PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgటీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రాం కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్మోహన్ రెడ్డి నిజంగా హిందూ ధర్మాన్ని అభిమానించే వాడయితే రాజధానిలో రూ.150 కోట్లతో తలపెట్టిన వేంకటేశ్వరస్వామి నిర్మాణాన్ని ఎందుకు నిలిపివేశాడు? అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం హిందువుల కోసం అమలుచేసిన దివ్యదర్శనం పథకాన్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆపేశాడు? అని ఆయన ప్రశ్నించారు. కృష్ణా-గోదావరి నదుల పవిత్ర సంగమం వద్దనిర్వహించే హరతుల కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశాడో చెప్పాలి అని ప్రశ్నించారు. దేవాదాయశాఖ నిధులను, ys jagan;amala akkineni;varsha;godavari river;krishna river;jagan;mp;chief minister;arrest;tdp;hindus;research and analysis wing;nijam;reddyకొడాలి నానీని జగన్ తప్పిస్తారా...?కొడాలి నానీని జగన్ తప్పిస్తారా...?ys jagan;amala akkineni;varsha;godavari river;krishna river;jagan;mp;chief minister;arrest;tdp;hindus;research and analysis wing;nijam;reddyFri, 08 Jan 2021 19:00:00 GMTటీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రాం కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్మోహన్ రెడ్డి నిజంగా హిందూ ధర్మాన్ని అభిమానించే వాడయితే రాజధానిలో రూ.150 కోట్లతో తలపెట్టిన వేంకటేశ్వరస్వామి నిర్మాణాన్ని ఎందుకు నిలిపివేశాడు? అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం హిందువుల కోసం అమలుచేసిన దివ్యదర్శనం పథకాన్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆపేశాడు? అని ఆయన ప్రశ్నించారు. కృష్ణా-గోదావరి నదుల  పవిత్ర సంగమం వద్దనిర్వహించే హరతుల కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశాడో చెప్పాలి అని ప్రశ్నించారు.

దేవాదాయశాఖ నిధులను, బ్రాహ్మణ కార్పొరేషన్ సొమ్ము రూ.144కోట్లను ఇతర పథకాలకు  ఎందుకు మళ్లించాడు? అని ప్రశ్నించారు.     పేద బ్రాహ్మణులకు చంద్రబాబు నాయుడు అమలుచేసిన వివిధ పథకాలను అర్థంతరంగా ఎందుకు రద్దుచేశాడు? అని మండిపడ్డారు. దేవాదాయ భూములను ఇళ్ల పట్టాలకు కేటాయిస్తూ జీవోలు ఎందుకు ఇచ్చాడు? రాష్ట్ర వ్యాప్తంగా హిందూ మతానికి వ్యతిరేకంగా 140కు పైగా ఘటనలు జరిగితే, వాటికి కారకులైన వారిలో ఒక్కరినైనా ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయాడు? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

ఈ విధంగా అడుగడుగునా హిందూ మత వ్యతిరేక చర్యలకు పాల్పడిన ముఖ్యమంత్రి నేడు పగటి వేషగాడి అవతారమెత్తి, విజయవాడలో దేవాలయాల నిర్మాణం పేరుతో వీధి నాటకాలు మొదలెట్టాడు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. దళిత ఎంపీ చనిపోతే ఆయన కుటుంబాన్ని పరామర్శించవద్దని జగన్ కు ఏ మతగ్రంథం చెప్పింది? అని నిలదీశారు. హిందువులు, క్రైస్తవులతోపాటు జగన్మోహన్ రెడ్డి ముస్లింలనుకూడా వదల్లేదు అని అన్నారు. నంద్యాలలో అబ్దుల్ సలాం, రాజమహేంద్రవరం సమీపంలో అబ్దుల్ సత్తార్ కుటుంబాలు ఎందుకు బలయ్యాయో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేసారు.

జగన్ నిజంగా హిందూమతాభిమానే అయితే, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన కొడాలి నానీని తక్షణమే మంత్రిపదవినుంచి తొలగించాలి అని డిమాండ్ చేసారు. ఇళ్లపట్టాలకు తీసుకున్న దేవాదాయ భూములను వెనక్కిచ్చేయాలి అని ఆయన డిమాండ్ చేసారు. అమరావతిలో వేంకటేశ్వరస్వామి ఆలయనిర్మాణాన్ని, కృష్ణా-గోదావరి సంగమంలో పవిత్రహరతుల కార్యక్రమాన్ని, దివ్యదర్శనం సేవలను నేడే ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నా అన్నారు.


అఖిల ప్రియ బెయిల్ పై పోలీస్ ల కౌంటర్......!?

దేవాలయాల మీద దాడులు వెనక కుట్ర కోణం...?

నాగార్జున సాగర్ ఫలితం తర్వాతే కాంగ్రెస్ భవిష్యత్ మారబోతుందా..?

ఇకపై ప్రతీ పరీక్ష ఆన్ లైన్ లోనే..!

ఫోన్‌కు వచ్చిన లింక్ ఓపెన్ చేశాడు.. ఐదు నిమిషాల తర్వాత ఒక్కసారిగా షాక్!

రికార్డులను కొల్లగొడుతున్న రాకింగ్ స్టార్ యష్

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తరువాతే పీసీసీ చీఫ్ నియామకం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>