MoviesHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan386da205-8941-414d-8a07-da5add80a498-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan386da205-8941-414d-8a07-da5add80a498-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా కీలక విషయాన్ని బయటపెట్టారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఏ విధంగా వణికిస్తోందో చూస్తూనే ఉన్నాం. సామాన్యుల నుంచి దేశాన్ని నడిపే నాయకుల వరకు ఎవరికి ఈ మహమ్మారి వదల్లేదు. మన తెలుగు ఇండస్ట్రీలోనూ అనేక మంది దిగ్గజాలు ఈ వైరస్ బారిన పడ్డారు. అయితే కరోనా బారిన పడిన వారి జాబితాలో తాను కూడా ఉన్నానని తాజాగా రేణు దేశాయ్ చెప్పారు.pawan kalyan;auto;pawan;ram charan teja;pawan kalyan;ram pothineni;renu desai;varun;varun sandesh;varun tej;hyderabad;cinema;wife;letter;marchకీలక విషయాన్ని బయటపెట్టిన పవన్ కల్యాణ్ భార్యకీలక విషయాన్ని బయటపెట్టిన పవన్ కల్యాణ్ భార్యpawan kalyan;auto;pawan;ram charan teja;pawan kalyan;ram pothineni;renu desai;varun;varun sandesh;varun tej;hyderabad;cinema;wife;letter;marchFri, 08 Jan 2021 17:00:22 GMTహైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా కీలక విషయాన్ని బయటపెట్టారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఏ విధంగా వణికిస్తోందో చూస్తూనే ఉన్నాం. సామాన్యుల నుంచి దేశాన్ని నడిపే నాయకుల వరకు ఎవరికి ఈ మహమ్మారి వదల్లేదు. మన తెలుగు ఇండస్ట్రీలోనూ అనేక మంది దిగ్గజాలు ఈ వైరస్ బారిన పడ్డారు. అయితే కరోనా బారిన పడిన వారి జాబితాలో తాను కూడా ఉన్నానని తాజాగా రేణు దేశాయ్ చెప్పారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, కరోనా బారిన పడ్డాక మెరుగైన చికిత్స తీసుకున్నట్టు ఆమె చెప్పుకొచ్చారు. తాజాగా ఆమె సోషల్ మీడియాలోకి వచ్చి తన అభిమానులతో సంభాషించారు. ఇందులో భాగంగానే ఆమె తనకు కరోనా సోకిన విషయాన్ని బయటపెట్టారు.
కరోనా సోకిందని తెలిసిన వెంటనే షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చేసి పూర్తిగా ఇంటికే పరిమితమయ్యానని రేణు దేశాయ్ చెప్పారు. ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడటంతో మళ్లీ షూటింగ్‌లకు వెళ్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం రేణు దేశాయ్ ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని ఆమె చెప్పారు. ఈ వెబ్ సిరీస్‌తో పాటు మరో క్రేజీ ప్రాజెక్టుకు కూడా తాను ఓకే చెప్పానని అన్నారు. ఈ ప్రాజెక్టులతో పాటు రైతుల మీద తీసే సినిమాలోనూ నటిస్తున్నానని, ఆ సినిమా షూటింగ్ మార్చి నుంచి మొదలుకానున్నట్టు రేణు దేశాయ్ పేర్కొన్నారు. కాగా.. మెగా ఫ్యామిలీలో ఇప్పటికే చాలా మంది కరోనా బారిన పడ్డారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, వరుణ్ తేజ్ కరోనా బారిన పడి కోలుకున్నారు. గతంలో చిరంజీవికి కూడా కరోనా పాజిటివ్ అని వచ్చినప్పటికి మెషిన్ ఫాల్ట్ వల్లే పాజిటివ్ వచ్చినట్టు ఆయన చెప్పారు.


దుర్గగుడి అభివృద్ధి పనులకు శంఖుస్థాపన..!

నాగార్జున సాగర్ ఫలితం తర్వాతే కాంగ్రెస్ భవిష్యత్ మారబోతుందా..?

ఫోన్‌కు వచ్చిన లింక్ ఓపెన్ చేశాడు.. ఐదు నిమిషాల తర్వాత ఒక్కసారిగా షాక్!

రికార్డులను కొల్లగొడుతున్న రాకింగ్ స్టార్ యష్

ఒకేరోజు 9 ఆలయాలకు సీఎం జగన్ భూమి పూజ

ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎం లకు క్లిష్ట పరిస్థితులు...?

జీవ‌తా రాజ‌శేఖ‌ర్ ఎమ్మెల్యేగా పోటీ... ఆ సీటుపైనే గురి పెట్టారా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>