TVsavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/tv/122/vantalakkadb58aa55-0141-437b-8b8c-aebcfff1ec18-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/tv/122/vantalakkadb58aa55-0141-437b-8b8c-aebcfff1ec18-415x250-IndiaHerald.jpgకార్తీక దీపం సీరియల్ చూడని వారంటూ ఎవరూ ఉండరేమో. ఈ సీరియల్ వచ్చే టైం అయ్యిందంటే చాలు ఇక టీవీ ముందు తిష్ట వేయాల్సిందే. తెలుగు బుల్లితెర నటీనటులకు లేని క్రేజ్ ను సంపాదించింది ఈ వంటలక్క ప్రేమి విశ్వనాథ్. వంటలక్క ఎంత ప్రశాంతంగా ఉంటుందో.. ఒక్కోసారి అంత కోపంగా మారిపోతుంది. ఆమెకు కోపమొస్తే ఇక ప్రళయాలు సంభవించినట్టే. ఆమెకు దుఖం వస్తే సముద్రాలు ఉప్పొంగినట్టే. ఆమెకు ఆవేశం వస్తే భూమి బద్దలైనట్టే.. ఆమె ప్రేమకు అందరూ భానిసకావాల్సిందే.. ఈ మాటలు వంటలక్కకు కరెక్టుగా సూటవుతాయి. ఎందుకంటే ఈ సీరియల్ లో వంటలక్క ఆ విధvantalakka;cbn;karthik;deepa;television;episode;doctor;racchaవంటలక్క సహనం హద్దులు దాటిందండోయ్.. మోనిత పని ఇక ఔటేవంటలక్క సహనం హద్దులు దాటిందండోయ్.. మోనిత పని ఇక ఔటేvantalakka;cbn;karthik;deepa;television;episode;doctor;racchaFri, 08 Jan 2021 08:15:00 GMTటీవీ ముందు తిష్ట వేయాల్సిందే. తెలుగు బుల్లితెర నటీనటులకు లేని క్రేజ్ ను సంపాదించింది ఈ వంటలక్క ప్రేమి విశ్వనాథ్. వంటలక్క ఎంత ప్రశాంతంగా ఉంటుందో.. ఒక్కోసారి అంత కోపంగా మారిపోతుంది. ఆమెకు కోపమొస్తే ఇక ప్రళయాలు సంభవించినట్టే. ఆమెకు దుఖం వస్తే సముద్రాలు ఉప్పొంగినట్టే. ఆమెకు ఆవేశం వస్తే భూమి బద్దలైనట్టే.. ఆమె ప్రేమకు అందరూ భానిసకావాల్సిందే.. ఈ మాటలు వంటలక్కకు కరెక్టుగా సూటవుతాయి. ఎందుకంటే ఈ సీరియల్ లో వంటలక్క ఆ విధంగానే ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆమె ప్రేమకు అందరూ కట్టుబానిసలాగా మారిపోతారు. ఆత్మ గౌరవానికి తలంపురాకుండా ప్రవర్తిస్తుంటుంది. అదే ఆమెకు కోపం తెప్పించే వారి పట్ల దీప కాళికా అవతారమెత్తి వారి అంతు చూస్తుంది. ఇప్పుడు మన వంటలక్క కాళిక అవతారమెత్తిందండోయ్.


ఎందుకనుకుంటున్నారా.. అదే మరి వంటలక్క పతిదేవుడు డాక్టర్ బాబు ను తనను విడదీసిన మోనితపై పగ తీర్చుకోవడానికి సిద్ధమైంది దీప. దీపను అనుమానంతో అవమానించిన కార్తీక్ పట్ల ఇక సహనం నశించి.. డాక్టర్ బాబు మనసులో  వంటలక్క గురించి చెడు విష బీజం నాటిన మోనిత అంతు చూడాటానికి పూనుకుంది వంటలక్క. మోనిత పట్ల వంటలక్క శివమొత్తింది. ఏం చెప్పావ్ నా డాక్టర్ బాబుకు.. ఎందుకే ఇలాంటి విష బీజం నాటావంటూ వంటలక్క మోనిత రక్తం తాగడానికి సిద్ధమైందండోయ్. ఇంకేముంది వంటలక్క చేతిలో మోనిత చావు ఖాయమంటూ దీప అభిమానులు తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎన్నాళ్లు డాక్టర్ బాబుకు వంటలక్క దూరంగా ఉండేది. పిల్లలు కడుపులో పడ్డప్పుడు దూరమైతే ఇప్పుడు ఆ పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు.

ఇప్పుడు కూడా ఈ దూరం వద్దు బాబోయ్.. తొందరగా మోనిత అంతు వంటలక్క చూస్తే.. మోనిత నిజం చెప్తే.. ఎంచక్కా డాక్టర్ బాబు, వంటలక్క ఒక్కటైపోతారని పాపం అభిమానులు ఏండ్ల నుంచి వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కాని ఈ ముహూర్తం మాత్రం వంటలక్కకు ఇంకా రాలేదు. ఎప్పుడొస్తుందో కూడా చెప్పలేమండి బాబూ. కానీ ఇవ్వాల ఎపీసోడ్ చూస్తే మాత్రం వంటలక్కకు తొందరలోనే మంచి రోజులు వస్తాయేమోనని అనిపిస్తుంది. ఈ రోజు ఎపిసోడ్ లో వంటలక్క మోనిత ఇంటికి వెళ్లడం.. మోనితను బెదిరించడం.. కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చోవడం అబ్బో..ఏమి సీన్స్ ఏమీ  సీన్సూ అదిరిపోయాయనుకోండి. ఈ సీన్స్ చూసిన దీప అభిమానులకు ఆనంద బాష్పాలు రావొచ్చు. ఇదిలా ఉంటే వంటలక్క చేసిన రచ్చ గురించి మళ్లీ మోనిత డాక్టర్ బాబుకు ఏమని బాతఖాని చెబుతుందో.. మళ్లీ వీరి ఇద్దరి మధ్యన ఏ పుల్ల పెడుతుందోనంటూ దీప అభిమానులకు అప్పుడే అనుమానం మొదలయ్యిందనే చెప్పుకోవచ్చు.


సిగిరెట్ తాగే వారికి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం

వీరిద్దరూ భార్యాభర్తలు.. విడాకులు కూడా తీసుకున్నారని ఎంతమందికి తెలుసు?

అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?

తెరాస పార్టీ బీజేపీ ని కాకుండా బండి ని టార్గెట్ చేయడంలో మర్మం ఏంటి..?

ఐటీఐఆర్ ప్రాజెక్టును పునరుద్దరించండి

తిరుపతిలో వైసీపీ ఓడిపోతుందా...?

ఎమ్మెల్యేలను పిలుస్తున్న జగన్... షాక్ ఇస్తారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>