PoliticsShirishaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modia88eae52-2916-43c1-9bee-04f4ada58f08-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modia88eae52-2916-43c1-9bee-04f4ada58f08-415x250-IndiaHerald.jpgప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరోసారి భేటీ కానున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎంలతో మాట్లాడనున్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్ర ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పనులన్నీ పూర్తి చేసింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న కరోనా అంతానికి వ్యాక్సిన్‌ వచ్చిన నేపథ్యంలో ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు. జనవరి 11వ తేదీన సాయంత్రం 4 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారmodi;modi;india;narendra modi;january;cm;prime minister;central government;narendraకరోనా పై ముఖ్యమంత్రులతో ... ప్రధాని వీడియో కాన్ఫిరెన్స్......!?కరోనా పై ముఖ్యమంత్రులతో ... ప్రధాని వీడియో కాన్ఫిరెన్స్......!?modi;modi;india;narendra modi;january;cm;prime minister;central government;narendraFri, 08 Jan 2021 22:39:55 GMT

ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరోసారి భేటీ కానున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎంలతో మాట్లాడనున్నారు.
కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్ర ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పనులన్నీ పూర్తి చేసింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న కరోనా అంతానికి వ్యాక్సిన్‌ వచ్చిన నేపథ్యంలో ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు. జనవరి 11వ తేదీన సాయంత్రం 4 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎంలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడనున్నారు.

డ్రై రన్‌ విజయవంతమైన నేపథ్యంలో వ్యాక్సిన్‌ పంపిణీకి ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. వ్యాక్సిన్‌ పంపిణీకి శరవేగంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా ప్రధాని సీఎంలతో సమావేశం కానున్నారు. భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌లకు డీసీజీఐ అత్యవసర అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రులతో చర్చించి వ్యాక్సిన్‌ ఎప్పటి నుంచి పంపిణీ చేయాలనే విషయమై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇప్పటికే సీరం ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్‌లు రూపొందించిన కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వ్యాక్సిన్ల పంపిణీకి సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఇప్పటికే డ్రైరన్ నిర్వహించిన విషయం తెలిసిందే.మొదట ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ సమూహాలకు వ్యాక్సిన్ అందజేయడం జరుగుతుందని చెప్పారు. సుమారు 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు.ఈనెల 13 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ చేయనుండగా ఇందుకు సంబంధించి సీఎంలతో చర్చించనున్నారు ప్రధాని. దాంతో పాటు కరోనా వ్యాక్సినేషన్‌ డ్రై రన్‌ లాంటి పలు విషయాలపై ఆరా తీయనున్నారు. క‌రోనా వైర‌స్ ను ఎదుర్కొనే విష‌యంలో లాక్ డౌన్ స‌మ‌యంలో ప‌లుసార్లు సీఎంల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా భేటీ అయిన ప్ర‌ధాని, ఇప్పుడు వ్యాక్సిన్ వ‌చ్చిన త‌రుణంలో మ‌రోసారి భేటీ కాబోతున్నారు.


మహేష్ బాబు తో 'ఒక్కడు - 2' ఫిక్స్ అట .... కానీ ఆయన చేయడం లేదట .....??

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా

దేవాలయాల మీద దాడులు వెనక కుట్ర కోణం...?

నాగార్జున సాగర్ ఫలితం తర్వాతే కాంగ్రెస్ భవిష్యత్ మారబోతుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shirisha]]>