PoliticsP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmers-protest30042023-e785-4534-a03d-d62162e478c2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmers-protest30042023-e785-4534-a03d-d62162e478c2-415x250-IndiaHerald.jpgకేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వివాదాస్పద సాగు చట్టాలపై కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య ఇప్పటికే పలుమార్లు సమావేశాలు కూడా జరిగాయి. కానీ ఈ సమావేశాలేవీ ఫలదాయకంగా ముగియలేదు. ఈ క్రమంలో కేంద్ర మంత్రులు, రైతు సంఘాల ప్రతినిధుల మధ్య శుక్రవారం జరిగిన చర్చలు కూడా ఎలాంటి పరిష్కారానికి నోచుకోలేదు. దీంతో ఈనెల 15న మరోసారి రైతు సంఘాలతో సమావేశం కావాలని మాత్రం నిర్ణయించారుfarmer protest;delhi;narendra singh tomar;narendra singh tomar.;government;january;minister;central government;piyush chawla;mantra;narendraరైతు సంఘాలతో కేంద్ర సమావేశం.. ఏం మాట్లాడారంటే..రైతు సంఘాలతో కేంద్ర సమావేశం.. ఏం మాట్లాడారంటే..farmer protest;delhi;narendra singh tomar;narendra singh tomar.;government;january;minister;central government;piyush chawla;mantra;narendraFri, 08 Jan 2021 22:43:13 GMTన్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వివాదాస్పద సాగు చట్టాలపై కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య ఇప్పటికే పలుమార్లు సమావేశాలు కూడా జరిగాయి. కానీ ఈ సమావేశాలేవీ ఫలదాయకంగా ముగియలేదు. ఈ క్రమంలో కేంద్ర మంత్రులు, రైతు సంఘాల ప్రతినిధుల మధ్య శుక్రవారం జరిగిన చర్చలు కూడా ఎలాంటి పరిష్కారానికి నోచుకోలేదు. దీంతో ఈనెల 15న మరోసారి రైతు సంఘాలతో సమావేశం కావాలని మాత్రం నిర్ణయించారు. విజ్ఞాన్ భవన్‌లో సుమారు గంటసేపు చర్చలు జరిగినప్పటికీ ఇరువర్గాలు ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. సాగు చట్టాలను రద్దు చేయాలని రైతు ప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ చట్టాలను వెనక్కు తీసుకుంటేనే తాము నిరసనలకు స్వస్తి చెప్పి ఇళ్లకు వెళ్తామని తేల్చి చెప్పారు. మరోవైపు, ప్రభుత్వం కూడా తమ వైఖరి మరోమారు స్పష్టం చేసింది.  వివాదాస్పద క్లాజులకే చర్చలు పరిమితం చేద్దామని, చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకునేది లేదని తెగేసి చెప్పింది.

ఎనిమిదో రౌండు చర్చల్లో 41 మంది రైతు ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయెల్, వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్‌ ప్రభుత్వం తరఫున ఈ చర్చల్లో పాల్గొన్నారు. చర్చల్లో ప్రభుత్వం తమ వాదన వినిపిస్తూ, వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు.. తమ సంస్కరణ చట్టాలను స్వాగతిస్తున్నారని, యావత్ దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే యూనియన్లు ఆలోచించాలని కోరింది. గంటసేపు సమావేశం జరిగిన అనంతరం తమలో తాము సంప్రదించుకున్న ముగ్గురు మంత్రులు సమావేశ హాలు నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇందుకు ప్రతిగా 'జీతేంగే యా మరేంగే' నినాదాలున్న పేపర్లు పట్టుకుని రైతు నేతలు మౌనం పాటించారు. కాగా, చర్చలు అసంపూర్తిగా ముగిసినప్పటికీ జనవరి 15న జరిగే తదుపరి చర్చలకు హాజరవుతామని రైతు నేతలు ప్రకటించారు.


బాలయ్యకు జగన్ ఛాన్స్ ఇస్తారా? వైసీపీ లెక్కలో పెట్టుకోవడం లేదా?

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. ఏంటంటే..

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా

దేవాలయాల మీద దాడులు వెనక కుట్ర కోణం...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>