PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/bird-flu-effect-in-andhra-pradeshb08c7047-d5a7-412f-ba05-03f336532486-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/bird-flu-effect-in-andhra-pradeshb08c7047-d5a7-412f-ba05-03f336532486-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా అలజడి రేపుతున్న బర్డ్ ఫ్లూ భయం ఏపీని కూడా వదలడంలేదు. ఇప్పటికే కొన్నిచోట్ల కాకులు చనిపోతే.. వాటి దగ్గరనుంచి భయపడి పారిపోతున్నారు ప్రజలు. వెంటనే అధికారులకు సమాచారమిచ్చి హడావిడి చేస్తున్నారు. అయితే నిజా నిజాలు తెలుసుకోకుండా ఇలాంటి విషయాలపై తప్పుడు ప్రచారాలు చేయొద్దని, లేనిపోని భయాందోళనలు సృష్టించొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చికెన్ అమ్మకాలపై కూడా బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ పడుతుందని అంచనా వేస్తున్నారు నిపుణులు. గతంలో బర్డ్ ఫ్లూ భయాందోళనల సమయంలో రాష్ట్రంలో చికెన్ అమ్మbird flu;yajamanya;kerala;andhra pradesh;gujarat - gandhinagar;district;karnataka 1;kannada;industry;minister;chicken;central governmentఏపీలో బర్డ్ ఫ్లూ భయం.. ఇతర రాష్ట్రాల పౌల్ట్రీ వాహనాలపై నిషేధం..ఏపీలో బర్డ్ ఫ్లూ భయం.. ఇతర రాష్ట్రాల పౌల్ట్రీ వాహనాలపై నిషేధం..bird flu;yajamanya;kerala;andhra pradesh;gujarat - gandhinagar;district;karnataka 1;kannada;industry;minister;chicken;central governmentFri, 08 Jan 2021 08:00:00 GMTచికెన్ అమ్మకాలపై కూడా బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ పడుతుందని అంచనా వేస్తున్నారు నిపుణులు. గతంలో బర్డ్ ఫ్లూ భయాందోళనల సమయంలో రాష్ట్రంలో చికెన్ అమ్మకాలు పడిపోయాయి. కరోనా కేసుల విజృంభణ సమయంలో కూడా చికెన్ రేట్లు దారుణంగా పడిపోయాయి.

ఏపీలో బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు లేకపోయినా.. ఇతర రాష్ట్రాల్లో కేసులు బయటపడటంతో పౌల్ట్రీ యాజమాన్యం తీవ్రంగా భయపడుతోంది. కేరళలోని అలప్పుజ, కొట్టాయం జిల్లాల్లో కోళ్లు, బాతులు కోళ్లు సహా 69 వేలకు పైగా పక్షుల్ని ఖననం చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అక్కడ పౌల్ట్రీ పరిశ్రమకు ప్రభుత్వం నష్టపరిహారం  చెల్లిస్తూ కోళ్లు, బాతుల్ని చంపేస్తోంది. ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం నామమాత్రంగానే ఉందంటూ.. ఇండస్ట్రీ వర్గాలు వాపోతున్నాయి. అదే సమయంలో ఏపీ సహా పొరుగు రాష్ట్రాల్లో కూడా కేరళనుంచి వచ్చే పౌల్ట్రీ వాహనాలపై నిషేధం విధించారు. పొరుగు రాష్ట్రాలనుంచి పౌల్ట్రీ ఉత్పత్తులను అనుమతించాలన్నా వణికిపోతున్నారు.

దేశంలో మరిన్ని రాష్ట్రాలకూ బర్డ్‌ ఫ్లూ వ్యాపిస్తోంది. ఇప్పటికే కేరళ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్ ‌లో ఈ కేసులు బయట పడినట్టు కేంద్రం ప్రకటించింది. హరియాణాలోని పంచ్‌ కుల ప్రాంతంలో కోళ్ల ఫారాల్లో కోళ్లు చనిపోతుండటంతో అక్కడ రెడ్‌ అలర్ట్  ప్రకటించారు. తాజాగా కర్నాటక, ఉత్తర్ ‌ప్రదేశ్‌, గుజరాత్ ‌లో అప్రమత్తత ప్రకటించారు. ఈ రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ కేసులేవీ ఇంకా నిర్ధారణ కాలేదు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో కాకులు చనిపోవడంతో.. కేరళ సరిహద్దు జిల్లాలన్నింటినీ అప్రమత్తం చేసినట్టు కర్నాటక ఆరోగ్య మంత్రి తెలిపారు. ఉత్తర్ ‌ప్రదేశ్‌లోని సోన్ భద్ర జిల్లా డాలా ప్రాంతంలో 9 కాకులు మృతిచెందాయి. దీంతో అక్కడ కూడా అధికారులు అప్రమత్తం అయ్యారు.

ప్రస్తుతానికి ఏపీలో కేసులు లేకపోయినా.. ఇతర రాష్ట్రాలనుంచి వచ్చే పక్షులు, విదేశాలనుంచి వలస వచ్చే పక్షులతో ముప్పు పొంచి ఉందనే అనుమానాలున్నాయి. అందుకే అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. 


రామ్ రెడ్ పై మాములు అంచనాలు లేవుగా.. 7 భాషల్లో..?

సిగిరెట్ తాగే వారికి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం

వీరిద్దరూ భార్యాభర్తలు.. విడాకులు కూడా తీసుకున్నారని ఎంతమందికి తెలుసు?

అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?

తెరాస పార్టీ బీజేపీ ని కాకుండా బండి ని టార్గెట్ చేయడంలో మర్మం ఏంటి..?

ఐటీఐఆర్ ప్రాజెక్టును పునరుద్దరించండి

తిరుపతిలో వైసీపీ ఓడిపోతుందా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>