Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/elon-muskecb72c8b-fe77-43dc-a867-3245657e1f48-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/elon-muskecb72c8b-fe77-43dc-a867-3245657e1f48-415x250-IndiaHerald.jpgప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఒక్క ట్వీట్‌తో వాట్సాప్‌కు చుక్కలు చూపించాడు. వాట్సాప్ యాజమాన్యంపై ఆగ్రహంతో మస్క్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. వాట్సాప్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఫేస్‌బుక్ యాజమాన్యం వాట్సాప్ వినియోగదారులకు సంబంధించి తాజాగా...elon musk;yajamanya;whatsapp;twitter;customer;applicationఒక్క ట్వీట్‌తో వాట్సాప్‌కు చుక్కలు చూపించిన మస్క్..!ఒక్క ట్వీట్‌తో వాట్సాప్‌కు చుక్కలు చూపించిన మస్క్..!elon musk;yajamanya;whatsapp;twitter;customer;applicationFri, 08 Jan 2021 22:56:30 GMTఇంట్నెట్ డెస్క్: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఒక్క ట్వీట్‌తో వాట్సాప్‌కు చుక్కలు చూపించాడు. వాట్సాప్ యాజమాన్యంపై ఆగ్రహంతో మస్క్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. వాట్సాప్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఫేస్‌బుక్ యాజమాన్యం వాట్సాప్ వినియోగదారులకు సంబంధించి తాజాగా ప్రైవసీ పాలసీని మార్చుకుంటున్నట్లు ప్రకటించింది. దీని ప్రకారం వాట్సాప్ వినియోగదారులంతా తమ డేటాను ఫేస్‌బుక్‌తో పంచుకోవాలని ఆదేశించింది. లేకపోతే వినియోగదారుల ఖాతాను డిలీట్ చేస్తామని హెచ్చరించింది.

ఫేస్‌బుక్ చేసిన ఈ హెచ్చరిక ఎలాన్ మస్క్‌కు నచ్చలేదు. దీంతో ఆయన ఓ ట్వీట్ చేశారు. ‘సిగ్నల్‌ను వాడుకోండి’ అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. సిగ్నల్ అనేది వాట్సాప్ లానే ఓ సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్. వాట్సాప్‌లా కాకుండా ఇదో ఓపెన్ సోర్స్ యాప్. వాట్సాప్‌కు బుదులగా సిగ్నల్ యాప్‌ను వాడుకోవాలని మస్క్ తన ట్వీట్ ద్వారా సూచించాడు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. అంతేకాదు సిగ్నల్ యాప్ డౌన్‌లోడ్లు కూడా అమాంతం పెరిగిపోయాయి. అయితే ఒక్కసారిగా డౌన్‌లోడ్లు పెరిగిపోవడంతో వెరిఫికేషన్ ఓటీపీలు పంపే వ్యవస్థ కూడా నిలిచిపోయిందట. అయితే దీనిపై స్పందించిన సిగ్నల్ యాప్ యాజమాన్యం సమస్యను పరిష్కరించినట్లు తెలిపింది.

ఒక్కసారిగా యూజర్లు తగ్గిపోయే ప్రమాదం ఫేస్‌బుక్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ప్రతి వాట్సాప్ ఖాతాదారుడూ తమ డేటాను ఫేస్‌బుక్‌తో పంచుకోవాల్సిన అవసరం లేదని, కేవలం బిజినెస్ అకౌంట్ వినియోగదారులు మాత్రం పంచుకుంటే సరిపోతుందని తెలిపింది. ఒకవేళ ఎవరైనా సాధారణ యూజర్లు కొత్త పాలసీని అంగీకరించినా వారి డేటాను బిజినెస్ అవసరాలకు వినియోగించమని ప్రకటించింది.

ఇదిలా ఉంటే సాధారణంగానే మస్క్, జుకర్ బర్గ్‌లు పాము, ముంగిసల్లా ఉంటారు. వీరిద్దరికీ ఎప్పుడూ పడదు. ముఖ్యంగా జుకర్ బర్గ్‌ను మస్క్ ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటాడు. ఇంతకు ముందు కూడా ఫేస్‌బుక్ చరిత్రను విమర్శనాత్మకంగా చూపిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఏఐ విషయంలోనూ జుకర్ బర్గ్‌‌కు అంత తెలివి తేటలు లేవని విమర్శించాడు. ఏదైతేనేం మస్క్ ఒక్క ట్వీట్‌తో ఫేస్‌బుక్ తన పాలసీనే మార్చుకునే పరిస్థితి ఏర్పడింది.

" style="height: 200px;">





బాలయ్యకు జగన్ ఛాన్స్ ఇస్తారా? వైసీపీ లెక్కలో పెట్టుకోవడం లేదా?

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. ఏంటంటే..

రైతు సంఘాలతో కేంద్ర సమావేశం.. ఏం మాట్లాడారంటే..

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>