MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/summer-movie-seasond1227efc-9922-4cfa-b687-dd88dd7dc90f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/summer-movie-seasond1227efc-9922-4cfa-b687-dd88dd7dc90f-415x250-IndiaHerald.jpgకెరీర్ మొదట్లో పుంజుకుని తరువాత చతికిల బడ్డ హీరోలు కొందరైతే, కెరీర్ నుండి మంచి సాలిడ్ హిట్ లేక ఇబ్బందిపడుతుంది మరొకరు. ఈ వేసవిని నమ్ముకుని వస్తున్న కొందరి హీరోల సినిమాలు వారికీ మంచి బ్రేక్ ను ఇస్తాయా...? తెలియాలంటే వేసవి దాకా ఆగాల్సిందే అంటున్నారు కుర్ర హీరోలు.summer movie season;sports;akhil akkineni;bhaskar;karthikeya;kartikeya;nageshwara rao akkineni;sai dharam tej;sandeep;sundeep kishan;vedhika;cinema;baba bhaskar;cinema theater;press;central government;yuva;nagashaurya;solo bathuke so betterఆ హీరోలకు సమ్మర్ సీజన్ కలిసొస్తుందా...?ఆ హీరోలకు సమ్మర్ సీజన్ కలిసొస్తుందా...?summer movie season;sports;akhil akkineni;bhaskar;karthikeya;kartikeya;nageshwara rao akkineni;sai dharam tej;sandeep;sundeep kishan;vedhika;cinema;baba bhaskar;cinema theater;press;central government;yuva;nagashaurya;solo bathuke so betterFri, 08 Jan 2021 14:00:00 GMTసినిమా హాళ్లు అన్నీ మూత పడడంతో... షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలన్నీ వేరే దారి లేక ఓటీటీ బాట పడ్డాయి. కరోనా కష్ట సమయంలో ఏవైనా సంస్థలు లాభదాయకం పొందాయి అంటే..?? అవి ఓటీటీ వేదిక లనే చెప్పాలి. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి... కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో 50 శాతం సీటింగ్ ఆక్యుపెన్సీ తో థియేటర్లు తెరుచుకున్నాయి.

కరోనా కొనసాగుతున్న పరిస్థితుల్లో... అసలు జనం థియేటర్ ముఖం చూస్తారా లేదా అన్న ప్రశ్న మొదట్లో ఉండేది.... కానీ సాయి ధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్... సినిమా విడుదల కావడంతో ఆ అనుమానాలన్నీ తొలగిపోయాయి. కరోనా తీవ్రతకు ముందున్నంత కోలాహలం లేకపోయినా..... జనం థియేటర్లకు బాగానే వచ్చారు. దాంతో మిగిలిన హీరోలంతా తమ తమ సినిమాలను శరవేగంగా పూర్తి చేసుకుని మెగా మూవీ సీజన్ సమ్మర్ లో బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. వారి చిత్రాలను థియేట్రికల్ రిలీజ్ చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు.  ఇంతకీ సమ్మర్ ని టార్గెట్ చేసుకున్న హీరోలు ఎవరు వాళ్ళు సినిమాలు ఏంటో చూద్దాం....

అయితే కెరీర్ మొదట్లో పుంజుకుని తరువాత చతికిల బడ్డ హీరోలు కొందరైతే, కెరీర్ నుండి మంచి సాలిడ్ హిట్ లేక ఇబ్బందిపడుతుంది మరొకరు. ఈ వేసవిని నమ్ముకుని వస్తున్న కొందరి హీరోల సినిమాలు వారికీ మంచి బ్రేక్ ను ఇస్తాయా...? తెలియాలంటే వేసవి దాకా ఆగాల్సిందే అంటున్నారు కుర్ర హీరోలు. ఆ సినిమాలలో ముఖ్యంగా  అక్కినేని అఖిల్ - పూజాహెగ్డే జంటగా నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది ఆ చిత్ర బృందం. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అదే విధంగా ఈ మధ్య కాలంలో కాస్త వెనకబడ్డ...సందీప్ కిషన్ నటించిన స్పోర్ట్స్ డ్రామా 'ఏ1ఎక్స్ ప్రెస్', యువ నటుడు కార్తికేయ హీరోగా నటించిన 'చావు కబురు చల్లగా' సినిమా, ఆరడుగుల అందగాడు నాగశౌర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'వరుడు కావలెను' సినిమా . వీరందరూ మళ్ళీ ఫామ్ లోకి రావాలని ఆశిద్దాం.


సెటైర్ : తొడ కొట్టమంటావా బావా..? చూచుకో నా పెతాపం !

విచార‌ణ‌లో షాకింగ్ విష‌యాలు చెప్పిన అఖిల‌ప్రియ‌

తెలంగాణ‌ను క‌బ‌ళిస్తోన్న బ‌ర్డ్ ఫ్లూ... కోళ్ల బిజినెస్ కుదేలు.. ఏపీలోనూ ఇంత డేంజ‌రా..?

కేజీఎఫ్ 2 టీజ‌ర్ తుస్సుమందే... యూ ట్యూబ్‌లో పేల‌లేదు...!

బాల‌య్య ఇదేం గోల‌య్యా... వైసీపీకి ఎంత లాభం చేశావో చూడు...!

కేంద్రంతో కేటీఆర్ యుద్ధం.. దేనికి సంకేతం..?

నేను వైసీపీ కార్యకర్తనే... మీకు అభ్యంతరం ఏంటి ? - రాపాక సంచలన వ్యాఖ్యలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>