PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jaganffd66e32-ca0f-4de3-8bde-c20b65b1bbc0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jaganffd66e32-ca0f-4de3-8bde-c20b65b1bbc0-415x250-IndiaHerald.jpgజగన్ అధికారంలోకి రాగానే ఒక్కసారిగా మంత్రివర్గం ఏర్పాటు చేసుకుని పాలన మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఒక్కసారే 25 మందితో మంత్రివర్గం ఏర్పాటు చేసుకుని, మంచి మంచి పథకాలు అందిస్తూ, ప్రజల మన్ననలని పొందుతున్నారు. అయితే జగన్ మంత్రివర్గం ఏర్పాటు చేసినప్పుడే, మరో రెండున్నర ఏళ్లలో మళ్ళీ మంత్రివర్గ విస్తరణ చేస్తానని చెప్పారు. అలాగే పనితీరు బాగోని మంత్రులని పక్కనబెట్టి కొత్తవారికి అవకాశం కల్పిస్తానని చెప్పారు. jagan;jr ntr;godavari river;krishna river;jagan;andhra pradesh;west godavari;cabinet;mantraకృష్ణా-వెస్ట్-ఈస్ట్‌ల్లో ఒకో వికెట్ ఔట్...వాళ్ళు డౌటే...కృష్ణా-వెస్ట్-ఈస్ట్‌ల్లో ఒకో వికెట్ ఔట్...వాళ్ళు డౌటే...jagan;jr ntr;godavari river;krishna river;jagan;andhra pradesh;west godavari;cabinet;mantraFri, 08 Jan 2021 00:00:00 GMTజగన్ అధికారంలోకి రాగానే ఒక్కసారిగా మంత్రివర్గం ఏర్పాటు చేసుకుని పాలన మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఒక్కసారే 25 మందితో మంత్రివర్గం ఏర్పాటు చేసుకుని, మంచి మంచి పథకాలు అందిస్తూ, ప్రజల మన్ననలని పొందుతున్నారు. అయితే జగన్ మంత్రివర్గం ఏర్పాటు చేసినప్పుడే, మరో రెండున్నర ఏళ్లలో మళ్ళీ మంత్రివర్గ విస్తరణ చేస్తానని చెప్పారు. అలాగే పనితీరు బాగోని మంత్రులని పక్కనబెట్టి కొత్తవారికి అవకాశం కల్పిస్తానని చెప్పారు.

ఇక జగన్ అధికారంలోకి వచ్చి దాదాపు 19 నెలలు కావొస్తుంది. అంటే మరో 11 నెలల్లో జగన్ మంత్రివర్గ విస్తరణ చేయనున్నారు. ఇక ఈసారి జగన్ కేబినెట్‌లో ఛాన్స్ కొట్టేయలని సీనియర్, జూనియర్ ఎమ్మెల్యేలు చూస్తున్నారు. అలాగే తమ పదవులని కాపాడుకోవాలని కేబినెట్‌లో ఉన్నవారు చూస్తున్నారు. అయితే ఎలా చూసుకున్న పలువురు మంత్రులకు ఉద్వాసన తప్పదని తెలుస్తోంది.

అందులో ముఖ్యంగా కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు జగన్ కేబినెట్ నుంచి ఔట్ అవ్వక తప్పదని తెలుస్తోంది. ఈ మూడు జిల్లాల్లో ముగ్గురు చొప్పున జగన్ కేబినెట్‌లో ఉన్నారు. ఇక ఇక్కడ కృష్ణా జిల్లాలో ముగ్గురు మంత్రుల్లో ఒకరు మంచి పనితీరు కనబర్చడం లేదని తెలుస్తోంది. ఇక ఆయనకు నెక్స్ట్ పదవి ఊడిపోవడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. అలాగే పశ్చిమ గోదావరిలో ముగ్గురు మంత్రుల పనితీరుపై సంతృప్తిగా లేనట్లుగా తెలుస్తోంది. కాకపోతే వారిలో ఒకరిని మాత్రం కేబినెట్ నుంచి తప్పించే అవకాశాలున్నాయని అంటున్నారు.

అటు తూర్పు గోదావరిలో సైతం ఒక మంత్రికి ఎర్త్ పెట్టడం ఖాయమని తెలుస్తోంది. ఇలా మూడు జిల్లాల్లో ఒకో వికెట్ పడటం ఖాయమని ఏపీ పోలిటికల్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. అలాగే రాష్ట్రంలో ఉన్న మహిళా మంత్రుల పదవులు కూడా డౌటే అని అంటున్నారు. వారిలో కూడా ఒకరు లేదా ఇద్దర్ని కేబినెట్ నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి జగన్ కేబినెట్‌లో ఎవరికి ఛాన్స్ లేకుండా పోతుందో.      




వీరిద్దరూ భార్యాభర్తలు.. విడాకులు కూడా తీసుకున్నారని ఎంతమందికి తెలుసు?

అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?

తెరాస పార్టీ బీజేపీ ని కాకుండా బండి ని టార్గెట్ చేయడంలో మర్మం ఏంటి..?

ఐటీఐఆర్ ప్రాజెక్టును పునరుద్దరించండి

తిరుపతిలో వైసీపీ ఓడిపోతుందా...?

ఎమ్మెల్యేలను పిలుస్తున్న జగన్... షాక్ ఇస్తారా...?

వైసీపీతో స్నేహం చేసే నేతల మీద బిజెపి సీరియస్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>