Healthyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/bird-flu8fafdcd1-52cd-4787-b6bf-2f613a11e0a0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/bird-flu8fafdcd1-52cd-4787-b6bf-2f613a11e0a0-415x250-IndiaHerald.jpgకరోనా బెడద నుంచి కొద్ది కొద్దిగా బయపటడుతున్న నేపథ్యంలో బర్డ్ ఫ్లూ ఎంటరై ప్రతి ఒక్కరినీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ వంటి అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ వైరస్ వందల సంఖ్యలో పక్షులు బలయ్యాయి. దీంతో అక్కడి ప్రభుత్వాలు అప్రమత్తమై వేల సంఖ్యలో..bird flu;manu;kerala;germany;turkey;himachal pradesh;madhya pradesh - bhopal;rajasthan;croatia;american samoa;minister;central government;manadesamవిజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ.. గుడ్లు, మాంసం తినొచ్చా..?విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ.. గుడ్లు, మాంసం తినొచ్చా..?bird flu;manu;kerala;germany;turkey;himachal pradesh;madhya pradesh - bhopal;rajasthan;croatia;american samoa;minister;central government;manadesamFri, 08 Jan 2021 21:55:43 GMTఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా బెడద నుంచి కొద్ది కొద్దిగా బయపటడుతున్న నేపథ్యంలో బర్డ్ ఫ్లూ ఎంటరై ప్రతి ఒక్కరినీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ వంటి అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ వైరస్ వందల సంఖ్యలో పక్షులు బలయ్యాయి. దీంతో అక్కడి ప్రభుత్వాలు అప్రమత్తమై వేల సంఖ్యలో బాతులను, కోళ్లను కల్లింగ్ చేస్తున్నాయి. ఈ మధ్యనే తెలుగు రాష్ట్రల్లోకి కూడా ఈ వైరస్ ప్రవేశించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో గుడ్లు, మాంసం తినవచ్చా..? తినకూడదా..? అనే అనుమానాలు ప్రతి ఒక్కరిలోనూ తలెత్తుతున్నాయి.

బర్డ్ ఫ్లూపై నెలకొన్న అనేక అనుమానాలకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా (బర్డ్ ఫ్లూ) వైరస్ బారిన పడిన పక్షులకు దగ్గరగా ఉండడం, వాటిని ఆహారంగా తీసుకునే సమయంలో సరిగా ఉండికించకుండా తినడం వల్ల మనుషులకు కూడా ఈ వైరస్ వ్యాపించే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ప్రస్తుతం పరిస్థితుల్లో హాఫ్ బాయిల్డ్ మాంసాహారానికి దూరంగా ఉండాలని హెచ్చరించింది. అధిక ఉష్ణోగ్రతను బర్డ్ ఫ్లూ వైరస్ తట్టుకోలేదని, అందువల్ల ఆహారాన్ని కనీసం 70 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉడికించి తింటే ప్రమాదం ఏమీ ఉండదని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.

బర్డ్‌ఫ్లూ వైరస్‌ ప్రభావం ఆసియా, అమెరికా దేశాల్లో కంటే యూరప్‌ దేశాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. కొన్ని వారాలుగా నెదర్లాండ్స్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, బెల్జియం, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, డెన్మార్క్‌, స్వీడన్‌, పోలండ్‌, క్రొయేషియా, ఉక్రెయిన్‌లలో బర్డ్‌ఫ్లూ వైరస్ కనిపెట్టినట్లు యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌(ఈసీడీసీ) తెలిపింది. ఈ వైరస్ కారణంగా ఫ్రాన్స్‌లో సుమారు 6 లక్షలకు పైగా కోళ్లను వధించారు. జర్మనీలో 62వేల టర్కీ కోళ్లు, బాతులను అక్కడి అధికారులు కల్లింగ్ చేశారు. మనదేశంలోకి కూడా బర్డ్ ఫ్లూ జర్మనీనుంచి ప్రవేశించిందనే అనుమానాలు ఇప్పటికే ఉన్నాయి. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ఆధారాలూ లేవు.

ఇదిలా ఉంటే బర్డ్ ఫ్లూ వ్యాప్తి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ అన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, విదేశీ పక్షులు, అటవీ పక్షుల వల్లే ప్రధానంగా వైరస్‌ వ్యాప్తి చెందుతోందని తెలిపారు. వైరస్‌ వ్యాప్తిని నివారించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని, కేంద్రం కూడా దీనిపై చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఏది ఏమైనా బర్డ్ ఫ్లూ నేపథ్యంలో గుడ్లు, మాంసానికి కొంత దూరంగా ఉండడమే మంచిది. ఒకవేళ కచ్చితంగా తినాలని అనిపిస్తే బాగా ఉండికించి తినండి.


నాని 'టక్ జగదీష్' అదిరిపోయే అప్డేట్.. టీజర్ వచ్చేస్తుందహో..!

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా

దేవాలయాల మీద దాడులు వెనక కుట్ర కోణం...?

నాగార్జున సాగర్ ఫలితం తర్వాతే కాంగ్రెస్ భవిష్యత్ మారబోతుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>