TechnologyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/technology/sports_videos/2020lo-kuda-sarikotha-technology-tho-mundhuku-tabothunna-mg-samstha1b0cc9d1-1817-4e16-8099-26ba2b51f768-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/technology/sports_videos/2020lo-kuda-sarikotha-technology-tho-mundhuku-tabothunna-mg-samstha1b0cc9d1-1817-4e16-8099-26ba2b51f768-415x250-IndiaHerald.jpgఎం జి వాహన తయారీదారు సంస్థ ఇప్పటికే 2021వ సంవత్సరపు కానుకగా భారత్ లోకి రెండు 7 సీటర్ కార్లను విడుదల చేసింది. ఎంజి హెక్టర్ ఫేస్ లిప్ట్ -రూ.12.89 లక్షలు హెక్టర్ ప్లస్ సెవెన్ సీటర్ ఎస్ యు వి -రూ.13.34 లక్షలు. అయితే ఈ రెండు కార్లు సరికొత్త టెక్నాలజీతో, ఇంప్రూవ్ ఫీచర్డ్ తో భారత్లోకి ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఈ కార్లను డీలర్లకు, అధికారిక వెబ్ సైట్ లో బుకింగ్ కోసం ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. అయితే త్వరలోనే డెలివరీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. mg electric car;technology;rajeev;vidya;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;india;norway;electricity;king;petrol;diesel;king 1;allu ayaan;v2022 లో కూడా సరికొత్త టెక్నాలజీతో ముందుకు రాబోతున్న ఎంజి మోటార్!2022 లో కూడా సరికొత్త టెక్నాలజీతో ముందుకు రాబోతున్న ఎంజి మోటార్!mg electric car;technology;rajeev;vidya;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;india;norway;electricity;king;petrol;diesel;king 1;allu ayaan;vFri, 08 Jan 2021 03:00:00 GMTభారత్ లోకి  రెండు  7 సీటర్ కార్లను విడుదల చేసింది.
ఎంజి హెక్టర్ ఫేస్ లిప్ట్ -రూ.12.89 లక్షలు
హెక్టర్ ప్లస్ సెవెన్ సీటర్ ఎస్ యు వి -రూ.13.34 లక్షలు.  అయితే ఈ రెండు కార్లు సరికొత్త టెక్నాలజీతో, ఇంప్రూవ్ ఫీచర్డ్ తో భారత్లోకి ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఈ కార్లను డీలర్లకు, అధికారిక వెబ్ సైట్ లో బుకింగ్ కోసం ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. అయితే త్వరలోనే డెలివరీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.

కొత్తగా భారత్ మార్కెట్లోకి వచ్చి వినూత్నమైన టెక్నాలజీతో సామాన్యులకు కూడా అందుబాటులోకి తెస్తోంది ఎంజి సంస్థ. అయితే ఇప్పుడు మరోసారి 2022 వ సంవత్సరం కానుకగా ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టబోతున్నామని ముందే ప్రకటించింది. అయితే మొన్నటి వరకు నార్వే దేశం 2025 వ సంవత్సరం నాటికి పూర్తిగా డీజిల్,పెట్రోల్ తో నడిచే కార్లను నిలిపివేయాలని ఆశిస్తున్నట్టు చెప్పింది. వాటికి బదులుగా ఎలక్ట్రికల్ కార్లను పరిచయం చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే.

ప్రస్తుతం మన భారతదేశంలో కూడా 2022 వ సంవత్సరం నుంచే, ఎలక్ట్రిక్ కార్ల వినియోగం మొదలవుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఎంజి సంస్థ భారత్లో రూ. 20 లక్షల లోపే ఎలక్ట్రిక్ కార్లను ఆవిష్కరిస్తామని వెల్లడించింది. కానీ విద్యుత్ కార్లను ఉపయోగించడంలో ఎదురయ్యే అతి పెద్ద సమస్య చార్జింగ్. ఎక్కడికైనా దూరప్రయాణాలు చేయాలన్నప్పుడు చార్జింగ్ కంపల్సరీ అవుతుంది. ప్రస్తుతం మనకున్న అతి తక్కువ కెపాసిటర్ బ్యాటరీతో అంత దూర ప్రయాణాలను చేయలేము. ఎంజి సంస్థ వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యను పరిష్కరించడానికి సరి కొత్త టెక్నాలజీ తో మన ముందుకు రాబోతుంది.

ఇందుకు కావలసినది 500 కిలోమీటర్ల వరకు పనిచేసే  లిథియం  - అయాన్ బ్యాటరీ రూపొందించడమే. అయితే ప్రస్తుతం ఈ బ్యాటరీలను అమర్చాలని ఎంజి సంస్థ ప్రయత్నిస్తోంది. దీనిని ఉద్దేశించి ఎంజి మోటార్ ఇండియా ఎండి రాజీవ్ చాబా మాట్లాడుతూ "వచ్చే ఏడాది చివర్లో 20 లక్షల శ్రేణిలో ఎలక్ట్రిక్ కార్లను  విడుదల చేయాలనుకుంటున్నాం.  భారత్ లో సూపర్ ఫాస్ట్ చార్జర్ లో నెట్వర్క్ ను రూపొందించడానికి టాటా పవర్ తో కలిసి పెట్టుబడులు పెట్టబోతున్నాము. ఈ చివరి ఏడాది నాటికి 30 నుంచి 40 సూపర్ చార్జర్ లు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.


టీడీపీ ఎమ్మెల్యేల జంపింగ్ మళ్ళీ మొదలు....

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. ఏంటంటే..

రైతు సంఘాలతో కేంద్ర సమావేశం.. ఏం మాట్లాడారంటే..

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>