MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/teja-sajja-priya-warrier-new-movie-up-date893f878c-1082-4506-829d-0fb63beb3355-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/teja-sajja-priya-warrier-new-movie-up-date893f878c-1082-4506-829d-0fb63beb3355-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... సోషల్ మీడియాలో కేవలం ఒకే ఒక్క క్లిక్ తో అప్పట్లో తెగ వైరల్ అయ్యి నేషనల్ వైడ్ గా పాపులారిటీ సాధించింది ప్రియా ప్రకాష్ వారియర్. కన్ను గీటి కుర్రకారును తన వలలో వేసేసుకుంది. ‘ఒరు అదార్ లవ్’ అనే మలయాళ సినిమాతో వెండితెరకు పరిచయమైన ప్రియాంక.. తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైంది. ఈ సినిమాను తెలుగులోకి అనువాదం చేసి ‘లవర్స్ డే’గా విడుదల చేశారు. సినిమా ఆడకపోయినా ప్రియాంకకు మాత్రం మన కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. ​ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీకి తెలుగులో బాగానే అవకాశాలు teja-sajja;kumaar;priya;geetha;priya prakash varrier;priyanka;teja;india;variar;cinema;sangeetha;telugu;chalo;love;hero;letter;romantic;nithin reddy;v;fidaa;chitramవింక్ బ్యూటీని "ఇష్క్"చెయ్యబోతున్న తేజ సజ్జ....వింక్ బ్యూటీని "ఇష్క్"చెయ్యబోతున్న తేజ సజ్జ....teja-sajja;kumaar;priya;geetha;priya prakash varrier;priyanka;teja;india;variar;cinema;sangeetha;telugu;chalo;love;hero;letter;romantic;nithin reddy;v;fidaa;chitramFri, 08 Jan 2021 19:15:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... సోషల్ మీడియాలో కేవలం ఒకే ఒక్క క్లిక్ తో అప్పట్లో తెగ వైరల్ అయ్యి నేషనల్ వైడ్ గా పాపులారిటీ సాధించింది ప్రియా ప్రకాష్ వారియర్. కన్ను గీటి కుర్రకారును తన వలలో వేసేసుకుంది. ‘ఒరు అదార్ లవ్’ అనే మలయాళ సినిమాతో వెండితెరకు పరిచయమైన ప్రియాంక.. తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైంది. ఈ సినిమాను తెలుగులోకి అనువాదం చేసి ‘లవర్స్ డే’గా విడుదల చేశారు. సినిమా ఆడకపోయినా ప్రియాంకకు మాత్రం మన కుర్రాళ్లు ఫిదా అయిపోయారు.

ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీకి  తెలుగులో బాగానే  అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ అమ్మడు నితిన్ సినిమాలో నటిస్తుండగా ఇప్పుడు మరో సినిమా ఛాన్స్ ఆమెను వరించింది. అది కూడా మెగా సూపర్ గుడ్ ఫిలింస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మిస్తోన్న చిత్రంలో కావడం విశేషం. టాలీవుడ్‌లో ప‌లు బ్లాక్‌ బ‌స్టర్ ఫిలిమ్స్ అందించిన మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ 2021లో త‌న తొలి చిత్రంతో మళ్లీ తెలుగులోకి వ‌స్తోంది.యంగ్ హీరో తేజ స‌జ్జా ఈ చిత్రంలో క‌థానాయ‌కుడిగా న‌టించ‌నుండ‌గా.. ప్రియా ప్రకాష్ వారియ‌ర్ నాయిక‌గా న‌టించ‌నున్నారు. య‌స్‌.య‌స్‌.రాజు ద‌ర్శక‌త్వం వ‌హించే ఈ చిత్రానికి ఆర్‌.బి. చౌద‌రి స‌మ‌ర్పకులుగా వ్యవ‌హ‌రిస్తుండ‌గా.. ఎన్వీ ప్రసాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.ఈ చిత్రానికి ‘ఇష్క్’ అనే టైటిల్ ఖ‌రారు చేశారు.

‘నాట్ ఎ ల‌వ్ స్టోరీ’ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ మేరకు టైటిల్ పోస్టర్‌ను తేజ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా శుక్రవారం షేర్ చేశారు. టైటిల్ ప్రకారం ఈ మూవీ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ అనే అభిప్రాయం క‌లుగుతుండ‌గా.. ట్యాగ్‌లైన్ మ‌రో అభిప్రాయాన్ని క‌లిగిస్తూ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి "ఛలో", "భీష్మ" లాంటి సినిమాలకు సంగీతం అందించిన మ‌హ‌తి స్వర‌ సాగ‌ర్ సంగీతం అందిస్తున్నాడు..ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...


భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా

దేవాలయాల మీద దాడులు వెనక కుట్ర కోణం...?

నాగార్జున సాగర్ ఫలితం తర్వాతే కాంగ్రెస్ భవిష్యత్ మారబోతుందా..?

ఇకపై ప్రతీ పరీక్ష ఆన్ లైన్ లోనే..!

ఫోన్‌కు వచ్చిన లింక్ ఓపెన్ చేశాడు.. ఐదు నిమిషాల తర్వాత ఒక్కసారిగా షాక్!

రికార్డులను కొల్లగొడుతున్న రాకింగ్ స్టార్ యష్

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తరువాతే పీసీసీ చీఫ్ నియామకం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>