PoliticsSiva Prasadeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/the-destruction-of-the-idols-must-be-answeredd16d9b57-f702-4b17-a5cb-1e0d9a35e4ad-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/the-destruction-of-the-idols-must-be-answeredd16d9b57-f702-4b17-a5cb-1e0d9a35e4ad-415x250-IndiaHerald.jpgరాష్ర్ట వ్యాప్తంగా 13 జిల్లాల్లో దాదాపు 140 సంఘటనలు జరిగినా ప్రభుత్వంలో చలనం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం పట్ల రాష్ట్ర ప్రజలు ఆవేదన చెందుతున్నారని.. వీటిపై సీఎం స్పందన ఎలా ఉంటోందనని 5 కోట్ల మంది ప్రజలు ఎదురుచూశారని చెప్పారు. బొత్స చేత చిలకపలుకులు పలికించారు.రాష్ట్రంలో ఒక సీఎం, 5 మంది డిప్యూటీ సీఎంలుండగా ఈయన మాట్లాడమేమిటి? దేవాదాయశాఖ మంత్రి, సంబంధిత శాఖామంత్రులు ఉండగా బొత్స మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఉమా పెదవి విరిచారు.devineni uma;view;cbn;deva;kishore;prasanth;sekhar;tiru;bandara;jagan;devineni avinash;botcha satyanarayana;white house;donald trump;deputy chief minister;government;police;tirupati;media;bihar;cm;chief minister;cbi;minister;husband;murder.;tdp;pink;house;paderu;tadepalli;march;reddy;prashant kishor;tirumala tirupathi devasthanamతిరుపతి ఎన్నికలో బండారం బయట పడుతుంది: -మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతిరుపతి ఎన్నికలో బండారం బయట పడుతుంది: -మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుdevineni uma;view;cbn;deva;kishore;prasanth;sekhar;tiru;bandara;jagan;devineni avinash;botcha satyanarayana;white house;donald trump;deputy chief minister;government;police;tirupati;media;bihar;cm;chief minister;cbi;minister;husband;murder.;tdp;pink;house;paderu;tadepalli;march;reddy;prashant kishor;tirumala tirupathi devasthanamFri, 08 Jan 2021 21:40:55 GMTమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం పట్ల రాష్ట్ర ప్రజలు ఆవేదన చెందుతున్నారని.. వీటిపై సీఎం స్పందన ఎలా ఉంటోందనని 5 కోట్ల మంది ప్రజలు ఎదురుచూశారని చెప్పారు. బొత్స చేత చిలకపలుకులు పలికించారు. రాష్ట్రంలో ఒక సీఎం, 5 మంది డిప్యూటీ సీఎంలుండగా ఈయన మాట్లాడమేమిటి? దేవాదాయశాఖ మంత్రి, సంబంధిత శాఖామంత్రులు ఉండగా బొత్స మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఉమా పెదవి విరిచారు. ఇది వారి నిర్లక్ష్య ధోరణికి పరాకాష్ట. దీనిపై ముఖ్యమంత్రి  సమాధానం చెప్పాలి. బీహార్ ఫేక్ మాఫియా అయిన ప్రశాంత్ కిశోర్ తో తిరుపతి ఎన్నికల వ్యూహం గురించి మాట్లాడటానికి 3 గంటలు కేటాయించిన సీఎం కు దేవాలయాలు, విగ్రహాల ధ్వంసంపై మాట్లాడడానికి సమయం లేకపోవడం బాధాకరం అన్నారు.
                                      ముఖ్యమంత్రి  పంచకట్టుడుతో పరమాత్ముడవలేరు. సీఎం అసమర్థ వైఖరివల్ల ప్రభుత్వ వ్యవస్థలకు, యంత్రాంగానికి పెరాలసిస్ వచ్చిందన్నారు. ప్రభుత్వ వ్యవస్థల్ని పనిచేయనీయకుండా చేశారు. దేవాలయాలపై 140 సంఘటనలు జరిగినా ముద్దాయిలను పట్టుకోలేకపోయారు. అంతర్వేది రథం దగ్దంతో సంఘటనలో మేం సీబీఐ విచారణ కోరితే మమ్మల్ని తిట్టారు. 24 గంటలు గడవకముందే మాట మార్చి సీబీఐ విచారణ అన్నారు. చంద్రబాబునాయుడు శేఖర్ రెడ్డికి టీటీడీ బోర్డు మెంబర్ పదవిని ఇవ్వడమేకాకుండా వ్యాపార సంబంధాలు కూడా నెరుపుతున్నారని దుష్ర్పచారం చేశారని ఉమా ధ్వజమెత్తారు. జగన్ బాబాయి వివేకానందరెడ్డిని హత్య చేసిన వారిని ఇంతవరకు పట్టుకోకపోవడం సిగ్గుచేటు. పక్క రాష్టం వారితో కలిసి డేటా చోరీకి పాల్పడ్డారు. పింక్ డైమెండ్ తాడేపల్లి రాజప్రాసాదానికి వచ్చిందో? లేక బీహార్ పీకే టీం దగ్గరికి వెళ్లిందో? లేక ఇడుపులపాయి ఎస్టేట్ కు వెళ్లిందో, లోటస్ పాండ్ లో ఉందో, బెంగుళూరు వైట్ హౌస్ లో ఉందో తెలపాలన్నారు. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 6 లక్షల కోట్లు దోపిడి చేసిందని దుష్ర్పచారం చేశారు. మీరు ఇప్పుడు రెండు సంవత్సరాల్లో 2 లక్షల కోట్లు అప్పు చేయబోతున్నావు. రాష్ట్రంలో దేవుడి పరిపాలన జరుగుతోందంటున్నావు. ఇది దేవుడి పరిపాలన కాదు, దయ్యాల పరిపాలన. పాడేరులో అమ్మవారి పాదాలు ధ్వంసం చేశారు. పురంశెట్టి అంకులును, నందం సుబ్బయ్యలను అతి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటనలకు పోలీసులు అత్యుత్సాహంగా సహకరిస్తున్నారని దుయ్యబట్టారు. ట్రంప్ కు ఏ గతి పట్టిందో, జగన్ రాజప్రాసాదానికి కూడా అదే గతి పడుతుందని దుయ్యబట్టారు.
                                            ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేశారు. ప్రభుత్వం సొంత డప్పు కొట్టుకోవడం మానాలని ఉమా అన్నారు. రైతులు అమ్ముకున్న ధాన్యానికి రూ.2,700 కోట్లు రావాల్సి ఉంది. జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నారు. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లొచ్చిన మాదిరిగా జగన్ వ్యవహరిస్తున్నారని అన్నారు. ఉదాసీన వైఖరి వల్ల రాష్టం వెనక్కి పోతోంది. తిరుపతి ఉప ఎన్నికలలో మీ బండారం బయట పడుతుందన్నారు.  రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసాలపై నోరు మెదపడంలేదు. వీటిపై జగన్ సమాధానం చెప్పాలని ఉమా ప్రశ్నించారు.


ఏపీ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చిన నిమ్మగడ్డ రమేష్... ఎన్నికల షెడ్యూల్ విడుదల

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా

దేవాలయాల మీద దాడులు వెనక కుట్ర కోణం...?

నాగార్జున సాగర్ ఫలితం తర్వాతే కాంగ్రెస్ భవిష్యత్ మారబోతుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Siva Prasad]]>