PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/who-is-behind-the-destruction-of-capitol-hillb4e82b78-a812-4a8c-8fc2-d466a228d47b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/who-is-behind-the-destruction-of-capitol-hillb4e82b78-a812-4a8c-8fc2-d466a228d47b-415x250-IndiaHerald.jpgఅమెరికా ప్రజాస్వామ్య చరిత్రలో మాయని మచ్చ ఇది..! కాంగ్రెస్‌ సభ్యుల సమావేశంలోకి ఒక్కసారిగా ట్రంప్‌ మద్దతుదారులు దూసుకురావడం.. విధ్వంసం సృష్టించడం కలకలం రేపింది. జో బైడెన్‌ను కాంగ్రెస్‌ సభ్యులు విజేతగా గుర్తించేందుకు సిద్ధమైన సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. ఒక్కసారిగా వేలాది మంది ట్రంప్‌ మద్దతుదారులు పోలీసులను చేధించుకుని.. చట్టసభల వైపు వచ్చి హంగామా చేయడం ఇప్పుడు అమెరికాలో హాట్‌ టాపిక్‌ అవుతోంది. కానీ ఇదెలా జరిగింది. ఈ కుట్ర వెనుక ఉందెవరు..? who is behind the destruction of capitol hill;rakshita;american samoa;congress;donald trump;police;office;yevaru;paruguకేపిటల్‌ హిల్‌ విధ్వంసం వెనుక ఎవరున్నారు..?కేపిటల్‌ హిల్‌ విధ్వంసం వెనుక ఎవరున్నారు..?who is behind the destruction of capitol hill;rakshita;american samoa;congress;donald trump;police;office;yevaru;paruguFri, 08 Jan 2021 19:00:00 GMTఅమెరికా ప్రజాస్వామ్య చరిత్రలో మాయని మచ్చ ఇది..!  కాంగ్రెస్‌ సభ్యుల సమావేశంలోకి ఒక్కసారిగా ట్రంప్‌ మద్దతుదారులు దూసుకురావడం.. విధ్వంసం సృష్టించడం కలకలం రేపింది. జో బైడెన్‌ను కాంగ్రెస్‌ సభ్యులు విజేతగా గుర్తించేందుకు సిద్ధమైన సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. ఒక్కసారిగా వేలాది మంది ట్రంప్‌ మద్దతుదారులు పోలీసులను చేధించుకుని.. చట్టసభల వైపు వచ్చి హంగామా చేయడం ఇప్పుడు అమెరికాలో హాట్‌ టాపిక్‌ అవుతోంది. కానీ ఇదెలా జరిగింది. ఈ కుట్ర వెనుక ఉందెవరు..?

కేపిటల్‌ హిల్‌లో విధ్వంసానికి సరిగ్గా గంట ముందు ట్రంప్‌ తన మద్దతుదారులతో ర్యాలీ నిర్వహించారు. అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు గుప్పిస్తోన్న ట్రంప్‌.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తన మద్దతుదారులందరినీ కేపిటల్‌ హిల్‌ వైపు వెళ్లాలని.. అక్కడ ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారు. అంతేకాదు.. తాను స్వయంగా పాల్గొంటానని ట్రంప్‌ చెప్పినట్లు తెలుస్తోంది. ట్రంప్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే ఆయన మద్దతుదారులు కేపిటల్‌ హిల్‌ వైపు పరుగులు తీశారని చెబుతున్నారు.

ట్రంప్‌ ప్రసంగం చేసిన గంట తర్వాత వేలాదిగా ఆయన మద్దతుదారులు చట్టసభల వైపు దూసుకొచ్చారు. పోలీసులతో ఘర్షణకు దిగారు. బారికేడ్లను తోసుకొచ్చారు. ఈ ఘర్షణల్లో పోలీసులకు కూడా గాయాలు అయ్యాయి. అయితే భారీగా ఆందోళనకారులను చూసిన పోలీసులు వెంటనే మరిన్ని బలగాలు కావాలని కోరాయి. ఈ సమయంలో కేపిటల్‌ హిల్‌ సమీపంలో బాంబుల కలకలం రేగింది. ఆర్‌ఎన్‌సీ, డీఎన్‌సీ ప్రధాన కార్యాలయాల్లో బాంబులు దొరికాయి. ఐఈడీ, పైప్‌ బాంబులను గుర్తించారు. వెంటనే వాటిని నిర్వీర్యం చేశారు. అప్పటికే ట్రంప్‌ మద్దతుదారులు కేపిటల్‌ హిల్‌ దగ్గరికి చేరుకున్నారు.

అంతటితో ట్రంప్ మద్దతుదారుల విధ్వంసం ఆగలేదు. భారీ స్థాయిలో ఆందోళనకారులు రావడంతో వారిని అడ్డుకోవడం కూడా కష్టంగా మారింది. దీంతో ట్రంప్‌ మద్దతుదారులు కేపిటల్‌ హిల్‌ భవనం కిటీకీలు బద్ధలు కొట్టి.. లోపలికి దూసుకెళ్లారు. అక్కడ నానా యాగీ చేశారు. కాంగ్రెస్‌మెన్‌ల ఆఫీసుల్లోకి దూసుకెళ్లి కూర్చీలపై ఫోజులిచ్చారు. అయితే ఆందోళనకారులు వచ్చేలోపే అమెరికా కాంగ్రెస్ సభ్యులను అక్కడి నుంచి అధికారులు తరలించారు .

ఆయుధాలతో దూసుకొచ్చిన ట్రంప్‌ మద్దతుదారులను తరిమికొట్టేందుకు నాలుగు గంటల పట్టింది. అప్పటికే భారీగా చేరుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. బ్యాలెట్‌లను సురక్షిత ప్రాంతానికి తరలించారు. అయితే అప్పటికే జరగాల్సిన విధ్వంసం జరిగిపోయింది. అమెరికా ప్రజాస్వామ్యంపై చెరగని మచ్చ పడిపోయింది. సఈ ఘటనకు ట్రంప్‌ కారణమంటూ అటు డెమొక్రాట్లు, ఇటు రిపబ్లికన్లు మండిపడుతున్నారు. ఇదంతా ట్రంప్‌ పాపమేనంటున్నారు. 


అఖిల ప్రియ బెయిల్ పై పోలీస్ ల కౌంటర్......!?

దేవాలయాల మీద దాడులు వెనక కుట్ర కోణం...?

నాగార్జున సాగర్ ఫలితం తర్వాతే కాంగ్రెస్ భవిష్యత్ మారబోతుందా..?

ఇకపై ప్రతీ పరీక్ష ఆన్ లైన్ లోనే..!

ఫోన్‌కు వచ్చిన లింక్ ఓపెన్ చేశాడు.. ఐదు నిమిషాల తర్వాత ఒక్కసారిగా షాక్!

రికార్డులను కొల్లగొడుతున్న రాకింగ్ స్టార్ యష్

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తరువాతే పీసీసీ చీఫ్ నియామకం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>