MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/okkadu-sequel-update195ad766-8812-4f33-852e-750a52b02345-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/okkadu-sequel-update195ad766-8812-4f33-852e-750a52b02345-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన బ్లాక్బస్టర్ మూవీ ఒక్కడు. 2003 జనవరిలో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో అది పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టి సూపర్ స్టార్ మహేష్ బాబుకి హీరోగా అతి పెద్ద కమర్షియల్ సక్సెస్ ను అందించిన విషయం తెలిసిందే. భూమిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, ఓబుల్ రెడ్డి అనే విలన్ పాత్రలో నటించి ప్రేక్షకాభిమానుల నుంచి మంచి పేరు దక్కించుకున్నారు. ఇక ఈ సినిమాలో కబడ్డీ ప్లేయర్ గా సూపర్ స్టార్ మహేష్ okkadu;ms raju;cbn;mahesh;bhumika chawla;prakash raj;ajay;gunasekhar;hari;hari music;kranthi;kranti;mahesh babu;mani sharma;raj;suma;suma kanakala;sumanth;thaman s;makar sakranti;andhra pradesh;tollywood;cinema;rajani kanth;sankranthi;media;producer;industry;blockbuster hit;hiranyakashyapa;producer1;heroine;success;research and analysis wing;reddyమహేష్ బాబు తో 'ఒక్కడు - 2' ఫిక్స్ అట .... కానీ ఆయన చేయడం లేదట .....??మహేష్ బాబు తో 'ఒక్కడు - 2' ఫిక్స్ అట .... కానీ ఆయన చేయడం లేదట .....??okkadu;ms raju;cbn;mahesh;bhumika chawla;prakash raj;ajay;gunasekhar;hari;hari music;kranthi;kranti;mahesh babu;mani sharma;raj;suma;suma kanakala;sumanth;thaman s;makar sakranti;andhra pradesh;tollywood;cinema;rajani kanth;sankranthi;media;producer;industry;blockbuster hit;hiranyakashyapa;producer1;heroine;success;research and analysis wing;reddyFri, 08 Jan 2021 22:41:39 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన బ్లాక్బస్టర్ మూవీ ఒక్కడు. 2003 జనవరిలో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో అది పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టి సూపర్ స్టార్ మహేష్ బాబుకి హీరోగా అతి పెద్ద కమర్షియల్ సక్సెస్ ను అందించిన విషయం తెలిసిందే. భూమిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, ఓబుల్ రెడ్డి అనే విలన్ పాత్రలో నటించి ప్రేక్షకాభిమానుల నుంచి మంచి పేరు దక్కించుకున్నారు. ఇక ఈ సినిమాలో కబడ్డీ ప్లేయర్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు అజయ్ అనే పాత్ర పోషించి తన అత్యద్భుత నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.

ఈ మూవీకి మణిశర్మ అందించిన సాంగ్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయే విజువల్స్ ఆకట్టుకునే డైలాగ్స్ అలరించే ఫైట్స్ వెరసి ఒక్కడు సినిమాని అతి పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ చేసాయి. ఇక ప్రస్తుతం అతి త్వరలో మహేష్ బాబు నటించనున్న సినిమా సర్కారు వారి పాట. పరశురాం పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇకపోతే ఇటీవల ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించిన సినిమా డర్టీ హరి కొద్దిరోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ ని అందుకుంది. అయితే ఇటీవల కొన్నాళ్ల క్రితం నుండి తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా పలువురు ప్రేక్షకులు అలానే అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నారు నిర్మాత ఎమ్మెస్ రాజు. ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా అతి త్వరలోనే మహేష్ బాబుతో సినిమా గురించిన పూర్తి వివరాలు వెల్లడిస్తానని అప్పటి వరకు సంయమనం పాటించాలని ఆయన కోరారు.

అలానే మరో అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఒక్కడు సీక్వెల్ వుండే అవకాశం కూడా లేకపోలేదని ఆయన చిన్న హింట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ విషయమై లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి  ఇప్పటికే ఒక్కడు సీక్వెల్ కు సంబంధించి కథను సిద్ధం చేయించిన ఎమ్మెస్ రాజు, దానిని తన బ్యానర్ పై మహేష్ బాబు హీరోగా తెరకెక్కించనున్నారని, అయితే దర్శకుడు మాత్రం గుణశేఖర్ కాదనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. దానికి కారణం ఏంటంటే ప్రస్తుతం శాకుంతలం సినిమా అలానే దాని తర్వాత హిరణ్యకశ్యప సినిమాల పనుల్లో కూడా బిజీగా ఉండే గుణశేఖర్ ఈ రెండు సినిమాల పైన మరొక మూడేళ్ల వరకు దృష్టి పెట్టనున్నారని ఆ కారణంగానే ఒక్కడు సీక్వెల్ ని మరో దర్శకుడికి అప్పగించే అవకాశం ఉందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రావాలి అంటున్నారు విశ్లేషకులు......!!


పవన్ పర్యటనపై హైడ్రామా.. సజావుగా సాగేనా?

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. ఏంటంటే..

రైతు సంఘాలతో కేంద్ర సమావేశం.. ఏం మాట్లాడారంటే..

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>