SportsSreekanth Eeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/smith39d5ae9b-21be-44b5-8291-b343d7be2896-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/smith39d5ae9b-21be-44b5-8291-b343d7be2896-415x250-IndiaHerald.jpgబోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ సెంచరీ చేసాడు. ఈ శతకంతో తన టెస్టు కెరీర్ లో 27వ సెంచరీని నమోదు చేసినస్మిత్ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సరసన నిలిచాడు. కాగా టెస్టు క్రికెట్ లో 51 సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉన్నాడు.smith;rahul new;rahul;virat kohli;k l rahul;cricket;ravindra jadeja;australia;sri lanka;rahul sipligunj;international;steve smith;kollu ravindra;dookudu;paruguకోహ్లీ రికార్డును సమం చేసిన స్మిత్‌కోహ్లీ రికార్డును సమం చేసిన స్మిత్‌smith;rahul new;rahul;virat kohli;k l rahul;cricket;ravindra jadeja;australia;sri lanka;rahul sipligunj;international;steve smith;kollu ravindra;dookudu;paruguFri, 08 Jan 2021 21:04:08 GMTక్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డును ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ సమం చేశాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో  సెంచరీ చేసిన స్టీవ్ స్మిత్ తన టెస్టు కెరీర్ లో 27వ సెంచరీని నమోదు చేశాడు. దీంతో ప్రపంచ టెస్టు క్రికెట్ లో 27 సెంచరీలు చేసిన టీమిండియా కెప్టెన్ కోహ్లీ సరసన స్మిత్ నిలిచాడు.

కాగా కోహ్లీ, స్మిత్ లతో పాటు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్రేమ్ స్మిత్, ఆసీస్ మాజీ క్రికెటర్ అలెన్ బోర్డర్ కూడా టెస్టుల్లో 27 సెంచరీలు నమోదు చేసారు.  కాగా అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లో 51 శతకాలతో భారత మాజీ ఆటగాడు సచిన టెండూల్కర్ అగ్ర స్థానంలో ఉండగా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు కలీస్ (45 సెంచరీలు) ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (41 సెంచరీలు) శ్రీలంక మాజీ సారథి కుమార సంగక్కర (38 సెంచరీలు) భారత మాజీ ఆటగాడు రాహుల్ ద్రావిడ్ (36 సెంచరీలు) లు  మొదటి ఐదు స్థానాల్లో  కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆడుతున్న క్రికెటర్లను పరిశీలలోకి తీసుకుంటే  కోహ్లీ, స్మిత్ లు మొదటి స్థానంలో ఉన్నారు.

 కాగా  బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో ఆడిన తొలి రెండు టెస్టుల్లో స్మిత్ ఘోరంగా విఫలమైన సంగతి తెల్సిందే. మొదటి టెస్టు అడిలైడ్‌లో(1, 1*), మెల్‌బోర్న్‌లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో (0, 8) పరుగులు మాత్రమే చేసాడు. కాగా గురువారం ప్రారంభమైన మూడో టెస్టులో 131 పరుగులు చేసి ఆసీస్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మొదటి నుంచే దూకుడుగా ఆడుతూ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేసాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా చివరి వరకు క్రీజులో నిలదొక్కుకున్నాడు. అయితే రవీంద్ర జడేజా మెరుపు త్రో విసరడంతో స్మిత్ చివరి వికెట్ గా వెనుదిరిగాడు. 


ట్రంప్ కు వెన్నుపోటు..ఇలా జరుగుతుందని ఊహించలేదేమో..!!

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా

దేవాలయాల మీద దాడులు వెనక కుట్ర కోణం...?

నాగార్జున సాగర్ ఫలితం తర్వాతే కాంగ్రెస్ భవిష్యత్ మారబోతుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sreekanth E]]>