PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bhuma-akhil-priyab46ee953-3d8e-439d-ac46-a20c4687c1d3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bhuma-akhil-priyab46ee953-3d8e-439d-ac46-a20c4687c1d3-415x250-IndiaHerald.jpgబోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు వ్యవహారంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ఏ1 నిందితురాలిగా మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ, ఏ2గా సుబ్బారెడ్డి, ఏ3గా అఖిల ప్రియ భర్త భార్గవ రామ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే భార్గవ్ రామ్ ప్రస్తుతం పరారీలో ఉండటంతో అతడి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. భార్గవ్ రామ్ బెంగళూరులో తలదాచుకున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలినట్టు తెలుస్తోంది.bhuma akhil priya;auto;amala akkineni;praveen;ram pothineni;tiru;hyderabad;police;bhuma akhila priya;bengaluru 1;minister;air;husband;arrest;letter;bowenpally;nandyalaభూమా అఖిల ప్రియ భర్త కోసం గాలింపు ముమ్మరంభూమా అఖిల ప్రియ భర్త కోసం గాలింపు ముమ్మరంbhuma akhil priya;auto;amala akkineni;praveen;ram pothineni;tiru;hyderabad;police;bhuma akhila priya;bengaluru 1;minister;air;husband;arrest;letter;bowenpally;nandyalaFri, 08 Jan 2021 17:20:28 GMTహైదరాబాద్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు వ్యవహారంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ఏ1 నిందితురాలిగా మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ, ఏ2గా సుబ్బారెడ్డి, ఏ3గా అఖిల ప్రియ భర్త భార్గవ రామ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే భార్గవ్ రామ్ ప్రస్తుతం పరారీలో ఉండటంతో అతడి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. భార్గవ్ రామ్ బెంగళూరులో తలదాచుకున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలినట్టు తెలుస్తోంది. ఇప్పుడు అక్కడి పోలీసుల సహాయంతో భార్గవ్ రామ్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా భార్గవ్ రామ్‌కు అత్యంత దగ్గరగా ఉండే బంధువులు, స్నేహితులు ఇతరుల ఇళ్ల పైన పోలీసులు నిఘా పెట్టారు. మరోపక్క విచారణలో భాగంగా పోలీసులకు అనేక విషయాలు తెలిశాయి.
ఈ కిడ్నాప్ కేసులో వీరితో పాటు మాడాల శ్రీను అలియాస్ గుంటూరు శ్రీను అనే మరో వ్యక్తి కీలక పాత్ర పోషించాడని పోలీసులు తెలుసుకున్నారు. గుంటూరు శ్రీను భార్గవ్ రామ్‌కు ప్రధాన అనుచరుడని పోలీసులు గుర్తించారు. గతంలో నంద్యాల ఉప ఎన్నికల విషయంలో అన్ని వ్యవహారాలను గుంటూరు శ్రీను దగ్గర ఉండి చూసుకున్నట్టు చెబుతున్నారు. ఇప్పుడు ఈ కిడ్నాప్ ప్లాన్ అఖిల ప్రియ, భార్గవ్ రామ్‌ది అయినప్పటికి దగ్గర ఉండి అమలు చేసింది మాత్రం గుంటూరు శ్రీనేనని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ గుంటూరు శ్రీను పలువురిని కిడ్నాప్‌లు చేసినట్టు తెలుస్తోంది. ప్రవీణ్ రావును కిడ్నాప్ చేయాలని ఆరు నెలల క్రిందటే గుంటూరు శ్రీను పక్కా స్కెచ్ వేసినట్టు అర్థమవుతోంది. ఆరు నెలల నుంచి ప్రవీణ్ రావు కదలికలను గుంటూరు శ్రీను పసిగడుతూ వచ్చాడని, నకిలీ నెంబర్లతో ఉన్న వాహనాలతో తిరుగుతూ సీసీ ఫుటేజ్ కూడా లేకుండా జాగ్రత్త పడినట్టు పోలీసులు తెలుసుకున్నారు. అసలు గుంటూరు శ్రీను ఎవరు.. గతంలో ఇతడిపై ఎన్ని కేసులు ఉన్నాయి అనే దానిపై అధికారులు లోతుగా దర్యాప్తు నిర్వహిస్తున్నారు.


ఫోన్‌కు వచ్చిన లింక్ ఓపెన్ చేశాడు.. ఐదు నిమిషాల తర్వాత ఒక్కసారిగా షాక్!

రికార్డులను కొల్లగొడుతున్న రాకింగ్ స్టార్ యష్

కీలక విషయాన్ని బయటపెట్టిన పవన్ కల్యాణ్ భార్య

ఒకేరోజు 9 ఆలయాలకు సీఎం జగన్ భూమి పూజ

ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎం లకు క్లిష్ట పరిస్థితులు...?

జీవ‌తా రాజ‌శేఖ‌ర్ ఎమ్మెల్యేగా పోటీ... ఆ సీటుపైనే గురి పెట్టారా..!

విచార‌ణ‌లో షాకింగ్ విష‌యాలు చెప్పిన అఖిల‌ప్రియ‌




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>