PoliticsSreekanth Eeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pongalb8cf7339-bf7c-4458-bdcb-713d0053f4cf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pongalb8cf7339-bf7c-4458-bdcb-713d0053f4cf-415x250-IndiaHerald.jpgసంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్ళు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమయింది. హైదరాబాద్‌ - విశాఖపట్నం- హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ - తిరుపతి మధ్య పలు సర్వీసులను నడపనున్నట్టు తెలిపింది. హైదరాబాద్‌ - విశాఖల మధ్య జనవరి 9-16 వరకు విశాఖ - హైదరాబాద్‌ల మధ్య జనవరి 10-17 తేదీల్లో ప్రతి రోజు ఈ రైళ్ళు నడవనున్నాయి. సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి ప్రత్యేక రైలు జనవరి 12న మాత్రమే నడవనుంది. pongal;kranthi;kranti;tiru;makar sakranti;amarnath cave temple;vijayawada;andhra pradesh;rtc;anakapalle;sankranthi;vishakapatnam;january;tirupati;festival;srikalahasti;nalgonda;husband;secunderabad;letter;chirala;sattenapalle;tuni;train;tenali;renigunta;rajahmundryసంక్రాంతి స్పెషల్ ట్రైన్స్ వివరాలివే..?సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్ వివరాలివే..?pongal;kranthi;kranti;tiru;makar sakranti;amarnath cave temple;vijayawada;andhra pradesh;rtc;anakapalle;sankranthi;vishakapatnam;january;tirupati;festival;srikalahasti;nalgonda;husband;secunderabad;letter;chirala;sattenapalle;tuni;train;tenali;renigunta;rajahmundryFri, 08 Jan 2021 22:41:28 GMTతెలుగు ప్రజలకు పెద్ద పండగల్లో ఒకటి సంక్రాంతి. ముఖ్యంగా ఏపీ ప్రజలకు అతి పెద్ద పండుగ సంక్రాంతే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతి సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్ళడానికి ముందుగానే బస్సు, ట్రైన్ టికెట్లు బుక్ చేసుకుంటారు. ఇక పండగ సమయంలో బస్టాండ్, రైల్వే స్టేషన్ లు కిక్కిరిసి పోతుంటాయి. ప్రయాణికులు రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రతి సంవత్సరం ఆర్టీసీ, రైల్వేలు ప్రత్యేక సర్వీసులు నడుపుతుంటాయి.

ఇక ఈ ఏడాది కూడా సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్ళు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమయింది. హైదరాబాద్‌ - విశాఖపట్నం- హైదరాబాద్‌ అలానే సికింద్రాబాద్‌ - తిరుపతి మధ్య పలు సర్వీసులను నడపనున్నట్టు తెలిపింది. హైదరాబాద్‌ - విశాఖల మధ్య జనవరి 9 (శనివారం)నుంచి  జనవరి  16 వరకు ఈ రైళ్ళు నడవనున్నాయి. హైదరాబాద్‌ - విశాఖ రైలు (07451) హైదరాబాద్‌లో రాత్రి 10.15 గంటలకు బయల్దేరి మర్నాడు మధ్యాహ్నం 1 2గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఇక విశాఖ - హైదరాబాద్‌  రైలు (07452) రైలు  జనవరి  10 నుంచి 17 వరకు ప్రతి రోజు నడవనున్నాయి. విశాఖలో ప్రతి రోజూ రాత్రి 8.45 గంటలకు బయల్దేరి మర్నాడు ఉదయం 10.50 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం పట్టణం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, అన్నవరం, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగనున్నాయి. 

అయితే సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి  రైలు (07453)ఒక్కరోజు మాత్రమే నడవనుంది. జనవరి 12న రాత్రి 7.40 నిమిషాలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి జనవరి 13 ఉదయం 7.50గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు ఖాజీపేట, వరంగల్‌, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగనుంది.



బాలయ్యకు జగన్ ఛాన్స్ ఇస్తారా? వైసీపీ లెక్కలో పెట్టుకోవడం లేదా?

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. ఏంటంటే..

రైతు సంఘాలతో కేంద్ర సమావేశం.. ఏం మాట్లాడారంటే..

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sreekanth E]]>