PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pcc1fc1a6a1-ac24-432b-a2e0-5c896722d8ae-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pcc1fc1a6a1-ac24-432b-a2e0-5c896722d8ae-415x250-IndiaHerald.jpgతెలంగాణ కాంగ్రెస్ చీఫ్ పదవి ఎవరిని వరించనుందనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి దాదాపు పీసీసీ చీఫ్ పదవి ఖాయమైపోయిందని రెండు రోజుల క్రితం వార్తలొచ్చాయి. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటివరకు జీవన్ రెడ్డి పేరును ప్రకటించలేదు. అయితే త్వరలోనే నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు ఉండటంతో.. ఆ ఎన్నిక తరువాతే ఈ నియామకం ఉంటుందంటూ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాలు చూసుకుంటున్న మాణికం ఠాగూర్ చెప్పారు.pcc;auto;kumaar;nagarjuna akkineni;jeevan;hyderabad;bharatiya janata party;uttam kumar reddy nalamada;jeevan reddy;telangana;congress;రాజీనామా;letter;fish;reddy;party;anandamనాగార్జున సాగర్ ఉప ఎన్నిక తరువాతే పీసీసీ చీఫ్ నియామకంనాగార్జున సాగర్ ఉప ఎన్నిక తరువాతే పీసీసీ చీఫ్ నియామకంpcc;auto;kumaar;nagarjuna akkineni;jeevan;hyderabad;bharatiya janata party;uttam kumar reddy nalamada;jeevan reddy;telangana;congress;రాజీనామా;letter;fish;reddy;party;anandamFri, 08 Jan 2021 17:24:05 GMTహైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ పదవి ఎవరిని వరించనుందనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి దాదాపు పీసీసీ చీఫ్ పదవి ఖాయమైపోయిందని రెండు రోజుల క్రితం వార్తలొచ్చాయి. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటివరకు జీవన్ రెడ్డి పేరును ప్రకటించలేదు. అయితే త్వరలోనే నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు ఉండటంతో.. ఆ ఎన్నిక తరువాతే ఈ నియామకం ఉంటుందంటూ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాలు చూసుకుంటున్న మాణికం ఠాగూర్ చెప్పారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి ఎంతో కీలకమని, ప్రస్తుతం ఉన్న కమిటీతోనే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక బరిలోకి దిగుతామని ఆయన అన్నారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసేసినప్పటికి ఈ ఉప ఎన్నిక ముగిసే వరకు ఆయనే పీసీసీ చీఫ్‌గా కొనసాగనున్నట్టు తెలిపారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పూర్తి అయిన వెంటనే పూర్తి స్థాయి కమిటీని ప్రకటిస్తామని మాణికం ఠాగూర్ చెప్పారు. పూర్తి స్థాయి కమిటీని ప్రకటించాక 2023 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు. కాగా.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడిన విషయం తెలిసిందే. తెలంగాణ ఇచ్చిన పార్టీగా అధికారంలోకి వస్తుందనుకుంటే అంతకంతకూ బలహీనపడుతోంది కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోయింది. దుబ్బాక ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఊహించిన విధంగా ఓట్లు రాలేదు. మరోపక్క రాష్ట్రంలో బీజేపీ చేప కింద నీరులా విస్తరిస్తూ పోతోంది. దుబ్బాకలో విజయం సాధించిన బీజేపీ జీహెచ్ఎంసీలోనూ గట్టి పోటీనిచ్చింది. టీఆర్ఎస్‌ పార్టీ మేజిక్ ఫిగర్‌కు చేరుకోకుండా అడ్డుకట్ట వేయగలిగింది. ఈ ఆనందంతోనే 2023 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఆ పార్టీ దూసుకుపోతోంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలోనూ విజయం బీజేపీదే అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ దీమా వ్యక్తం చేశారు.


ఫోన్‌కు వచ్చిన లింక్ ఓపెన్ చేశాడు.. ఐదు నిమిషాల తర్వాత ఒక్కసారిగా షాక్!

రికార్డులను కొల్లగొడుతున్న రాకింగ్ స్టార్ యష్

కీలక విషయాన్ని బయటపెట్టిన పవన్ కల్యాణ్ భార్య

ఒకేరోజు 9 ఆలయాలకు సీఎం జగన్ భూమి పూజ

ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎం లకు క్లిష్ట పరిస్థితులు...?

జీవ‌తా రాజ‌శేఖ‌ర్ ఎమ్మెల్యేగా పోటీ... ఆ సీటుపైనే గురి పెట్టారా..!

విచార‌ణ‌లో షాకింగ్ విష‌యాలు చెప్పిన అఖిల‌ప్రియ‌




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>