PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kinga91b2655-7c7f-4535-9aec-b8842cab1ccc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kinga91b2655-7c7f-4535-9aec-b8842cab1ccc-415x250-IndiaHerald.jpgరాజులు రాజ్యాలు ఆ కధలూ అయిపోయాయని చరిత్ర పుస్తకంలో చదువుకోవాలని ఎవరైనా లైట్ తీసుకుంటే పొరపాటే. ప్రజాస్వామ్యం ఇది. ప్రతీ ఒక్క ఓటుకూ ఒక విలువా వాల్యూ ఉంది. అలాగే ప్రతీ ఒక్క కులానికి కూడా పొలిటికల్ గా పక్కాగా సీన్ ఉంది. దాన్ని ఒడిసిపట్టి వాడుకున్న వాడే రాజకీయంగా బహు మొనగాడు అవుతాడు. ఏపీలో అన్ని కులాలూ ఉన్నాయి. కులాల ఈక్వేషన్స్ లో ఎవరు ఎక్కువగా పండిపోతే వారికే సీఎం కుర్చీ దాసోహం అంటుంది. king;cbn;prabhas;ashok;krishnam raju;srinivas;delhi;bharatiya janata party;godavari river;kshatriya;jagan;2019;mp;tamil;history;king;sucide;mla;minister;governor;prize;gift;ycp;partyరాజుల రెబలిజానికి బీజేపీ భారీ గిఫ్ట్ ?రాజుల రెబలిజానికి బీజేపీ భారీ గిఫ్ట్ ?king;cbn;prabhas;ashok;krishnam raju;srinivas;delhi;bharatiya janata party;godavari river;kshatriya;jagan;2019;mp;tamil;history;king;sucide;mla;minister;governor;prize;gift;ycp;partyFri, 08 Jan 2021 20:00:00 GMTచరిత్ర పుస్తకంలో చదువుకోవాలని ఎవరైనా లైట్ తీసుకుంటే పొరపాటే. ప్రజాస్వామ్యం ఇది. ప్రతీ ఒక్క ఓటుకూ ఒక విలువా వాల్యూ ఉంది. అలాగే ప్రతీ ఒక్క కులానికి కూడా పొలిటికల్ గా  పక్కాగా సీన్ ఉంది. దాన్ని ఒడిసిపట్టి వాడుకున్న వాడే రాజకీయంగా బహు మొనగాడు అవుతాడు. ఏపీలో అన్ని కులాలూ ఉన్నాయి. కులాల ఈక్వేషన్స్ లో ఎవరు ఎక్కువగా పండిపోతే వారికే సీఎం కుర్చీ దాసోహం అంటుంది.

అది 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు కానీ 2019 ఎన్నికల్లో జగన్ కి కానీ అనుభవమే. కులాల పాత్రను ఎంత మాత్రం తక్కువ చేయడం అంటే ఆ పార్టీ కానీ రాజకీయ నాయకుడికి కానీ ఆత్మహత్యా సదృశ్యమే. ఏపీలో రాజులు ఇపుడు వైసీపీ మీద గుర్రుగా ఉన్నారని ప్రచారం గట్టిగా సాగుతోంది. గెలిచిన మూడు నెలలకే రెబెల్ గా మారిన నర్సాపురం ఎమ్మెల్యే రఘు రామ క్రిష్ణం రాజు ఆ పార్టీకి కంట్లో నలుసుగా మారారు. ఇక మరో వైపు చూస్తే తాజాగా దేవాదాయ మంత్రి వెల్లమపల్లి శ్రీనివాస్ విజయన‌గరం రాజులైన పూసపాటి అశోక్ గజపతిరాజు మీద కొన్ని హార్ష్ కామెంట్స్ చేస్శారు. దాంతో మొత్తం క్షత్రియ పరిషత్ గుస్సా అయింది.

ఈ రెండు పరిణామాలు చూస్తే ఇటు ఉత్తరాంధ్రా,  అటు గోదావరి జిల్లాల్లోని రాజులు ఫ్యాన్ పార్టీ అంటే మండేలా చేసింది అంటున్నారు. నిజానికి 2014 ఎన్నికల్లో రాజులు గుత్తమొత్తంగా టీడీపీకి ఓట్లు వేశారు. వైసీపీని వారు దూరం పెట్టారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అవిపుడు అప్రస్తుతం. కానీ 2019 నాటికి మాత్రం రాజులు అంతా ఒక్కటిగా నిలిచి వైసీపీని గెలిపించారు. ఇపుడు వారే రివర్స్ అవుతున్నారు.

ఇలా రివర్స్ అయిన రాజుల మద్దతు ని తీసుకునేందుకు బీజేపీ రెడీ అవుతోంది. నిజానికి బీజేపీకి గోదావరి జిల్లాలో రాజుల మద్దతు ఎపుడూ ఉంది. అదే సమయంలో ఇపుడు వైసీపీ రెబెల్ ఎంపీ రఘు రామక్రిష్ణం రాజు కూడా బీజేపీ వైపే చూస్తున్నారు. ఆయన మీద అనర్హత వేటు వేయించి నర్శాపురంలో ఉప ఎన్నికలు పెట్టించి తమ ఎంపీగా గెలిపించుకోవడానికి బీజేపీ ట్రై చేస్తోంది అన్న వార్త ఢిల్లీ సర్కిల్స్  లో ప్రచారం అవుతోంది. మరో వైపు చూసుకుంటే సినీ నటుడు క్రిష్ణంరాజుకి  తమిళ నాడు గవర్నర్ గా భారీ బహుమతి ఇచ్చి ఆయన ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ కి తమ వైపునకు తిప్పుకోవాలని బీజేపీ చూస్తోంది. మొత్తానికి రాజులను తమ వైపు లాగేయాలని బీజేపీ మంత్రాంగం హిట్ అయితే ఏపీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారుతాయి.




ఏపీ సీఎం జగన్ ని పొగుడుతూ కృతజ్ఞతలు తెలిపిన బీజేపీ నేత సోము వీర్రాజు

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా

దేవాలయాల మీద దాడులు వెనక కుట్ర కోణం...?

నాగార్జున సాగర్ ఫలితం తర్వాతే కాంగ్రెస్ భవిష్యత్ మారబోతుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>