PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/dry-run8ffd322e-ddf1-43a1-b4fc-06e9b5f5da72-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/dry-run8ffd322e-ddf1-43a1-b4fc-06e9b5f5da72-415x250-IndiaHerald.jpgఇవాళ మరోసారి దేశవ్యాప్తంగా కరోనా డ్రై రన్ నిర్వహించనున్నారు. రెండో విడత కరోనా వ్యాక్సినేషన్ డ్రై రన్ ఇవాళ నిర్వహిస్తారు. నేడు 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 736 జిల్లాల్లో డ్రై రన్ కార్యక్రమం ఉంటుంది. వ్యాక్సిన్ పంపిణీలో తలెత్తే లోటుపాట్లు గుర్తించేందుకు ఈ డ్రై రన్ నిర్వహిస్తున్నారు. ఈ విధానంలో కోల్డ్ చైన్ విధానాన్ని మరింత పటిష్టం చేసినట్లు కేంద్రం ఇప్పటికే వెల్లడించింది. వ్యాక్సినేషన్‌ కోసం మానవ వనరులు సిద్ధం చేసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. తొలి డ్రైరన్‌లో గుర్తించిన లోపdry-run;vidya;telangana;electricity;software;central governmentనేడు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రై రన్‌.. ఏం చేస్తారంటే..?నేడు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రై రన్‌.. ఏం చేస్తారంటే..?dry-run;vidya;telangana;electricity;software;central governmentFri, 08 Jan 2021 08:00:00 GMT
తొలి డ్రైరన్‌లో గుర్తించిన లోపాలను సరిదిద్దుకోవాలని కేంద్రం తెలిపింది. వ్యాక్సిన్‌పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించలని రాష్ట్రాలకు కేంద్రం పిలుపు ఇచ్చింది. అటు తెలంగాణ, ఏపీల్లో మరో మారు కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ ని సర్కారులు  భారీ ఎత్తున నిర్వహించనున్నాయి. మహమ్మారిని కట్టడి చేసేందుకు కనిపిస్తున్న మార్గం వ్యాక్సినేషనే. ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్  ని అందించటం ద్వారా వారు వైరస్ ని ఎదుర్కోగలరు. ఇందుకోసం ఇప్పటికే దేశంలో రెండు టీకాలకు డీసీజీఐ అనుమతించటంతోపాటు. సుమారు మరో వారం రోజుల్లో వ్యాక్సినేషన్ ప్రారంభిస్తున్నారు.

వ్యాక్సినేషన్ సమయంలో ఏ ఏ సమస్యలు వస్తాయన్న విషయాలను ఈ డ్రై రన్ లో పరిశీలించి వాటిని పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. కోవిన్ సాఫ్ట్ వేర్ లో వైద్య రంగంలో పనిచేస్తున్న వారు నమోదు చేసుకున్నారు. భవిష్యత్తులో అన్ని రంగాల ఫ్రంట్ లైన్ వర్కర్లతోపాటు.. దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్నవారు , 50ఏళ్ల పై బడిన వారు భారీగా వ్యాక్సినేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ లను స్టేట్ వ్యాక్సిన్ స్టోర్ నుంచి జిల్లాలకు, అక్కడి నుంచి గ్రామ స్థాయిలో ఉన్న పీహెచ్ సీలు, మారుమూల వ్యాక్సిన్ కేంద్రాలకు వ్యాక్సిన్ ల తరలింపు, కోవిన్ సాఫ్ట్ వేరులో లబ్దిదారుల వివరాల నమోదు సహా క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి పరిష్కరిస్తారు.

 వ్యాక్సినేషన్ కోసం అంతరాయం లేని విద్యుత్ సౌకర్యంతోపాటు హై స్పీడ్ ఇంటర్ నెట్ అవసరం ఉంటుంది. ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరింవచ్చన్నదానికి ఈ డ్రైన్ ఉపయోగపడుతుంది. ఒక్కో వ్యాక్సిన్ కేంద్రంలో 25 మంది వాలంటీర్లతో డ్రై రన్ నిర్వహించనున్నారు.  డ్రై రన్  ప్రక్రియ ప్రారంభించిన  రెండు గంటల్లో 25 మంది లబ్దిదారులకు మాక్ డ్రిల్ పూర్తి చేస్తారు. 


రామ్ రెడ్ పై మాములు అంచనాలు లేవుగా.. 7 భాషల్లో..?

సిగిరెట్ తాగే వారికి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం

వీరిద్దరూ భార్యాభర్తలు.. విడాకులు కూడా తీసుకున్నారని ఎంతమందికి తెలుసు?

అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?

తెరాస పార్టీ బీజేపీ ని కాకుండా బండి ని టార్గెట్ చేయడంలో మర్మం ఏంటి..?

ఐటీఐఆర్ ప్రాజెక్టును పునరుద్దరించండి

తిరుపతిలో వైసీపీ ఓడిపోతుందా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>