PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-vaccine925846d0-5fa4-4b66-af36-4ebaeba82985-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-vaccine925846d0-5fa4-4b66-af36-4ebaeba82985-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారిని అరికట్టాలంటే ఉన్న మార్గం ఒక్క వ్యాక్సినే.. ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ ని అందించటం ద్వారా దీన్ని కట్టడి చేయొచ్చు.. అందుకే ఇప్పటికే దేశంలో రెండు టీకాలకు డీసీజీఐ అనుమతించింది. మరో వారం రోజుల్లో వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నట్టు ప్రకటించింది కూడా. వ్యాక్సిన్ పంపిణీలో లోపాలను గుర్తించేందుకు దేశవ్యాప్తంగా డ్రై రన్ కూడా నిర్వహిస్తున్నారు. వ్యాక్సినేషన్ సమయంలో ఏ ఏ సమస్యలు వస్తాయన్న విషయాలను ఈ డ్రై రన్ లో పరిశీలించి వాటిని పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. అయితే ఇంత వరకూ బాగానే ఉన్నా.corona-vaccine;heartఓ వైపు వ్యాక్సిన్ వస్తున్నా.. ఈ వార్త గుండె దడ పెంచుతోందిగా..?ఓ వైపు వ్యాక్సిన్ వస్తున్నా.. ఈ వార్త గుండె దడ పెంచుతోందిగా..?corona-vaccine;heartFri, 08 Jan 2021 07:00:00 GMT
అయితే ఇంత వరకూ బాగానే ఉన్నా.. తాజాగా దేశంలో కరోనా కేసులు పెరుగుదల మరోసారి భయం పెంచుతోంది. ప్రత్యేకించి నాలుగు రాష్ట్రాల్లో ఈ కేసుల పెరుగదల అనూహ్యంగా ఉంది. ఈ కేసుల పెరుగుదలపై ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. కొత్త సంవత్సర వేడుకల్లో కొందరు నిబంధనలను ఉల్లంఘించి యథేచ్ఛగా పాల్గొన్నారు. దాని ప్రభావం పాజిటివ్‌ల పెరుగుదలపై కనిపిస్తోందని అంచనా వేస్తున్నారు.

ఈ వైరస్ వ్యాప్తికి చలి తీవ్రత కూడా వైరస్‌ వ్యాప్తికి కారణం కావచ్చు. అంతే కాదు.. ఇటీవల ప్రజలకు కరోనా అంటే భయం తగ్గిపోయింది. తాజాగా రెండు యూకే వైరస్‌ కేసులు రాష్ట్రంలో వెలుగుచూసినా జనం పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ.. ప్రజలు ఇలా నిర్లక్ష్యంగా ఉంటే వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జనం కరోనా పనైపోయిందనుకోవద్దని..  అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని సూచిస్తున్నారు.

తాజాగా కేసుల్లో పెరుగుదల కూడా నిబంధనలు గాలికొదిలేయడం వల్లనే వచ్చింది. కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో వైరస్‌ ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందనిఎక్కువ మంది ప్రజలు భావిస్తున్నారు. ఇంకొందరు మరణాల శాతం తక్కువగా ఉండడంతో తమకేమీ కాదనే మొండితనంతో ఉంటున్నారు. ప్రధానంగా యూత్ ఇలా ఫీలవుతున్నారు. అందుకే ఎక్కువ మంది ముఖానికి మాస్కు ధరించడం లేదు. అందుకే కాస్త జాగ్రత్తగా ఉండండి.. ఆరోగ్యం కాపాడుకోండి.




పండగకి ఊరెళ్తున్నారా.. ఈ యాప్ ఇన్ స్టాల్ చేసుకుంటే మీ ఇల్లు సేఫ్..!

సిగిరెట్ తాగే వారికి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం

వీరిద్దరూ భార్యాభర్తలు.. విడాకులు కూడా తీసుకున్నారని ఎంతమందికి తెలుసు?

అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?

తెరాస పార్టీ బీజేపీ ని కాకుండా బండి ని టార్గెట్ చేయడంలో మర్మం ఏంటి..?

ఐటీఐఆర్ ప్రాజెక్టును పునరుద్దరించండి

తిరుపతిలో వైసీపీ ఓడిపోతుందా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>