TechnologyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/technology/sports_videos/magic-rice-new-f4e4d4c2-e9dc-4190-98f0-4e6d4312981d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/technology/sports_videos/magic-rice-new-f4e4d4c2-e9dc-4190-98f0-4e6d4312981d-415x250-IndiaHerald.jpgమనం కళ్ళతో చూడగలిగి, మనసుతో భావించి , శరీరంతో స్పర్శించే వాస్తవ ప్రపంచం ప్రకృతి. ప్రకృతి గురించి వర్ణించడానికి మాటలు సరిపోవు. ఎంతో అమూల్యమైనది,ప్రతిష్ఠాత్మకమైనది ప్రకృతి. ప్రకృతి ఒడిలో ఉంటే అమ్మ ఒడిలో ఉన్నంత భావన కలుగుతుంది. అలాంటి ఈ ప్రకృతిలో ప్రతిక్షణం ఎప్పటికప్పుడు సరి కొత్తదనం ఆవహించికుంటుంది. అలాంటి ఈ ప్రకృతిలో సరికొత్తగా పుట్టుకొచ్చింది మ్యాజిక్ రైస్. magic,rice,new,;bhavana;prakruti;ramu;sridhar;srikanth;assam;india;guwahati;district;huzur nagar;university;december;army;june;indian;karimnagar;vప్రకృతిలో సరికొత్తగా రూపుదిద్దుకున్న మ్యాజిక్ రైస్!ప్రకృతిలో సరికొత్తగా రూపుదిద్దుకున్న మ్యాజిక్ రైస్!magic,rice,new,;bhavana;prakruti;ramu;sridhar;srikanth;assam;india;guwahati;district;huzur nagar;university;december;army;june;indian;karimnagar;vFri, 08 Jan 2021 02:58:00 GMTమనం కళ్ళతో చూడగలిగి, మనసుతో భావించి , శరీరంతో స్పర్శించే వాస్తవ ప్రపంచం ప్రకృతి. ప్రకృతి గురించి వర్ణించడానికి మాటలు సరిపోవు. ఎంతో అమూల్యమైనది,ప్రతిష్ఠాత్మకమైనది ప్రకృతి. ప్రకృతి ఒడిలో ఉంటే అమ్మ ఒడిలో ఉన్నంత భావన కలుగుతుంది. అలాంటి ఈ ప్రకృతిలో ప్రతిక్షణం ఎప్పటికప్పుడు సరి కొత్తదనం ఆవహించికుంటుంది. అలాంటి ఈ ప్రకృతిలో సరికొత్తగా పుట్టుకొచ్చింది మ్యాజిక్ రైస్.

మ్యాజిక్ రైస్ ఏంటి? వినడానికి విడ్డూరంగా ఉందే? దీన్ని  ఎప్పుడూ,ఎక్కడా  మేము వినలేదు, చూడలేదు? అనే సందేహం నాతోపాటు మీకు కలిగిందా? అవును నిజమండి..!ప్రకృతిలో సరికొత్తగా పుట్టుకొచ్చింది ఈ మ్యాజిక్ రైస్.ఈ వార్తను సరికొత్తగా ఇండియా హెరాల్డ్ మీకు అందిస్తోంది. మిమ్మల్ని అబ్బుర పరిచే విధంగా సరికొత్తగా మీ ముందుకు తీసుకొస్తోంది. ఆ మ్యాజిక్ రైస్ విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి వివరాల్లోకి వెళితే బాల్యం నుంచి ప్రకృతి పై మక్కువ పెంచుకున్న కరీంనగర్ జిల్లా శ్రీ రాముల పల్లె కు చెందిన శ్రీకాంత్ వినూత్నమైన ఆలోచనలతో సరికొత్త వంగడాలను పండిస్తున్నాడు. అందులో భాగంగానే ఈ మ్యాజిక్ రైస్. ఈ బియ్యానికి సరిపడినంత నీరు పోసి 30 నిమిషాలు పక్కన పెట్టేస్తే  చాలు అన్నం రెడీ. ఈ పద్ధతిని రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. చల్లని అన్నం కావాలనుకున్నవారు చల్ల నీళ్లు పోస్తే సరిపోతుంది. మరి వేడి అన్నం కావాలి అనుకున్న వారు వాటికి తగ్గట్టు వేడి నీళ్ళు పోస్తే వేడి అన్నం తయారు అవుతుంది. ఈ బియ్యంలో 10.73 శాతం ఫైబర్,6.8 శాతం ప్రోటీన్లు ఉన్నాయని  "గౌహతి యూనివర్సిటీ తోపాటు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్  రీసెర్చ్" వంటి పరిశోధన సంస్థలు వెల్లడించాయి.

