TechnologyP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/cybercrimes0d72dd7e-7539-454c-9856-c724d7aa62e2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/cybercrimes0d72dd7e-7539-454c-9856-c724d7aa62e2-415x250-IndiaHerald.jpgటెక్నాలజీ పెరుగుతూ పోవడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. కానీ.. ఇదే సమయంలో లాభాలతో పాటు నష్టాలు కూడా అదే విధంగా ఎదురవుతున్నాయి. ప్రస్తుతం టెక్నాలజీ దూసుకుపోతుండగా.. మరోపక్క సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అమాయకులే లక్ష్యంగా చేసుకుంటూ దుండగులు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.cybercrimes;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;rbi;smart phone;bengaluru 1ఫోన్‌కు వచ్చిన లింక్ ఓపెన్ చేశాడు.. ఐదు నిమిషాల తర్వాత ఒక్కసారిగా షాక్!ఫోన్‌కు వచ్చిన లింక్ ఓపెన్ చేశాడు.. ఐదు నిమిషాల తర్వాత ఒక్కసారిగా షాక్!cybercrimes;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;rbi;smart phone;bengaluru 1Fri, 08 Jan 2021 17:40:34 GMTటెక్నాలజీ పెరుగుతూ పోవడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. కానీ.. ఇదే సమయంలో లాభాలతో పాటు నష్టాలు కూడా అదే విధంగా ఎదురవుతున్నాయి. ప్రస్తుతం టెక్నాలజీ దూసుకుపోతుండగా.. మరోపక్క సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అమాయకులే లక్ష్యంగా చేసుకుంటూ దుండగులు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఫోన్లకు వివిధ లింకులు పంపించడం లేదంటే వివిధ దేశాలకు చెందిన ఫోన్ నెంబర్ల నుంచి ఫోన్లు చేయడం వంటివి చేసి వారిని నట్టేటా ముంచేస్తున్నారు. ముఖ్యంగా వీరంతా డబ్బులు కాజేయడానికే ఇవన్నీ చేస్తున్నారు. వీరి బారిన ఇప్పటికే కొన్ని వేల మంది పడినట్టు లెక్కలు చెబుతున్నాయి. మరోపక్క ప్రజలు కూడా టెక్నాలజీపై పెద్దగా పట్టు లేకపోవడం, ఫోనుకు వస్తున్న లింకులు ఎటువంటివో తెలియకపోవడం వల్ల వీరి చేతికి వెంటనే చిక్కుకుపోతున్నారు. లక్షలకు లక్షలు సైబర్ నేరగాళ్లు వీరి నుంచి దోచేస్తున్నారు.

తాజాగా ఇటువంటి మరో సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. బెంగళూరుకు చెందిన ఓ 65 ఏళ్ల వృద్దుడు ఫోన్ కు వచ్చిన అన్‌నోన్ లింక్‌ను తెలియక క్లిక్ చేసి ఒక యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నాడు. ఆ యాప్ ద్వారా విమానం టికెట్ బుక్ చేసుకోవాలని అనుకున్నాడు. టికెట్ అయితే బుక్ కాలేదు కాని.. ఒక ఐదు నిమిషాల తర్వాత బ్యాంకు నుంచి అయితే మెసేజ్ వచ్చింది. అకౌంట్ నుంచి రూ. 7 లక్షలు డెబిట్ అయినట్టు మెసేజ్ చూసిన సదరు వ్యక్తి ఒక్కసారిగా షాకయ్యాడు. డబ్బులు ఎందుకు కట్ అయ్యాయో కూడా తెలియక సతమతమైపోయాడు. ఇటువంటి నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. 2019తో పోల్చితే 2020లో ఇటువంటి సైబర్ నేరాలు 30 శాతం పెరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి.

లాక్ డౌన్ సమయంలో మరీ విపరీతంగా పెరిగిపోయాయని, ప్రజలు ఈ సమయంలో ఫోన్లకు ఎక్కువగా అతుక్కుపోవడం వల్ల సైబర్ నేరగాళ్లు కూడా నేరాలు ఎక్కువగా చేస్తూ వచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా చాలా మంది ఈ లాక్ డౌన్ సమయంలో ఆన్ లైన్ గేమ్స్‌పై ఎక్కువగా ఆసక్తి కనబర్చినట్టు అధ్యయనాలు వెల్లడించాయి. కొత్త కొత్త గేమ్స్‌ను ఇన్ స్టాల్ చేసుకుని ఆడుకుందామనుకునే లోపే వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు ఖాళీ అయిపోతున్నాయి. కనీసం ఫోన్లకు ఓటీపీలు కూడా రాకుండానే బ్యాంకులో డబ్బు పోతోందంటే ఈ సైబర్ నేరగాళ్లు ఎంత అడ్వాన్స్‌డ్‌గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. తెలియని లింక్స్ కాని, యాప్స్ కాని ఓపెన్ చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలని, ఆయా యాప్స్ గురించి ముందుగా పరిశోధన చేయాలంటూ నిపుణులు సూచిస్తున్నారు.


దుర్గగుడి అభివృద్ధి పనులకు శంఖుస్థాపన..!

నాగార్జున సాగర్ ఫలితం తర్వాతే కాంగ్రెస్ భవిష్యత్ మారబోతుందా..?

ఇకపై ప్రతీ పరీక్ష ఆన్ లైన్ లోనే..!

రికార్డులను కొల్లగొడుతున్న రాకింగ్ స్టార్ యష్

కీలక విషయాన్ని బయటపెట్టిన పవన్ కల్యాణ్ భార్య

ఒకేరోజు 9 ఆలయాలకు సీఎం జగన్ భూమి పూజ

ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎం లకు క్లిష్ట పరిస్థితులు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>