల్లో ఒకే ఎలక్ట్రిక్ రంపాన్ని వాడినట్టు నిర్ధారణకు వచ్చామని ఈ తరహా ఆధారాలు చూస్తుంటే కుట్ర కోణం ఉన్నట్టు అనుమానం కలుగుతుందని అన్నారు.  


ఇదీ హిందూమతం పట్ల మా అభిమతం

రెండు రాష్ట్రాల్లో దిగిన ఆ నలుగురు ఎవరు...?

బాహుబలి మేనియా గుర్తు చేస్తున్న K.G.F చాప్టర్ 2..!

తెలంగాణకు ఎక్కువ డోసులు !

సిగిరెట్ తాగే వారికి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం

వీరిద్దరూ భార్యాభర్తలు.. విడాకులు కూడా తీసుకున్నారని ఎంతమందికి తెలుసు?

అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>