ఈ మ్యాజిక్ రైస్ గురించి అడగగా శ్రీకాంత్ మాట్లాడుతూ"ప్రతి సంవత్సరం ఒక కొత్త రకం తీసుకురావడం,  అలా వాటిని పూర్తిగా సేంద్రీయ ఎరువులతో పండించడం నాకు అలవాటుగా మారింది. ప్రస్తుతం వస్తున్న వాతావరణ మార్పులు, పెట్టుబడి సరిగ్గా అందక, సరైన సమయానికి  డబ్బు లేక ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నాము. అదే సమయంలో ఒక రోజు రేడియోలో వార్తలు వింటూ ఉండగా తన ప్రోగ్రాం లో సుభాష్ పాలేకర్ గారు అస్సాంలో పండించే వరి గురించి చెప్పారు. తాజాగా అస్సాం నుంచి తీసుకొచ్చిన "బోకాసాల్ "అనే వరి వంగడాలకు సంబంధించిన బియ్యం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది.

పంట సాగు సమయం జూన్ నుంచి డిసెంబర్ వరకు కాగా మొత్తం 145 రోజుల్లో పంట చేతికి వస్తుంది. దీని ఉపయోగం ఏమిటంటే కేవలం నీళ్లు పోస్తే అన్నం రెడీ అవుతుంది.ప్రస్తుతం అంతరించిపోతున్న దేశీయ వంగడాలలో ఇది కూడా ఒకటి.ఇది అస్సాంలో ఎక్కువగా ట్రైబల్స్ దగ్గర పండుతుంది.వీటిని ఎక్కువగా ఆర్మీ వాళ్ళు ఉపయోగిస్తుంటారు.అయితే ఇలా పండిస్తున్న వరి వంగడాలను తినడం వల్ల శరీరానికి అధిక ఫైబర్ అందడంతో పాటు నెమ్మదిగా జీర్ణం అవుతుంది. మారుతున్న జీవన శైలి లో వాతావరణంలో కలిగే మార్పుల వల్ల మన శరీరంలో ఏ విధంగా జీర్ణవ్యవస్థపై మార్పు తీసుకొస్తుంది  అనే విషయంపై పరిశోధనలు జరుగుతున్నాయని కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ కార్యదర్శి శ్రీధర్ చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ప్రస్తుతం అంతరించిపోతున్న వరి వంగడాలను తిరిగి వాడుకలోకి తీసుకొస్తున్న రైతన్నకు శతకోటి వందనాలు.ఇప్పుడు ఈ రైతు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.




కరోనా ప్రభావంతో కోమా, మతిచాంచల్యం!

షాకింగ్: సొంత పార్టీ పెడుతున్న ముగ్గురు తెరాస ఎమ్మెల్యేలు

కేంద్రాన్ని ఇరుకున పెట్టిన జగన్...మోడీకి ఇక తప్పదు...!

వంగ‌వీటి రాధా కారులో వైసీపీ ఎమ్మెల్యే.. రోడ్డుపైనే ర‌చ్చ ర‌చ్చ‌...!

ఉదయం కూలిన విమానం.. సాయంత్రం విరిగిపడిన కొండచరియలు..

బర్డ్ ఫ్లూ వస్తే ఎన్నికలు పెడతారా...? ఏపీ ఉద్యోగుల ఫైర్

ష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>