MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kapil52fe776d-479a-4da3-8e5f-e83b4a785d27-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kapil52fe776d-479a-4da3-8e5f-e83b4a785d27-415x250-IndiaHerald.jpgప్రముఖ యాంకర్ కపిల్ శర్మ గురించి తెలియని వారుండరూ. ‘ది కపిల్ శర్మ షో’లో యాంకర్ గా హోస్ట్ చేస్తూ ప్రేక్షకుల ప్రేమ, ఆదరణను పెంపొందించుకున్నారు. సినిమా హీరో, హీరోయిన్లతో ఇంటర్యూలు చేస్తూ.. కామెడీ కన్వర్జెషన్ మధ్య సాగే ఈ షోకు ఇండియాలోనే కాకుండా వేరే దేశాల్లోనూ విపరీతమైన క్రేజ్. బాలీవుడ్ కామెడి కింగ్ కపిల్ శర్మ ఓ కేసులో ఇరుక్కుపోయాడు. గురువారం ముంబై క్రైం ఇంటెలిజెన్స్ సంస్థ ఆయనకు సమన్లు ఇచ్చింది.kapil;kapil sharma 1;dileep;dilip;prema;mumbai;delhi;bollywood;cinema;police;december;king;love;comedy;police station;arrest;hero;king 1;vegetable market;traffic policeప్రముఖ యాంకర్ కపిల్ శర్మపై పోలీసులు నోటీసుల జారీ..!ప్రముఖ యాంకర్ కపిల్ శర్మపై పోలీసులు నోటీసుల జారీ..!kapil;kapil sharma 1;dileep;dilip;prema;mumbai;delhi;bollywood;cinema;police;december;king;love;comedy;police station;arrest;hero;king 1;vegetable market;traffic policeFri, 08 Jan 2021 10:00:00 GMTకపిల్ శర్మ గురించి తెలియని వారుండరూ. ‘ది కపిల్ శర్మ షో’లో యాంకర్ గా హోస్ట్ చేస్తూ ప్రేక్షకుల ప్రేమ, ఆదరణను పెంపొందించుకున్నారు. సినిమా హీరో, హీరోయిన్లతో ఇంటర్యూలు చేస్తూ.. కామెడీ కన్వర్జెషన్ మధ్య సాగే ఈ షోకు ఇండియాలోనే కాకుండా వేరే దేశాల్లోనూ విపరీతమైన క్రేజ్. బాలీవుడ్ కామెడి కింగ్ కపిల్ శర్మ ఓ కేసులో ఇరుక్కుపోయాడు. గురువారం ముంబై క్రైం ఇంటెలిజెన్స్ సంస్థ ఆయనకు సమన్లు ఇచ్చింది.

అయితే ఫేక్ కార్ల రిజిస్ట్రేషన్ కేసులో పోలీసులు ఈ నోటీసులు జారీ చేయడం జరిగింది. వారం రోజుల కిందట ప్రముఖ కార్ల డిజైనర్ దిలీప్ చాబ్రాను ముంబై పోలీసులు అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. కారు రిజిస్ట్రేషన్ నంబర్ల ఫోర్జరీ, కారు ఫైనాల్సింగ్ లో విషయంలో పోలీసులు దిలీప్ చాబ్రాను అరెస్ట్ చేశారు. అయితే దిలీప్ చాబ్రాకు వ్యానిటీ వ్యాన్ తయారు చేయాలని కొద్దిరోజుల కిందట కపిల్ శర్మ డబ్బులు చెల్లించాడు.

అయితే అనుకున్న సమయంలో దిలీప్ చాబ్రా వ్యాన్ ను పూర్తి చేయకపోవడంతో కపిల్ శర్మ ఆయనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై కపిల్ శర్మకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఫేక్ రిజిస్ట్రేషన్, కార్ల ఫైనాన్స్ విషయంలో కపిల్ శర్మ ఫిర్యాదును స్వీకరించి విచారించనున్నారు. దిలీప్ చాబ్రాతో అసలు కపిల్ శర్మ ఫేక్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడా.. లేదా వ్యాన్ తయారీకి డబ్బులు ఇచ్చాడన్న కోణంలో పోలీసులు విచారణ చేయబోతున్నారు.

ఢిల్లీ క్రైం ఇన్వెస్టిగేషన్ పోలీసులు గతేడాది డిసెంబర్ 28వ తేదీన పోలీసులు దిలీప్ చాబ్రాను అరెస్ట్ చేశారు. ఫేక్ రిజిస్ట్రేషన్, అక్రమ కార్ల ఫైనాన్సింగ్ మార్కెట్ విషయంలో దిలీప్ చాబ్రాపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకు దాదాపు 127 కార్లను చాబ్రా డిజైన్ చేస్తే.. అందులో 90 వరకు ఫేక్ రిజిస్ట్రేషన్, అక్రమ ఫైనాన్స్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాలీవుడ్ లో ప్రముఖ స్టార్ హీరోల కార్లను ఆయన డిజైన్ చేశాడు.


ఏపీ బీజేపీ సార‌థి మారుతున్నారా.. క‌మ్మ‌ల‌కు మ‌ళ్లీ ఛాన్స్...!!

రెండు రాష్ట్రాల్లో దిగిన ఆ నలుగురు ఎవరు...?

బాహుబలి మేనియా గుర్తు చేస్తున్న K.G.F చాప్టర్ 2..!

తెలంగాణకు ఎక్కువ డోసులు !

సిగిరెట్ తాగే వారికి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం

వీరిద్దరూ భార్యాభర్తలు.. విడాకులు కూడా తీసుకున్నారని ఎంతమందికి తెలుసు?

అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>