PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nagarjuna-sagara0b34879-e2d0-485a-b191-d36d10e25a5a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nagarjuna-sagara0b34879-e2d0-485a-b191-d36d10e25a5a-415x250-IndiaHerald.jpgకాంగ్రెస్, బీజేపీవి శవాలపై పేలాలు ఏరుకునే రాజకీయాలని బాలరాజు యాదవ్ విమర్శించారు. బీజేపీ ఒకటి రెండు చోట్ల గెలవగానే వాపును చూసి బలుపు అనుకుంటుందన్నారు. రాష్ట్రంలో బీజేపీది వాపే కాని బలుపు కాదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ వచ్చినందునే బీజేపీ, పీసీసీ రాష్ట్ర అధ్యక్షలుగా ఇక్కడి నేతలకు పదవులు వచ్చాయన్నారు. యువత బీజేపీ మాయలో పడొద్దని చెప్పారు. nagarjuna sagar;kcr;ktr;nagarjuna akkineni;bharatiya janata party;krishna river;nagarjuna sagar dam;telangana;congress;university;chief minister;degree;janareddy;college;balaraju;mantra;santoshamసాగర్‌లో ఎగిరేది గులాబీ జెండానే!సాగర్‌లో ఎగిరేది గులాబీ జెండానే!nagarjuna sagar;kcr;ktr;nagarjuna akkineni;bharatiya janata party;krishna river;nagarjuna sagar dam;telangana;congress;university;chief minister;degree;janareddy;college;balaraju;mantra;santoshamFri, 08 Jan 2021 20:56:48 GMTకేసీఆర్, మంత్రులు  కేటీఆర్, జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో నాగార్జున సాగర్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ది నేత, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు దూదిమెట్ల బాలరాజుయాదవ్‌ చెప్పారు. కృష్ణా నీళ్లతో నాగార్జునసాగర్‌ నియోజకవర్గమంతా సస్యశ్యామలం అవుతుందన్నారు. త్వరలో జరగనున్న నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగురడం ఖాయమన్నారు. నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో పర్యటించిన బాలరాజుయాదవ్..
హాలియాలో జరిగిన సమావేశంలో మాట్లాడారు.

కాంగ్రెస్, బీజేపీవి శవాలపై పేలాలు ఏరుకునే రాజకీయాలని బాలరాజు యాదవ్ విమర్శించారు.
బీజేపీ ఒకటి రెండు చోట్ల గెలవగానే వాపును చూసి బలుపు అనుకుంటుందన్నారు. రాష్ట్రంలో బీజేపీది వాపే కాని బలుపు కాదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ వచ్చినందునే బీజేపీ, పీసీసీ రాష్ట్ర అధ్యక్షలుగా ఇక్కడి నేతలకు పదవులు వచ్చాయన్నారు. యువత బీజేపీ మాయలో పడొద్దని చెప్పారు. కేసీఆర్‌ తన ప్రాణాన్ని లెక్క చేయకుండా 2009లో ఆమరణ దీక్ష చేసిన విషయాన్ని యువత గుర్తు తెచ్చుకోవాలని, ఆయన పోరాటంతోనే తెలంగాణ సాధన జరిగిందన్నారు. ఇవన్నీ ఆలోచించి.. సాగర్  టీఆర్‌ఎస్‌ ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా నాగార్జునసాగర్‌ ప్రజలు టీఆర్‌ఎస్‌ వెంటే ఉంటారన్నారు దూదిమెట్ల బాలరాజు యాదవ్.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందు చూపుతో ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం నియోజకవర్గంలోని రైతులందరికీ అందుతుందన్నారు బాలరాజు యాదవ్. రెండు పంటలకు రైతుబంధు అందుతుండడతో ఇక్కడి రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. నియోజకవర్గానికి ‌ డిగ్రీ కళాశాల, ఇక్కడి రైతాంగం కోసం నెల్లికల్లు లిఫ్టును సీఎం కేసీఆర్ మంజూరు చేశారని తెలిపారు. జానారెడ్డి ఎమ్మెల్యేగా చేసి డిగ్రీ కాలేజీ, నెల్లికల్లు లిప్టును ఎందుకు తీసుకరాలేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినందునే నాగార్జునసాగర్‌ నీళ్లు ఆయకట్టులోని రెండు పంటలకు నీళ్లు అందుతున్నాయని, తెలంగాణ రాష్ట్రం వచ్చినందునే నెల్లికల్లు, డిగ్రీ కాలేజీ ఇక్కడికి వచ్చాయన్నారు. కేసీఆర్‌ త్యాగం వల్లే రాష్ట్రం వచ్చిందన్నారు దూదిమెట్ల బాలరాజు యాదవ్.




కోహ్లీ రికార్డును సమం చేసిన స్మిత్‌

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా

దేవాలయాల మీద దాడులు వెనక కుట్ర కోణం...?

నాగార్జున సాగర్ ఫలితం తర్వాతే కాంగ్రెస్ భవిష్యత్ మారబోతుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>