PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jana-reddy-behind-the-reason-for-tpcc-announcement-postponement84d1eb09-a870-477d-ae73-3604dd89fef5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jana-reddy-behind-the-reason-for-tpcc-announcement-postponement84d1eb09-a870-477d-ae73-3604dd89fef5-415x250-IndiaHerald.jpgతెలంగాణ పీసీసీ పీఠం రేవంత్ రెడ్డికే అనుకున్నారంతా.. కుదరకపోతే కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి కూడా అవకాశముందని అంచనా వేశారు. అయితే కోమటిరెడ్డి కుటుంబాన్నుంచి బీజేపీ బెదిరింపు వినపడటంతో.. అధిష్టానం కూడా గుర్రుగా ఉందని, దాదాపుగా పీసీసీ పదవి రేవంత్ కే ఖాయమైందనే వార్తలూ వినిపించాయి. ఈ దశలో అసలు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు పూర్తయ్యే వరకు టీపీసీసీ ప్రకటన ఉండదని ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ స్పష్టం చేశారు. దీంతో మరోసారి రేవంత్ పేరు వెనకపడిపోయింది. revanth reddy;view;nagarjuna akkineni;raghu;revanth;bharatiya janata party;telangana rashtra samithi trs;nagarjuna sagar dam;telangana;revanth reddy;congress;smart phone;tpcc;assembly;mla;minister;janareddy;reddyరేవంత్ రెడ్డికి అడ్డుగా నిలిచింది జానారెడ్డేనా..?రేవంత్ రెడ్డికి అడ్డుగా నిలిచింది జానారెడ్డేనా..?revanth reddy;view;nagarjuna akkineni;raghu;revanth;bharatiya janata party;telangana rashtra samithi trs;nagarjuna sagar dam;telangana;revanth reddy;congress;smart phone;tpcc;assembly;mla;minister;janareddy;reddyFri, 08 Jan 2021 09:00:00 GMTతెలంగాణ పీసీసీ పీఠం రేవంత్ రెడ్డికే అనుకున్నారంతా.. కుదరకపోతే కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి కూడా అవకాశముందని అంచనా వేశారు. అయితే కోమటిరెడ్డి కుటుంబాన్నుంచి బీజేపీ బెదిరింపు వినపడటంతో.. అధిష్టానం కూడా గుర్రుగా ఉందని, దాదాపుగా పీసీసీ పదవి రేవంత్ కే ఖాయమైందనే వార్తలూ వినిపించాయి. ఈ దశలో అసలు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు పూర్తయ్యే వరకు టీపీసీసీ ప్రకటన ఉండదని ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ స్పష్టం చేశారు. దీంతో మరోసారి రేవంత్ పేరు వెనకపడిపోయింది.

సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి వల్లే టీపీసీసీ రేస్ లో రేవంత్ రెడ్డి పేరు బైటకు రాకుండా ఆగిపోయినట్టు తెలుస్తోంది. జానా కోరిక వల్లే కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ అధ్యక్షుడు ఎవరో పేరు బయట పెట్టకుండా వాయిదా వేసిందని అంటున్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక అయిపోయాక టీపీసీసీ అధ్యక్షుడి పేరు ప్రకటించాలని ఆయన హైకమాండ్ ను కోరారట. ఇప్పుడే పేరు ప్రకటిస్తే పార్టీలో అభిప్రాయ భేదాలు వస్తాయని, గందరగోళంగా తయారవుతుందని, ఈ ప్రభావం సాగర్ ఉప ఎన్నిక మీద పడి విజయాకాశాలు దెబ్బతింటాయని చెప్పారట. దీంతో ఆయన చెప్పిన సలహాను అధిష్టానం గౌరవించి అంగీకరించిందని, అందుకే టీపీసీసీ ప్రకటన వాయిదా వేసిందని అంటున్నారు.

ఓ దశలో తనకు బదులు తన కుమారుడు రఘువీర్ రెడ్డిని బరిలోకి దించాలని జానారెడ్డి ఆలోచించారు. అయితే తాజాగా నాగార్జున సాగర్‌ లో పోటీ చేసే విషయంలో జానారెడ్డి మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే కొత్త పీసీసీ చీఫ్ ఎంపికను నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పూర్తయ్యేవరకు ఆపాలని ఆయన కాంగ్రెస్ హైకమాండ్‌ కు ఫోన్ చేసి చెప్పినట్టు తెలుస్తోంది. ఉప ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థి కావడం, సీనియర్ నేత కావడంతో జానారెడ్డి ప్రతిపాదనకు కాంగ్రెస్ హైకమాండ్ అంగీకరించిందని తెలుస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణం కారణంగా నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ స్థానాన్ని మళ్లీ నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్.. దుబ్బాక తరహాలో ఇక్కడ కూడా సత్తా చాటాలని బీజేపీ, ఈసారైనా గెలవాలని కాంగ్రెస్ వ్యూహారచన మొదలుపెట్టాయి. ఈ క్రమంలో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా సాగే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 


అఖిలప్రియ రిమాండ్ రిపోర్టులో సంచలనాలు!

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా

సిగిరెట్ తాగే వారికి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం

వీరిద్దరూ భార్యాభర్తలు.. విడాకులు కూడా తీసుకున్నారని ఎంతమందికి తెలుసు?

అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?

తెరాస పార్టీ బీజేపీ ని కాకుండా బండి ని టార్గెట్ చేయడంలో మర్మం ఏంటి..?

ఐటీఐఆర్ ప్రాజెక్టును పునరుద్దరించండి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>