PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bandi-sanjaybd250a91-ff15-4133-ba1f-e9805fbf6a69-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bandi-sanjaybd250a91-ff15-4133-ba1f-e9805fbf6a69-415x250-IndiaHerald.jpgబీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ ప్రభుత్వ విప్, అచ్చంపేట్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. బీజేపీ నేతలకు ఎంతసేపూ కులాలు, మతాలేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ ఓ పిచ్చికుక్కలా మాట్లాడుతున్నాడని విమర్శించారు. కులాల పేరిట హిందూయిజాన్ని చీల్చొద్దంటున్నారు... ఆ మాట మాట్లాడ్డానికి బండి సంజయ్ కి సిగ్గుండాలి అంటూ గువ్వల బాలరాజు మండిపడ్డారు. కేంద్రంలో మంత్రి పదవి ఒరగబెడుతున్న కిషన్ రెడ్డి కూడా సంజయ్ ని నియంత్రించలేకపోతున్నారని విమర్శించారు.bandi sanjay;bharatiya janata party;telangana rashtra samithi trs;karnataka - bengaluru;madhya pradesh - bhopal;telangana;g kishan reddy;district;mla;minister;central government;reddy;bodhanబండి సంజయ్ ఓ పిచ్చికుక్క!బండి సంజయ్ ఓ పిచ్చికుక్క!bandi sanjay;bharatiya janata party;telangana rashtra samithi trs;karnataka - bengaluru;madhya pradesh - bhopal;telangana;g kishan reddy;district;mla;minister;central government;reddy;bodhanFri, 08 Jan 2021 20:21:24 GMTతెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత ముదురుతోంది. అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతలు వ్యక్తిగత దూషణలతో కాక పుట్టిస్తున్నారు. బూతులు మాట్లాడుతూ రాజకీయాలను మరింత హీటెక్కిస్తున్నారు. బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు  తెలంగాణ ప్రభుత్వ విప్, అచ్చంపేట్ ఎమ్మెల్యే  గువ్వల బాలరాజు. బీజేపీ నేతలకు ఎంతసేపూ కులాలు, మతాలేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ ఓ పిచ్చికుక్కలా మాట్లాడుతున్నాడని విమర్శించారు. కులాల పేరిట హిందూయిజాన్ని చీల్చొద్దంటున్నారు... ఆ మాట మాట్లాడ్డానికి బండి సంజయ్ కి సిగ్గుండాలి అంటూ గువ్వల బాలరాజు మండిపడ్డారు. బీజేపీ దాడులకు దిగితే తాము కూడా సిద్దమేనని చెప్పారు గువ్వల బాలరాజు.  కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి కూడా సంజయ్ ని నియంత్రించలేకపోతున్నారని విమర్శించారు.

                 కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ ప్రాంతానికి ఏంచేశారో చెప్పమంటే బండి సంజయ్ కు నోరు రావడం లేదన్నారు గువ్వల బాలరాజు.  నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. లక్ష్యం 2023 అంటున్నారు... 23 కాదు కదా, 2048 వచ్చినా బీజేపీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం అనేది ఓ పగటి కల మాత్రమేనని గువ్వల స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఆ హామీలు ఎంతవరకు వచ్చాయో తెలంగాణ బీజేపీ నేతలు చెప్పాలన్నారు.

  కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అడ్డదారిలో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు గువ్వల బాలరాజు.  తెలంగాణలో  కూడా అలాగే అడ్డదారిలో అధికారంలోకి రావాలనుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ తెలంగాణ ప్రజల మద్దతు లేదనడానికి నిజామాబాద్ జిల్లా బోధన్ లో జరిగిన సభే నిదర్శనమన్నారు. 60 లక్షల సభ్యత్వాలు ఉన్న టీఆర్ఎస్ ను చూడండి... ఓసారి మీ బలమెంతో లెక్కలు వేసుకోండి... ఇకనైనా పగటికలలు కనడం మానండి  అని గువ్వల బాలరాజు వ్యాఖ్యానించారు.

  


ఏపీ సీఎం జగన్ ని పొగుడుతూ కృతజ్ఞతలు తెలిపిన బీజేపీ నేత సోము వీర్రాజు

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా

దేవాలయాల మీద దాడులు వెనక కుట్ర కోణం...?

నాగార్జున సాగర్ ఫలితం తర్వాతే కాంగ్రెస్ భవిష్యత్ మారబోతుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>