MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bollywood-shika-malhotrae0570edb-f9f3-41e8-9fef-430e0630bfca-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bollywood-shika-malhotrae0570edb-f9f3-41e8-9fef-430e0630bfca-415x250-IndiaHerald.jpgచైనాలో పుట్టి ప్రపంచ దేశాలన్నింటిని ఒక్కసారిగా వణికించేసింది కరోనా మహమ్మారి. కరోనా కారణంగా ఎంతోమంది బ్రతుకులు అతలాకుతలం అయ్యాయి. ఎన్నో వ్యాపార రంగాలు నష్టపోయాయి. సినీరంగం మొత్తం మూతబడింది. ఇలాంటి విపత్కర సమయంలో ప్రజలు ఎవరు ఎలాంటి వారు అనేది గ్రహించగలిగారు. రాజకీయ పరంగా కానీ,సినీ ఇండస్ట్రీ పరంగా కానీ ఎవరెవరు ఎంత డబ్బు ఇచ్చారు అనే విషయాన్ని ప్రజలు బాగా గ్రహించగలిగారు. bollywood,shika malhotra;shahrukh khan;sonu sood;bollywood;2019;cinema;rajani kanth;media;film industry;industry;doctor;hero;girl;heroine;posters;sharukh khanప్రజల సేవకై వెళ్లి పక్షవాత బారిన పడ్డ బాలీవుడ్ స్టార్!ప్రజల సేవకై వెళ్లి పక్షవాత బారిన పడ్డ బాలీవుడ్ స్టార్!bollywood,shika malhotra;shahrukh khan;sonu sood;bollywood;2019;cinema;rajani kanth;media;film industry;industry;doctor;hero;girl;heroine;posters;sharukh khanFri, 08 Jan 2021 15:44:00 GMTచైనాలో పుట్టి ప్రపంచ దేశాలన్నింటిని ఒక్కసారిగా వణికించేసింది కరోనా మహమ్మారి.  కరోనా కారణంగా ఎంతోమంది బ్రతుకులు అతలాకుతలం అయ్యాయి.  ఎన్నో వ్యాపార రంగాలు నష్టపోయాయి. సినీరంగం మొత్తం మూతబడింది. ఇలాంటి విపత్కర సమయంలో ప్రజలు ఎవరు ఎలాంటి వారు అనేది గ్రహించగలిగారు. రాజకీయ పరంగా కానీ,సినీ ఇండస్ట్రీ పరంగా కానీ  ఎవరెవరు ఎంత డబ్బు ఇచ్చారు అనే విషయాన్ని ప్రజలు బాగా గ్రహించగలిగారు.

ప్రభుత్వ సహాయ నిధికి కొంతమంది రాజకీయ నాయకుల నుంచి స్టార్ హీరోల వరకు సహాయం చేశారు. అయితే నేరుగా ప్రజల్లోకి వచ్చి, వారి ఆపదను తెలుసుకొని, వారికి కష్టాల్లో కూడా అండగా నిలిచింది ఒక్క సోనుసూద్ మాత్రమే. ప్రజల కోసం తన ఆస్తిపాస్తులను సైతం అమ్ముకొని,వారి కష్టాలను తీర్చి  రియల్ హీరోగా ఎదిగాడు సోనుసూద్. ఇక ఇదే బాటలోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినా శిఖ మల్హోత్రా  కూడా పేద ప్రజలకు సహాయం చేయాలనే ఆకాంక్షతో వచ్చి ఇప్పుడు తన ప్రాణాల మీదకు తెచ్చుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ హీరో గా నటించిన "ఫ్యాన్ "అనే సినిమా లో ఒక ముఖ్యమైన పాత్రని పోషించి,  ప్రేక్షకుల మదిలో ఎనలేని ప్రేమను సంపాదించుకుంది.మొదటి సినిమాతోనే బాలీవుడ్ ప్రేక్షకులను బాగా అలరించిన ఈ అమ్మాయి, 2019 నుంచి మంచి ఆఫర్లతో సినీ రంగంలో దూసుకుపోతోంది.ఇదిలా ఉండగా కరోనా సమయంలో తన శక్తికి మించి సహాయం కోరిన వారిని ఆదుకుంటూ ముందుకు వెళ్ళింది. ఈమె చేసిన సేవలకు ఎప్పుడూ సోషల్ మీడియాలో ప్రశంసలు పొందుతూనే ఉంది. కోవిడ్ వ్యాధి బారిన పడిన రోగులను రక్షించడానికి ఏకంగా ఈమె బరిలోకి దిగింది. ఒక హాస్పిటల్ లో ఏకంగా నర్స్ అవతారమెత్తి రోగులకు ఏమి చేయాలో అన్నీ చేసింది. చివరకు ఒత్తిడి కారణంగా ఈమెను  పక్షవాతం చుట్టుముట్టింది.

కానీ డాక్టర్లు ఇచ్చిన మెరుగైన వైద్యంతో ఆమె కోలుకొని తిరిగి వచ్చింది. ఆ తరువాత మరలా ప్రజల సేవకై వెళ్ళింది శిఖా మల్హోత్ర.  అయితే మరోసారి పక్షవాతం తిరగబడడంతో పాటు కరోనా కూడా సోకింది.దీనితో ప్రస్తుతం ఈమె నెల రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండి, డాక్టర్ నుండి మెరుగైన సేవలు అందుకుంది. ప్రస్తుతం ఆస్పత్రి నుంచి తిరిగి వచ్చిన  శిఖ మల్హోత్ర సోషల్ మీడియా నుండి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ తన కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను షేర్ చేసింది.ఏది ఏమైనా పక్క వారికి ఏం జరుగుతున్నా  పట్టించుకోని ఈ కాలంలో సోను సూద్,శిఖ మల్హోత్రా లాంటి వారిలో ఇంకా మానవత్వం బ్రతికే ఉందని చెప్పవచ్చు.




విజ‌య‌సాయి ముందు మంత్రి ఆవేద‌న‌.. జ‌గ‌న్‌కు చెపుతాన‌ని ఓదార్పు..!

ఒకేరోజు 9 ఆలయాలకు సీఎం జగన్ భూమి పూజ

ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎం లకు క్లిష్ట పరిస్థితులు...?

జీవ‌తా రాజ‌శేఖ‌ర్ ఎమ్మెల్యేగా పోటీ... ఆ సీటుపైనే గురి పెట్టారా..!

విచార‌ణ‌లో షాకింగ్ విష‌యాలు చెప్పిన అఖిల‌ప్రియ‌

తెలంగాణ‌ను క‌బ‌ళిస్తోన్న బ‌ర్డ్ ఫ్లూ... కోళ్ల బిజినెస్ కుదేలు.. ఏపీలోనూ ఇంత డేంజ‌రా..?

కేజీఎఫ్ 2 టీజ‌ర్ తుస్సుమందే... యూ ట్యూబ్‌లో పేల‌లేదు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>