BeautyNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/beauty/sagittarius_sagittarius/without-makeup62e54f87-278a-4b7e-81ae-a6164cf1df3b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/beauty/sagittarius_sagittarius/without-makeup62e54f87-278a-4b7e-81ae-a6164cf1df3b-415x250-IndiaHerald.jpgబయటికి వెళ్లాలంటే మేకప్ తప్పనిసరిగా వేసుకోవాలన్న ఆలోచనలోంచి ఈజీగా బయటపడాలని చూస్తున్నారా ? ప్రతిసారి మేకప్ వేసుకోవడం చిరాకు తెప్పిస్తోందా? ఐతే, ఈ ఆర్టికల్ మీ కోసమే. మేకప్ లేకుండా కూడా అందంగా కనిపించే చిట్కాలను ఈరోజు మీరు తెలుసుకోండి. ఎల్లప్పుడూ అందంగా మెరిసిపోండి. మరింకెందుకు ఆలస్యం. వివరాల్లోకి వెళ్ళిపోదాం... without makeup;makeupమేకప్ లేకుండా అందంగా కనిపించడమెలా...?మేకప్ లేకుండా అందంగా కనిపించడమెలా...?without makeup;makeupFri, 08 Jan 2021 17:00:00 GMTమేకప్ తప్పనిసరిగా వేసుకోవాలన్న ఆలోచనలోంచి ఈజీగా బయటపడాలని చూస్తున్నారా? ప్రతిసారి మేకప్ వేసుకోవడం చిరాకు తెప్పిస్తోందా? ఐతే, ఈ ఆర్టికల్ మీ కోసమే. మేకప్ లేకుండా కూడా అందంగా కనిపించే చిట్కాలను ఈరోజు మీరు తెలుసుకోండి. ఎల్లప్పుడూ అందంగా మెరిసిపోండి. మరింకెందుకు ఆలస్యం. వివరాల్లోకి వెళ్ళిపోదాం...

సన్ స్క్రీన్ తప్పనిసరి:

బయటికి వెళ్లడానికి పదినిమిషాల ముందు సన్ స్క్రీన్ ను అప్లై చేసుకోవడం తప్పనిసరి. ఇది మీ స్కిన్ కు రక్షణగా ఉంటుంది. దాంతో, స్కిన్ తన సహజ సౌందర్యాన్ని కోల్పోదు. మేకప్ వేసుకోకపోయినా మీ స్కిన్ నేచురల్ గా అందంగా కనిపిస్తుంది.

టింటెడ్ మాయిశ్చరైజర్:

మీ ముఖం డల్ గా కనిపిస్తోందా. ఐతే, టింటెడ్ మాయిశ్చరైజర్ ను వాడండి. ఇది మీడియం కవరేజ్ ఇస్తుంది. కేవలం అకేషన్స్ సమయంలోనే హై కవరేజ్ మాయిశ్చరైజర్స్ జోలికి వెళ్ళండి. సో, హెవీ మేకప్ వేసుకున్న ఫీల్ మీకు రాదు.  

గోరువెచ్చటి నిమ్మరసం:

ప్రతి రోజూ ఉదయాన్నే గోరువెచ్చటి నిమ్మరసాన్ని తాగడాన్ని అలవాటు చేసుకోండి. ఈ మార్నింగ్ రొటీన్ అనేది శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపిస్తుంది. మీ శరీరం ప్యూరిఫై అవుతుంది. దాంతో, సహజంగానే చర్మం కాంతివంతంగా మారుతుంది.

ఎక్స్ఫోలియేషన్:

కొన్నిసార్లు మన స్కిన్ కు ఎక్స్ట్రా పాంపరింగ్ అవసరం. కాబట్టి, మంచి స్క్రబ్ తో ముఖాన్ని ఎక్స్ఫోలియేట్ చేసుకోవాలి. ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించేందుకు హెల్ప్ చేసే ప్రక్రియ. అలాగే చర్మరంధ్రాలు కూడా శుభ్రపడతాయి. డల్ గా కనిపించే స్కిన్ ప్రకాశవంతంగా మారుతుంది. వారానికి రెండు నుంచి మూడు సార్లు ఎక్స్ఫోలియేట్ చేసుకోవాలి.

టోనర్:

ఫేస్ వాష్ చేసుకోగానే టోనర్ ను వాడాలి. దీని వల్ల స్కిన్ లోని పీహెచ్ లెవెల్స్ బాలన్స్ అవుతాయి. స్కిన్ తాజాగా కనిపిస్తుంది. మేకప్ లేకుండా కూడా అందంగా ఉంటారు.

హైడ్రేటెడ్ గా ఉండండి:

స్కిన్ హెల్తీగా అలాగే ప్రకాశవంతంగా ఉండాలంటే, హైడ్రేటెడ్ గా ఉండండి. రోజంతా తగినంత నీటిని తాగండి. చర్మాన్ని ప్రతి రోజూ మాయిశ్చరైజ్ చేసుకోవాలి.


ఫోన్‌కు వచ్చిన లింక్ ఓపెన్ చేశాడు.. ఐదు నిమిషాల తర్వాత ఒక్కసారిగా షాక్!

రికార్డులను కొల్లగొడుతున్న రాకింగ్ స్టార్ యష్

కీలక విషయాన్ని బయటపెట్టిన పవన్ కల్యాణ్ భార్య

ఒకేరోజు 9 ఆలయాలకు సీఎం జగన్ భూమి పూజ

ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎం లకు క్లిష్ట పరిస్థితులు...?

జీవ‌తా రాజ‌శేఖ‌ర్ ఎమ్మెల్యేగా పోటీ... ఆ సీటుపైనే గురి పెట్టారా..!

విచార‌ణ‌లో షాకింగ్ విష‌యాలు చెప్పిన అఖిల‌ప్రియ‌




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>