PoliticsSiva Prasadeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/the-incident-gave-relief-to-the-ruling-party7026fa52-84d2-4eeb-9999-deaf4bcaec97-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/the-incident-gave-relief-to-the-ruling-party7026fa52-84d2-4eeb-9999-deaf4bcaec97-415x250-IndiaHerald.jpgతెలంగాణలో అఖిల ప్రియ వివాదం ఒకరకంగా చెప్పాలంటే సీఎం జగన్ కు, వైసీపీ ప్రభుత్వానికి కాస్తా ఊరట నిచ్చిందనే చెప్పొచ్చు. భూవివాదం, కిడ్నాప్ కేసులో నిందితురాలిగా జైలుకెళ్లిన అఖిల ప్రియ టీడీపీకి చెందిన నేత. తొలుత వైసీపీ నుంచి రాజకీయ రంగప్రవేశం చేసిన అఖిల ప్రియ తదనంతరి కాలంలో టీడీపీలో చేరి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా కూడా పనిచేశారు.jaganmohan reddy;tara;jagan;andhra pradesh;2019;bhuma akhila priya;rayalaseema;minister;ycp;party;bhuma nagi reddyజగన్ కు కలిసొచ్చిన అఖిల అరెస్టుజగన్ కు కలిసొచ్చిన అఖిల అరెస్టుjaganmohan reddy;tara;jagan;andhra pradesh;2019;bhuma akhila priya;rayalaseema;minister;ycp;party;bhuma nagi reddyFri, 08 Jan 2021 12:41:40 GMTఅఖిల ప్రియ వివాదం ఒకరకంగా చెప్పాలంటే సీఎం జగన్ కు, వైసీపీ ప్రభుత్వానికి కాస్తా ఊరట నిచ్చిందనే చెప్పొచ్చు. భూవివాదం, కిడ్నాప్ కేసులో నిందితురాలిగా జైలుకెళ్లిన అఖిల ప్రియ టీడీపీకి చెందిన నేత. తొలుత వైసీపీ నుంచి రాజకీయ రంగప్రవేశం చేసిన  అఖిల ప్రియ తదనంతరి కాలంలో టీడీపీలో చేరి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా కూడా పనిచేశారు.
                                 ఆనాడు ప్రతిపక్ష వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ వ్యవహారాల్లో ప్రాధాన్యత ఇచ్చిన వైఎస్సార్‌సీపీని కాదని భూమా నాగిరెడ్డి, అఖిల టీడీపీలో చేరారు. మంత్రి పదవి ఆశతో టీడీపీలోకి వెళ్లిన నాగిరెడ్డికి చంద్రబాబు చేతిలో ఆశాభంగం తప్పలేదు. మంత్రి పదవి రాకపోవడం, టీడీపీలో ప్రాధాన్యత లేకపోవడంతో రోజూ నాగిరెడ్డి కుమిలిపోయేవాడని అనుచరులు చెబుతారు. దీంతోనే గుండెపోటు వచ్చి మృతి చెందారని అప్పట్లో తీవ్ర చర్చ నడిచింది. నాగిరెడ్డి మృతి తర్వాత విమర్శల జడిని తప్పించుకునేందుకు చంద్రబాబు అఖిలకు మంత్రి పదవి కట్టబెట్టి, అంతగా ప్రాధాన్యత లేని పర్యాటకశాఖను కట్టబెట్టారు. ఆపై భార్గవ్‌రామ్‌ ను అఖిల వివాహం చేసుకున్నారు. తదనంతరం 2019 ఎన్నికల్లో అఖిల ప్రియ ఓడిపోయారు.
                                    హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి భూ వివాదంలో కేసీఆర్‌ బంధువులను కిడ్నాప్‌ చేసిన వ్యవహారంలో అఖిలకు 14రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ ఘటన జిల్లాలో తీవ్ర చర్చకు దారి తీసింది. కిడ్నాప్‌ వ్యవహారంలో ఓ మాజీ మహిళా మంత్రి జైలుకు వెళ్లడం ‘సీమ’ రాజకీయాల్లో ఇదే ప్రథమమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఓటమి తర్వాత రాజకీయంగా దెబ్బతిన్న అఖిలప్రియకు ఈ పరిణామం మాత్రం కోలుకోలేని దెబ్బ. అయితే ఆంధ్రప్రదేశ్ లో విగ్రహాల ధ్వంసంలో వైసీపీపీ విరుచుకుపడుతున్న టీడీపీకి అఖిల వ్యవహారం తలనొప్పిగా మారింది. చంద్రబాబు పాలనలో మంత్రిగా ఉన్న అఖిల పక్క రాష్ర్టంలో నిందితురాలిగా జైలుకెళ్లడం పార్టీని అప్రదిష్టపాలు చేసినట్లయింది. దీంతో చంద్రబాబు స్వరం తగ్గిందనే చెప్పాలి. తన పార్టీ నుంచి వెళ్లాక అఖిలకు ఇటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి జగన్ కు కలిసొచ్చే అంశమే అవుతుంది.  


తెలంగాణ‌ను క‌బ‌ళిస్తోన్న బ‌ర్డ్ ఫ్లూ... కోళ్ల బిజినెస్ కుదేలు.. ఏపీలోనూ ఇంత డేంజ‌రా..?

కేజీఎఫ్ 2 టీజ‌ర్ తుస్సుమందే... యూ ట్యూబ్‌లో పేల‌లేదు...!

బాల‌య్య ఇదేం గోల‌య్యా... వైసీపీకి ఎంత లాభం చేశావో చూడు...!

కేంద్రంతో కేటీఆర్ యుద్ధం.. దేనికి సంకేతం..?

నేను వైసీపీ కార్యకర్తనే... మీకు అభ్యంతరం ఏంటి ? - రాపాక సంచలన వ్యాఖ్యలు

జో బైడెన్ గెలిచిన వెంటనే.. ఉత్తర కొరియా అధ్యక్షుడు ఏం చేశాడో చూడండి

కొత్త తరహా మోసాల నేపధ్యంలో బ్యాంకు కష్టమర్లకు RBI హెచ్చరికలు...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Siva Prasad]]>