MoviesNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sam-jam-chaitanyaf7776a66-e361-41d4-8bc2-e73f04da2b50-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sam-jam-chaitanyaf7776a66-e361-41d4-8bc2-e73f04da2b50-415x250-IndiaHerald.jpgసమంత అక్కినేని తొలిసారిగా "సామ్ జామ్" అనే టాక్ షోతో తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. ప్రశంసలు కూడా అందుకుంది. కానీ ఈ షోకు అనుకోకుండా శుభం కార్డు పడటం మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నిజానికి సమంత ఓ టాక్ షోతో ప్రేక్షకుల ముందు వస్తోంది అనగానే ఈ షోకు హైప్ బాగా పెరిగింది. కానీ ఈ షోలో ఎదో మిస్సవుతోంది. కావలిసినంత స్పార్క్ ఈ షోలో ఉండటం లేదు కాబట్టే ఈ షో ఎక్కువమందికి రీచ్ కాలేదేమో అనంటున్నారు విశ్లేషకులు. sam jam chaitanya;naga chaitanya;naga;nageshwara rao akkineni;sam;samantha;naga aswin;hollywood;episode;husband;chaitanya 1;sam mendesసామ్ టాక్ షో గురించి చైతూ కామెంట్స్ అందుకేనటసామ్ టాక్ షో గురించి చైతూ కామెంట్స్ అందుకేనటsam jam chaitanya;naga chaitanya;naga;nageshwara rao akkineni;sam;samantha;naga aswin;hollywood;episode;husband;chaitanya 1;sam mendesFri, 08 Jan 2021 15:00:00 GMTసమంత అక్కినేని తొలిసారిగా "సామ్ జామ్" అనే టాక్ షోతో తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. ప్రశంసలు కూడా అందుకుంది. కానీ ఈ షోకు అనుకోకుండా శుభం కార్డు పడటం మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

నిజానికి సమంత ఓ టాక్ షోతో ప్రేక్షకుల ముందు వస్తోంది అనగానే ఈ షోకు హైప్ బాగా పెరిగింది. కానీ ఈ షోలో ఎదో మిస్సవుతోంది. కావలిసినంత స్పార్క్ ఈ షోలో ఉండటం లేదు కాబట్టే ఈ షో ఎక్కువమందికి రీచ్ కాలేదేమో అనంటున్నారు విశ్లేషకులు.

ఒక హాలీవుడ్ షోను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈ షోను డిజైన్ చేయడానికి చేసిన ప్రయత్నం ఎందుకో ఫలించలేదని తెలుస్తోంది. ఒకవేళ ఈ షో గనక టీవీలో ప్రసారమై ఉండుంటే మరింత ఎక్కువగా ప్రేక్షకులకు రీచై ఉండేది. ఆడియెన్స్ మన్ననలు పొందేది. కేవలం ఓటీటీకే పరిమితమవడం ఈ షో లిమిటేషన్ అని చెప్పుకోవచ్చని అంటున్నారు విశ్లేషకులు.

ఇక సామ్ జామ్ షోలో ఆఖరి ఎపిసోడ్ లో గెస్ట్ గా సమంత భర్త నాగచైతన్య వచ్చాడు. తనను చివరి ఎపిసోడ్ కు పిలిచినందుకు నాగ చైతన్య ఫీలైనట్టు మనకు ఈ ప్రోమో చూస్తే అర్థమవుతోంది. 'ఇంట్లోనే పడుంటాను కాబట్టి లాస్ట్ ఎపిసోడ్ కు పిలిచావు కదా' అంటూ ఫన్నీగా సమంతను ట్రోల్ చేశాడు.

మొత్తానికి ఈ షోకు గెస్ట్ లను ఆహ్వానించడం కూడా తలనొప్పిగా మారిందట. షూటింగ్స్ ప్రారంభమైపోవడంతో ఎక్కడివారక్కడ బిజీగా ఉన్నారట. నిజానికి, ఈ ఎపిసోడ్ లో చైతూ బదులు వేరే స్టార్ రావాల్సి ఉంది. ఆ స్టార్ షూటింగ్ లో బిజీగా ఉండటంతో చైతూను లాస్ట్ మినిట్ లో రిక్వస్ట్ చేశారట.

సెలెబ్రిటీలను ఈ షో కు ఆహ్వానించడం కష్టంగా మారడంతో "సామ్ జామ్"కు శుభం కార్డు పలికినట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే సమంత కూడా "శాకుంతలం"  మూవీపై ఫోకస్ పెడుతోంది. అవసరమైన మార్పులూ చేర్పులూ చేసి సీజన్ 2తో "సామ్ జామ్" మరింత ఇంటరెస్టింగ్ గా వస్తుందని ఆశిద్దాం. 


సోహెల్ కి ఇంత క్రేజ్ ఎక్కన్నుంచి వచ్చింది.. ఏకంగా బాలీవుడ్ లో నటించబోతున్నాడు...

జీవ‌తా రాజ‌శేఖ‌ర్ ఎమ్మెల్యేగా పోటీ... ఆ సీటుపైనే గురి పెట్టారా..!

విచార‌ణ‌లో షాకింగ్ విష‌యాలు చెప్పిన అఖిల‌ప్రియ‌

తెలంగాణ‌ను క‌బ‌ళిస్తోన్న బ‌ర్డ్ ఫ్లూ... కోళ్ల బిజినెస్ కుదేలు.. ఏపీలోనూ ఇంత డేంజ‌రా..?

కేజీఎఫ్ 2 టీజ‌ర్ తుస్సుమందే... యూ ట్యూబ్‌లో పేల‌లేదు...!

బాల‌య్య ఇదేం గోల‌య్యా... వైసీపీకి ఎంత లాభం చేశావో చూడు...!

కేంద్రంతో కేటీఆర్ యుద్ధం.. దేనికి సంకేతం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>