PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-jagan-shock-to-chandrababu413cdfe7-ee1b-44a8-a39f-5aacb329c5d8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-jagan-shock-to-chandrababu413cdfe7-ee1b-44a8-a39f-5aacb329c5d8-415x250-IndiaHerald.jpgఏపీలో రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఓ వైపు ఆలయాలపై దాడుల ఘటనలు హీటెక్కిస్తుంటే, మరోవైపు టీడీపీ నేతలపై వచ్చి పడుతున్న కేసులు మరింత హాట్ హాట్ రాజకీయాన్ని నడుపుతున్నాయి. తాజాగా చంద్రబాబుపైన కూడా కేసు నమోదు కావడంతో టీడీపీ నేతలు హడావిడి చేసేస్తున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై కేసు నమోదు చేస్తామని స్వయంగా డీజీపీనే చెప్పారు. jagan;cbn;nani;tiru;jagan;andhra pradesh;sri venkateswara swamy;chief minister;minister;arrest;tdp;ycp;buddha venkanna;house;hindusజగన్ అదిరిపోయే షాక్: బాబు కోసం ఆత్మహత్యకు రెడీ...జగన్ అదిరిపోయే షాక్: బాబు కోసం ఆత్మహత్యకు రెడీ...jagan;cbn;nani;tiru;jagan;andhra pradesh;sri venkateswara swamy;chief minister;minister;arrest;tdp;ycp;buddha venkanna;house;hindusFri, 08 Jan 2021 02:00:00 GMTటీడీపీ నేతలపై వచ్చి పడుతున్న కేసులు మరింత హాట్ హాట్ రాజకీయాన్ని నడుపుతున్నాయి. తాజాగా చంద్రబాబుపైన కూడా కేసు నమోదు కావడంతో టీడీపీ నేతలు హడావిడి చేసేస్తున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై కేసు నమోదు చేస్తామని స్వయంగా డీజీపీనే చెప్పారు.

సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని, తన మతం, ప్రాంతం గురించి చంద్రబాబు మాట్లాడడం బాధ కలిగించిందని, ఈశాన్య భారతం నుంచి వచ్చినట్లు తనపై గతంలో చేసిన వ్యాఖ్యలను తాను పట్టించుకోలేదని చెప్పిన డీజీపీ, ముఖ్యమంత్రి, హోం మంత్రి, తాను ముగ్గరం క్రైస్తవులం కాబట్టి హిందువులకు రక్షణ లేదన్నట్లు చంద్రబాబు ఇప్పుడు వ్యాఖ్యలు చేయడం రెచ్చగొట్టడమేనని డీజీపీ అన్నారు.

అంటే చంద్రబాబు మతాలని ఉద్దేశించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, అందుకే కేసు నమోదు విషయంలో వెనుకాడమని డీజీపీ చెబుతున్నారు. ఇక చంద్రబాబుపై కేసు పెడితే ఊరుకునేది లేదని టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఏపీ డీజీపీ వైసీపీ కార్యకర్తగా మారిపోయారని, చంద్రబాబుపై కేసులు పెట్టడం ఎవరి తరం కాదని మాట్లాడుతున్నారు. హిందువుల మనోభావాలను రెచ్చగొట్టేలా మాట్లాడిన నాని మీద డీజీపీ ఎన్ని కేసులు పెట్టారు? అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు.

ఇక బుద్దా వెంకన్న లాంటి వారైతే చంద్రబాబును టచ్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని, చంద్రబాబును అరెస్ట్ చేస్తే జగన్‌ ఇంటి ముందు ఆత్మహత్య చేసకుంటా అని మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ టీడీపీ నేతలు గుడ్డిగా చంద్రబాబుని ఫాలో అయిపోతున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. చంద్రబాబు రామతీర్ధం వెళ్ళి, మత రాజకీయం చేసినట్లే కనబడుతుందని అంటున్నారు. పైగా సీఎం, హోమ్ మినిస్టర్, డీజీపీల మతాన్ని తీసుకురావడం కరెక్ట్ కాదనే వాదన వినిపిస్తుంది. మొత్తానికైతే జగన్ ప్రభుత్వం ఇచ్చిన షాక్‌కు టీడీపీ నేతలకు చుక్కలు కనబడుతున్నట్లున్నాయి.




సిగిరెట్ తాగే వారికి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం

వీరిద్దరూ భార్యాభర్తలు.. విడాకులు కూడా తీసుకున్నారని ఎంతమందికి తెలుసు?

అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?

తెరాస పార్టీ బీజేపీ ని కాకుండా బండి ని టార్గెట్ చేయడంలో మర్మం ఏంటి..?

ఐటీఐఆర్ ప్రాజెక్టును పునరుద్దరించండి

తిరుపతిలో వైసీపీ ఓడిపోతుందా...?

ఎమ్మెల్యేలను పిలుస్తున్న జగన్... షాక్ ఇస్తారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>