PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jdu-mla-hot-comments-on-bihar-cm-postebbd01bd-12d7-467e-8db4-5816b56f55cb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jdu-mla-hot-comments-on-bihar-cm-postebbd01bd-12d7-467e-8db4-5816b56f55cb-415x250-IndiaHerald.jpgబీహార్‌ రాజకీయాల్లో మరో ట్విస్ట్ వెలుగుచూసింది.అధికార జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో ఆరు నెలల్లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటారంటూ చెప్పారు. ఆ తర్వాత ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని కూడా జేడీయూ కీలక నేత చెప్పడం ఆసక్తిగా మారింది. జేడీయూ సీనియర్ నేత , ఎమ్మెల్యే గోపాల్ మండల్, బిహ్‌పూర్ ఎమ్మెల్యే శైలేంద్ర మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో ఈ విషయం వెలుగుచూసింది.tejshwi yadav;kumaar;rohit;bharatiya janata party;bhagalpur;nitish kumar;district;smart phone;government;bihar;chief minister;assembly;mla;november;audio6 నెలల్లో తేజస్వినే బీహార్ సీఎం !6 నెలల్లో తేజస్వినే బీహార్ సీఎం !tejshwi yadav;kumaar;rohit;bharatiya janata party;bhagalpur;nitish kumar;district;smart phone;government;bihar;chief minister;assembly;mla;november;audioFri, 08 Jan 2021 20:04:34 GMTఎమ్మెల్యే గోపాల్ మండల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో ఆరు నెలల్లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటారంటూ చెప్పారు. ఆ తర్వాత ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని కూడా జేడీయూ కీలక నేత  చెప్పడం ఆసక్తిగా మారింది.  జేడీయూ సీనియర్ నేత , ఎమ్మెల్యే గోపాల్ మండల్, బిహ్‌పూర్ ఎమ్మెల్యే  శైలేంద్ర మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో ఈ విషయం వెలుగుచూసింది.

బీజేపీ జిల్లా చీఫ్ రోహిత్ పాండేపైనా మండల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. భాగల్పూర్ నుంచి బరిలోకి దిగిన రోహిత్ పాండే ఓడిపోయారు. అయితే తాను ప్రచారం చేసిన కూటమి అభ్యర్థులు విజయం సాధించారని, రోహిత్‌కు చాలా పొగరని, అందుకే తాను ఆయన కోసం ప్రచారం చేయలేదని అందులో మాట్లాడారు గోపాల్ మండల్. మండల్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో  అధికార జేడీయూ-బీజేపీ కూటమిలో కలకలం రేగింది.  దీంతో జేడీయూ నేతలు అప్రమత్తమై  గోపాల్ మండల్ తో వివరణ ఇప్పించారు.  ఆ ఆడియో తనది కాదని చెప్పుకొచ్చారు మండల్. ఎమ్మెల్యే శైలేంద్ర ఈ ఆడియోను వైరల్ చేశారని, ఇదెక్కడి పద్ధతని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

          జేడీయూ ఎమ్మెల్యే ల మధ్య సాగిన ఆడియో మాటలు ఇప్పుడు బీహార్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గత నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బోటాబోటి మెజార్టీతోనే అధికారంలోకి వచ్చింది జేడీయూ-బీజేపీ కూటమి. బీజేపీనే ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలిచినా.. ముందే ఇచ్చిన హామీ ప్రకారం జేడీయూ అధినేత నితీష్ కుమార్ కే ముఖ్యమంత్రి పీఠం దక్కింది. అయితే ప్రభుత్వంలో బీజేపీ హవానే సాగుతుందనే చర్చ జరుగుతోంది. జేడీయూ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు జేడీయూ ఎమ్మెల్యేలు ఆర్జేడీలోకి చేరవచ్చనే ప్రచారం జరుగుతోంది. అందుకు బలం చేకూర్చేలా ఉన్న జేడీయూ ఎమ్మెల్యేల ఆడియో లీక్ కావడంతో... బీహార్ లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.


ఈ దెబ్బతో తెలంగాణ లో కాంగ్రెస్ పని అయిపోయినట్లేనా..?

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా

దేవాలయాల మీద దాడులు వెనక కుట్ర కోణం...?

నాగార్జున సాగర్ ఫలితం తర్వాతే కాంగ్రెస్ భవిష్యత్ మారబోతుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>