MoviesNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rakula-and-nagachaitanyaec7f1895-6472-4b5d-8a6d-e5e6d80655cd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rakula-and-nagachaitanyaec7f1895-6472-4b5d-8a6d-e5e6d80655cd-415x250-IndiaHerald.jpgఅక్కినేని నాగచైతన్య రీసెంట్ గా "వెంకీ మామ"లో కనిపించాడు. ప్రస్తుతం "మనం" అలాగే "24" ఫేమ్ విక్రమ్ కే కుమార్ తెరకెక్కిస్తున్న "థ్యాంక్ యూ" షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. "థ్యాంక్ యూ" మూవీను శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ అలాగే హర్షిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. rakula and nagachaitanya;mahesh;venkatesh;naga chaitanya;kumaar;nagarjuna akkineni;shriya;naga;nageshwara rao akkineni;rakul preet singh;ravi anchor;samantha;sriram;thaman s;vikram;cinema;naga aswin;venky mama;love;heroine;vaishnav tej;romantic;naveen nuli;chaitanya 1;reddy;legend;dil;sai pallavi;love storyరకుల్ ను సిఫార్సు చేసిన చైతూరకుల్ ను సిఫార్సు చేసిన చైతూrakula and nagachaitanya;mahesh;venkatesh;naga chaitanya;kumaar;nagarjuna akkineni;shriya;naga;nageshwara rao akkineni;rakul preet singh;ravi anchor;samantha;sriram;thaman s;vikram;cinema;naga aswin;venky mama;love;heroine;vaishnav tej;romantic;naveen nuli;chaitanya 1;reddy;legend;dil;sai pallavi;love storyFri, 08 Jan 2021 09:00:00 GMTఅక్కినేని నాగచైతన్య రీసెంట్ గా "వెంకీ మామ"లో కనిపించాడు. ప్రస్తుతం "మనం" అలాగే "24" ఫేమ్ విక్రమ్ కే కుమార్ తెరకెక్కిస్తున్న "థ్యాంక్  యూ" షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. "థ్యాంక్ యూ" మూవీను శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ అలాగే హర్షిత్ రెడ్డి  నిర్మిస్తున్నారు.

విక్రమ్ అలాగే చైతూ ఇంతకు ముందు "మనం" కోసం పనిచేశారు. అక్కినేని నాగార్జున, సమంత, శ్రీయ అలాగే లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఇందులో నటించారు.

చైతూ కెరీర్ లో "మనం" అనే సినిమా మంచి హిట్ గా నిలిచిపోయింది. "మనం" ఫీల్ గుడ్ మూవీగా ప్రేక్షకులను అలరించింది.

ఫిలిం ఇండస్ట్రీలోని లేటెస్ట్ బజ్ ప్రకారం, రకుల్ ప్రీత్ సింగ్ పేరును నాగ చైతన్య  రికమెండ్ చేశాడట. రకుల్ ను హీరోయిన్ గా తీసుకుంటే సినిమాకు ప్లస్సవుతుందని సూచించాడట. ఐతే, రకుల్ ను ఫైనలైజ్ చేస్తారో లేదా వేరే హీరోయిన్ పేరును పరిశీలనలోకి తీసుకున్నారో తెలియాలంటే కొంతకాలం పాటు వెయిట్ చేయాలి.

చైతూ అలాగే రకుల్ కలిసి "రారండోయ్ వేడుక చూద్దాం"లో సందడి చేశారు. ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో రకుల్ అలాగే చైతూ కెమిస్ట్రీ బాగా పండింది. కాబట్టి, అదే కెమిస్ట్రీని రిపీట్ చేయడానికి నాగ చైతన్య ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ వైష్ణవ్ తేజ్ తో సినిమాతో బిజీగా ఉంది. క్రిష్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.  

"థ్యాంక్ యూ" అనే మూవీకు పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ చేస్తున్నాడు. ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. బీవీఎస్ రవి కథను అందించాడు. ఇక ఎడిటింగ్ డిపార్ట్మెంట్ పనిని నవీన్ నూలి నిర్వహిస్తున్నాడు.

ఈ సినిమాలో నాగ చైతన్య హాక్ ప్లేయర్ గా కనిపిస్తున్నాడు. ముఖ్యంగా మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా అలరించబోతున్నాడు చైతూ.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం చైతూ "లవ్ స్టోరీ" అనే సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇందులో, చైతూకు జోడిగా సాయి పల్లవి నటించింది.


అఖిలప్రియ రిమాండ్ రిపోర్టులో సంచలనాలు!

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా

సిగిరెట్ తాగే వారికి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం

వీరిద్దరూ భార్యాభర్తలు.. విడాకులు కూడా తీసుకున్నారని ఎంతమందికి తెలుసు?

అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?

తెరాస పార్టీ బీజేపీ ని కాకుండా బండి ని టార్గెట్ చేయడంలో మర్మం ఏంటి..?

ఐటీఐఆర్ ప్రాజెక్టును పునరుద్దరించండి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>